BigTV English

Ragi Face Scrub: రాగి స్క్రబ్‌తో బోలెడు బెనిఫిట్స్

Ragi Face Scrub: రాగి స్క్రబ్‌తో బోలెడు బెనిఫిట్స్

Ragi Face Scrub: చలికాలంలో చర్మం పొడిగా మారుతుంది. అంతే కాకుండా నిర్జీవంగా తయారవుతుంది. ఈ సీజన్‌లో చర్మ సంబంధిత సమస్యలు కూడా పెరుగుతాయి. అయితే ఈ సమస్యల నుండి బయటపడటానికి చాలా మంది మార్కెట్‌లో దొరికే కొన్ని స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కొని వాడుతుంటారు. కానీ వీటిని ఎక్కువగా వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. మరి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చర్మ సమస్యలను తగ్గించుకోవడంతో పాటు గ్లోయింగ్ స్కిన్ కోసం కొన్ని సహజ పదార్థాలను వాడటం మంచిది. వీటి సహాయంతో ముఖం అందంగా మెరిసిపోతుంది. ఇదిలా ఉంటే ముఖం అందంగా మార్చడానికి రాగి పిండి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిలోని పోషకాలు చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. అంతే కాకుండా జిడ్డు చర్మాన్ని తొలగిస్తుంది. మరి గ్లోయింగ్ స్కిన్ కోసం రాగి పిండిని ఎలా ఉపయోగించాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


రాగి పిండిలో అమైనో ఆమ్లాలు , ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఈ గుణాలు చర్మాన్ని పోషించడమే కాకుండా రిపేర్ చేయడంలో కూడా ఉపయోగపడతాయి.అంతే కాకుండా వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్. చలికాలంలో దెబ్బతిన్న చర్మాన్ని సరిచేయడంలో వృద్ధ్యాప్యాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. డ్రైనెస్, డల్ నెస్, స్కిన్ సెన్సివిటీతో పోరాడుతున్న వారు రాగిపిండితో తయారు చేసిన స్క్రబ్ ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మరి రాగి పిండిని ముఖానికి వాడితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1.రాగి, కొబ్బరి నూనెతో స్క్రబ్:


కావాల్సిన పదార్థాలు:
రాగి పిండి – 1 టేబుల్ స్పూన్
కొబ్బరి నూనె- 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం: రాగి పిండిలో కొబ్బరి నూనె వేసి మిక్స్ చేయండి. తర్వాత దీనిని పేస్ట్ లాగా చేసి ముఖానికి అప్లై చేయండి. 15- 20 నిమిషాల పాటు అలాగే ఉంచి ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేయండి. ఇలా తరుచుగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

చలికాలంలో చర్మం పొడిగా మారడం అనేది కామన్. రాగి, కొబ్బరినూనెతో స్క్రబ్ తయారు చేసుకుని వాడటం వల్ల ఈ సీజన్లో అనేక ప్రయోజనాలు ఉంటాయి. కొబ్బరి నూనె అద్భుతమైన మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. అంతే కాకుండా చలికాలంలో డ్రై స్కిన్ సమస్యను కూడా తగ్గిస్తుంది.

2. రాగి, అలోవెరాతో స్క్రబ్:

కావాల్సినవి:

రాగి పిండి – 1 టేబుల్ స్పూన్
అలోవెరా జెల్- 1 టేబుల్ స్పూన్
టమాటో రసం – 1 టేబుల్ స్పూన్

Also Read: మెడ, మోచేతులపై డార్క్ నెస్ క్షణాల్లో.. పోగొట్టే చిట్కాలు

తయారీ విధానం: పైన చెప్పిన పదార్థాలను అన్నింటినీ ఒక బౌల్ లోకి తీసుకుని బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాలు ఆగిన తర్వాత ముఖాన్ని శుభ్రం చేయాలి. ఇలా తరచుగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటాయి.

చలికాలంలో చర్మ రంధ్రాలు మూసుకుపోవడం చర్మం డల్‌గా మారుతుంది. ఇలాంటి సమయంలోనే రాగి పిండితో తయారు చేసిన ఫేస్ స్క్రబ్ వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×