Washing machines for bachelors: ఇంట్లో పని మనుషులు దొరకక ఇబ్బంది పడుతున్నారా? లేదా లాండ్రీ షాపులకు ఇచ్చి వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారా? అయితే.. ఈ రోజే ఒక మంచి సెమీ-ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌ను ఇంటికి తెచ్చుకోండి. ఫుల్లీ ఆటోమేటిక్ మెషీన్లతో పోలిస్తే.. సెమీ-ఆటోమేటిక్ మోడల్స్ చాలా తక్కువ ధరలో లభిస్తాయి. అంతే కాకుండా ఇవి తక్కువ కరెంట్, నీటిని వినియోగించుకుంటాయి. బట్టలను మాన్యువల్‌గా వాష్ చేసుకునే అవకాశం ఉండటం వల్ల ఉద్యోగాలు చేసుకునే బ్యాచిలర్స్‌కు, కపుల్స్‌కు ఇవి పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. ప్రస్తుతం మార్కెట్లో ట్రెండింగ్‌లో ఉన్న టాప్ 5 సెమీ-ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లు, వాటి ధరల వివరాలు మీకోసం.
ఎల్జీ బ్రాండ్‌కు మార్కెట్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 7 కేజీల కెపాసిటీ కలిగిన.. ఈ సెమీ-ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ చిన్న కుటుంబాలకు, కపుల్స్‌కు చక్కగా సరి పోతుంది. ఇందులో.. ఉన్న కాలర్ స్క్రాబర్ బట్టలపై ఉన్న మొండి మరకలను ఈజీగా తొలగిస్తుంది. ఈ మోడల్ ధర మార్కెట్లో సుమారు రూ. 10,500 నుంచి రూ.11,500 మధ్య లభిస్తోంది.5-స్టార్ రేటింగ్ ఉండటం వల్ల కరెంట్ బిల్లు కూడా చాలా తక్కువగా వస్తుంది.
శాంసంగ్ అందించిన ఈ ఎయిర్ టర్బో డ్రై సిస్టమ్ ఉన్న వాషింగ్ మెషీన్ బట్టలను చాలా త్వరగా ఆరేలా చేస్తుంది. దీని రస్ట్-ఫ్రూఫ్ బాడీ ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది. చూడటానికి చాలా ట్రెండీగా ఉండే.. ఈ మెషీన్ ధర సుమారు రూ. 10,990 నుంచి రూ. 11,990 వరకు ఉంది.తక్కువ స్థలంలో.. సర్దుబాటు అయ్యే ఈ మోడల్ బ్యాచిలర్ రూమ్‌లకు పర్ఫెక్ట్ ఛాయిస్.
కాస్త ఎక్కువ కెపాసిటీ కావాలనుకునే.. కపుల్స్ కోసం విర్లుపూల్ ఈ మోడల్‌ను అందిస్తోంది. ఇందులో సూపర్ సోక్ టెక్నాలజీ ఉంటుంది. అంతే కాకుండా ఇది మురికి బట్టలను నీటిలో నానబెట్టి శుభ్రం చేస్తుంది. వాటర్ ప్రూఫ్ కంట్రోల్ ప్యానెల్ దీని ప్రత్యేకత. ఈ వాషింగ్ మెషీన్ ధర సుమారు రూ.11,200 నుంచి రూ.12,500 శ్రేణిలో అందుబాటులో ఉంది.
ఇద్దరు వ్యక్తులు ఉండే.. చిన్న రూమ్‌లు లేదా అపార్ట్మెంట్లలో.. ఉండే వారికి గోద్రెజ్ 6.2 కేజీ మెషీన్ అద్భుతమైన ఆప్షన్. ఇది తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. అంతే కాకుండా దీనిని ఆపరేట్ చేయడం కూడా చాలా ఈజీ. టెక్-ఎనేబుల్డ్ వాష్ ప్రోగ్రామ్స్ బట్టలను ఈజీగా ఉతుకుతాయి. ఈ మోడల్ ధర చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా రూ.8,500 నుంచి రూ.9,500 లోపే లభిస్తుంది.
పాన్సోనిక్ బ్రాండ్‌కు చెందిన ఈ 6.5 కేజీ వాషింగ్ మెషీన్ పవర్ఫుల్ మోటార్‌తో వస్తుంది. ఇది బట్టలను ఎలాంటి డ్యామేజ్ లేకుండా శుభ్రం చేస్తుంది. దీని ఎండ్-ఆఫ్-సైకిల్ బజ్జర్ సిస్టమ్ వాషింగ్ పూర్తయిన వెంటనే ..మనకు అలర్ట్ ఇస్తుంది. ఈ మోడల్ ధర సుమారు రూ.9,000 నుంచి రూ.10,000 మధ్య ఉంది.
Also Read: కెన్‌స్టార్ వాషింగ్ మెషీన్‌పై..ఏకంగా 50 శాతం డిస్కౌంట్!
1.ఫుల్లీ ఆటోమేటిక్ మెషీన్లతో పోలిస్తే.. ధర చాలా తక్కువగా ఉంటుంది.
2.ఎలాంటి కఠినమైన ప్లంబింగ్ దీనికి అవసరం లేదు.
3.పవర్ కట్ అయినప్పుడు కూడా బట్టలను మాన్యువల్‌గా ఉతికేసువచ్చు.
4.తక్కువ కరెంట్, తక్కువ డిటర్జెంట్ దీనికి అవసరం ఉంటుంది.
తక్కువ బడ్జెట్లో ఎక్కువ కాలం పాడవకుండా ఉండే.. వాషింగ్ మెషీన్ కోరుకునే వారికి పైన తెలిపిన సెమీ-ఆటోమేటిక్ మోడల్స్ బస్ట్ అని చెప్పొచ్చు. మీ అవసరాలకు, బడ్జెట్‌కు సరిపోయే ఒక మంచి మెషీన్‌ను ఈరోజే ఎంచుకోండి!