Best Phones Under Rs 1 Lakh : టెక్నాలజికి అనుగుణంగా ఎన్నో స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లోకి లాంచ్ అవుతున్నాయి. ప్రీమియం ఫీచర్స్ తో హై ఎండ్ మొబైల్స్ ను టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు తీసుకొస్తున్నాయి. వీటిలో స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, డిస్ప్లే, కెమెరా, బ్యాటరీ ఫీచర్స్ అద్భుతంగా ఉంటున్నాయి. అయితే ధర కాస్త ఎక్కువ అయినప్పటికీ ఈ మొబైల్స్ దిమ్మతిరిగే ఫీచర్స్ తో ఆకట్టుకుంటున్నాయి. మరి ఇండియాలో లక్షలోపు ఉన్న టాప్ 4 మొబైల్స్ ఏంటి? వాటి ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం.
Galaxy S25+ Series –
Samsung Galaxy తాజాగా AI ఫీచర్లతో Galaxy S25 సిరీస్‌ను ప్రారంభించింది. ఇందులో అదిరిపోయే బెస్ట్ మెుబైల్స్ ఉన్నాయి. Galaxy S25+ సిరీస్ XXGB LPDDR5x RAMతో Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల QHD+ AMOLED 2X LTPO డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది Android 15 ఆధారంగా One UI 7పై నడుస్తుంది. ఈ ఫోన్ 12GB+256GB స్టోరేజ్ తో పాటు 12GB+512GB స్టోరేజ్ తో వచ్చేసింది. Galaxy S25+ రెండు రంగులలో అందుబాటులో ఉంటుంది నేవీ, సిల్వర్ షాడో. ఇక 12GB+256GB మెుబైల్ ధర రూ.99,999 కాగా 12GB+512GB మెుబైల్ ధర రూ.111999.
iphone 16 –
iPhone 16 Pro ఫీచర్స్ అదిరిపోయేలా ఉన్నాయి. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.3 అంగుళాల సూపర్ రెటినా XDR ప్యానెల్ ఉంది. ఇది అధునాతన AI సామర్థ్యాల కోసం A18 ప్రో చిప్ సెట్ తో వచ్చేసింది. 16 కోర్ న్యూరల్ ఇంజిన్ తో పనిచేస్తుంది. ఆపిల్ గేమింగ్ కోసం హార్డ్‌వేర్ యాక్సిలరేటెడ్ రే ట్రేసింగ్‌ను కూడా అందించింది. ఇది ప్రస్తుతం iOS 18.2లో నడుస్తుంది. వివిధ రకాల Apple ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను హోస్ట్ చేస్తుంది. కెమెరా విషయానికొస్తే… స్మార్ట్‌ఫోన్‌లో 48 MP ఫ్యూజన్ కెమెరా క్వాడ్-పిక్సెల్ సెన్సార్, 48 MP అల్ట్రా వైడ్ సెన్సార్‌తో పాటు 12 MP 5x టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. కెమెరా కంట్రోల్ బటన్‌తో వచ్చేసింది. ఇక డిస్ ప్లే, బ్యాటరీ, ప్రాసెసర్ ఫీచర్స్ సైతం అదిరిపోయేలా ఉన్నాయి. ఇక ఈ మెుబైల్ ఆఫర్ లో రూ.లక్షలోపే కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది.
Samsung Galaxy Z Fold4 –
Samsung Galaxy Z Fold4 ధర 12GB RAM + 512GB స్టోరేజ్ ధర రూ.96,800. ఇది 15.73 సెం.మీ (6.2-అంగుళాల) కవర్ స్క్రీన్, 19.21 సెం.మీ (7.6-అంగుళాల) మెయిన్ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది Qualcomm Snapdragon 8+ Gen 1తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50MP + 12MP + 10MP బ్యాక్ కెమెరా, 10MP + 4MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
OnePlus Open –
ఈ మెుబైల్ 16GB RAM + 512GB స్టోరేజ్ ధర రూ.99,999. ఇది కవర్ డిస్‌ప్లే 6.31” (16.03 సెం.మీ.) 2K రిజల్యూషన్‌తో డ్యూయల్ ప్రోఎక్స్‌డిఆర్ డిస్‌ప్లేలతో వచ్చేసింది. సిరామిక్ గార్డ్ డ్యూయల్ డిస్‌ప్లేతో వచ్చేసిన ఈ మెుబైల్ ప్రస్తుతం రూ.లక్షలోపే అందుబాటులో ఉంది.
ALSO READ : స్మార్ట్ ఫోన్ అప్డేట్ చేయకపోతే.. ఈ సమస్యలు వస్తాయి జాగ్రత్త!