CM Revanth Reddy: నారాయణపేట జిల్లా చంద్రవంచలో సీఎం రేవంత్ రెడ్డి నాలుగు పథకాలను ప్రారంభించారు. రైతు భరోసా చెక్కులను సీఎం రైతులకు అందజేశారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల జారీ పథకాలను సీఎం రేవంత్ ప్రారంభించారు.
ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్నారు. ఆరు గ్యారంటీల్లో భాగంగా కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలను ప్రారంభించామని అన్నారు. రైతులతో కాంగ్రెస్ ప్రభుత్వానిది వీడదీయరాని అనుబంధమని చెప్పారు. రైతుల బాధలను అర్థం చేసుకని ఉచిత్ విద్యుత్ పథకాన్ని ప్రారంభించిందే కాంగ్రెస్ అని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే రైతు రాజ్యమని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేస్తున్నామని సీఎం చెప్పుకొచ్చారు.
తెలంగాణ రైతుల కళ్లల్లో ఆనందం కోసమే రైతు భరోసా ఇస్తున్నామన్నారు. ఇవాళ రాత్రి 12 గంటల తర్వాత రైతు భరోసా కింద ఎకరానికి రూ.12వేలు రైతుల అకౌంట్లలో జమ అవుతాయని చెప్పారు. ‘రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేశాం. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా ఉద్యోగాలిస్తున్నాం. ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిది. ఇది ప్రజల కోసం తీసుకొచ్చిన మార్పు.. ఇది ప్రజా పాలన. పేదవారికి ఇందిరమ్మ ఇల్లు అని పేరు తీయగానే వైఎస్సార్ గుర్తుకు వస్తారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలే రాజులు.. ప్రజలే పాలకులు.. ప్రజల వద్దకే అధికారులు, రాజకీయ నాయకులు వెళ్లాల్సిందే’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
‘భూమి లేని రైతు కూలీల కోసం ఇందిరమ్మ ఆత్మయ భరోసా పథకం తీసుకొచ్చాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో 10 లక్షల కుటుంబాలకు మేలు జరుగబోతుంది. గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం పేదలకు రేషన్ కార్డులు ఇవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం. 2004-14 మధ్య కొడంగల్‌కు 34వేల ఇందరమ్మ ఇండ్లు తీసుకొచ్చాం. వచ్చే నాలుగేళ్లలో కొడంగల్‌కు మరో 4వేల ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. గతంలో అధికారులు, కలెక్టర్లు గ్రామానికి రావడం ఎప్పుడైనా చూశారా..? అధికార యంత్రాంగమంతా చంద్రవంచకు వచ్చింది. అధికారులను ప్రజల దగ్గరకు పంపించి సమస్యలు తెలుసుకుంటున్నాం’ అని చెప్పారు.
Also Read: CM Revanth Reddy: ఫోర్త్ సిటీలో రూ.3500 కోట్లతో.. ఏఐ డేటా సెంటర్..
కాళేశ్వరం కూలినా రికార్డ్ స్థాయిలో పంటలు పండేలా చేశాం. బీఆర్ఎస్ పాలనలో పాలమూరు ప్రాజెక్టుల్ని ఎందుకు పూర్తి చేయలేదు. అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను ఏమనాలి..? కేసీఆర్‌కు ప్రజా సమస్యలపై చర్చించే బాధ్యత లేదా..? ఫామ్‌హౌస్‌లో పడుకుని పరిపాలన చేస్తామంటే కుదరదు. అధికారులు గ్రామాలకు వెళ్తే చిల్లర పంచాయితీలు చేస్తున్నారు. కొడంగల్‌ను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు.. 1300 ఎకరాలు సేకరించాలని చూశాం. కొడంగల్ ప్రజలకు నా సోదరుడు తిరుపతి రెడ్డి అండగా ఉంటారు. ఏ పదవి లేకుండా ఆయన ప్రజలకు సేవ చేస్తుంటే విమర్శలు చేస్తున్నారు. మమ్మల్ని నమ్మిన ప్రజలకు అండగా ఉంటాం’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.