Best smart tv under 15000: ఈ రోజుల్లో ఎంటర్ టైన్‌మెంట్ అంటే.. కేవలం థియేటర్లకు వెళ్లడమే కాదు.. ఇంట్లోనే కూర్చుని ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఎంజాయ్ చేయడం అలవాటు అయిపోయింది. అందు కోసం ప్రతి ఇంట్లోనూ.. ఒక మంచి స్మార్ట్ టీవీ ఉండటం కామన్ అయింది. అయితే.. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా.. తక్కువ బడ్జెట్‌లో అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉండే టీవీ కొనాలని అందరూ కోరుకుంటారు. ఇలాంటి వారి కోసం ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.15,000 లోపు ధరలో లభించే బెస్ట్ టాప్ 5 స్మార్ట్ టీవీల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
షియోమి బ్రాండ్ నుంచి వస్తున్న ఈ స్మార్ట్ టీవీ బడ్జెట్ కస్టమర్లకు ఫస్ట్ ఆప్షన్‌గా ఛాయిస్‌గా నిలుస్తోంది. ఇది మెటాలిక్ బెజెల్-లెస్ డిజైన్‌తో వస్తుంది. డాల్బీ ఆడియో, డిటిఎస్ ఎక్స్ సపోర్ట్, గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఇది పని చేస్తుంది. ఇందులో 200 పైగా ఫ్రీ లైవ్ ఛానెల్స్ లభిస్తాయి.ఫ్లిప్‌కార్ట్‌లో దీని సుమారు ధర రూ. 10,734 నుంచి ప్రారంభమవుతుంది.
ప్రపంచ ప్రఖ్యాత సామ్సంగ్ బ్రాండ్‌ను ఇష్టపడే వారికి ఈ మోడల్ సరిగ్గా సరిపో తుంది. ప్యూర్ కలర్ టెక్నాలజీ, హైపర్ రియల్ పిక్చర్ ఇంజిన్, బెజెల్-ఫ్రీ డిజైన్‌తో ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. స్మార్ట్ థింగ్స్ యాప్ సపోర్ట్ దీని ప్రత్యేకత.20 వాట్స్ సౌండ్ అవుట్‌పుట్ లభిస్తుంది. దీని సుమారు ధర రూ. 12,749 వరకు ఉంటుంది.
తక్కువ ధరలో క్వాలిటీ డిస్‌ప్లే కోరుకునే వారికి మోటరోలా క్యూఎల్‌ఈడీ టీవీ అద్భుతమైన ఆప్షన్. ఈ బడ్జెట్‌లో క్యూఎల్‌ఈడీ టెక్నాలజీ దొరకడం బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది అద్భుతమైన కలర్ కాంట్రాస్ట్ , బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. అంతేకాకుండా.. ఇందులో పవర్ ఫుల్ 40 వాట్స్ సౌండ్ అవుట్‌పుట్ స్పీకర్లు ఇస్తారు. గూగుల్ టీవీ సపోర్ట్ కూడా ఇందులో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో కలిపి దీని ధర సుమారు రూ. 11,636 వరకు ఉంటుంది.
సాధారణ బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు కోరుకునేవారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. హెచ్‌డీ రెడీ డిస్‌ప్లే, బెజెల్-లెస్ డిజైన్ ,24 వాట్స్ డాల్బీ ఆడియో స్పీకర్లతో ఇది మంచి సౌండ్ ఇస్తుంది. గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా దీనిలో లభిస్తుంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో వంటి ఓటీటీ యాప్స్ సజావుగా రన్ అవుతాయి. ఈ టీవీ సుమారు రూ. 10,349 ధరలో లభిస్తుంది.
Also Read: బ్యాంక్ అకౌంట్ సేఫ్‌గా ఉండాలా?ఈ 5 పనులు ఈరోజే చేయండి!
అమెజాన్ ఫైర్ టీవీ.. బిల్ట్-ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో.. వస్తున్న ఈ రెడ్మి టీవీ కస్టమర్ల నుంచి మంచి స్పందన పొందుతోంది. అద్భుతమైన పిక్చర్ క్లారిటీ, డాల్బీ ఆడియో, అలెక్సా వాయిస్ కంట్రోల్ సపోర్ట్ ఇందులో లభిస్తుంది. ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లను ఈజీగా యాక్సెస్ చేయెచ్చు. దీని ధర సుమారు రూ. 10,999 నుంచి రూ. 12,000 మధ్యలో అందుబాటులో ఉంది.
రూ. 15,000 లోపు బడ్జెట్‌లో మీరు స్మార్ట్ టీవీ కొనాలనుకుంటే ఫ్లిప్‌కార్ట్‌లో పైన పేర్కొన్న ఆప్షన్లు బెస్ట్ అని చెప్పొచ్చు. మీ బడ్జెట్, సౌండ్, డిస్‌ప్లే ఆధారంగా వీటిలో మీకు నచ్చిన దాన్ని ఎంచుకుని మీ ఇంటి దగ్గరే అద్భుతమైన ఎంటర్ టైన్మెంట్ పొందండి!