E-Paper
Advertisement

గేమ్స్,ఫోటో యాప్స్ మీ లొకేషన్ ట్రాక్ చేస్తున్నాయా? ఇలా వెంటనే ఆపేయండి!

గేమ్స్,ఫోటో యాప్స్ మీ లొకేషన్ ట్రాక్ చేస్తున్నాయా? ఇలా వెంటనే ఆపేయండి!
Advertisement

Mobile location permissions: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో.. స్మార్ట్‌ఫోన్ ఉంది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మనం ఎన్నో రకాల యాప్స్‌ని ఉపయోగిస్తున్నాం. ముఖ్యంగా టైమ్ పాస్ కోసం ఆడే చిన్న చిన్న గేమ్‌లు, సెల్ఫీలు ఎడిట్ చేయడానికి.. వాడే ఫోటో యాప్స్ మన ఫోన్లలో కచ్చితంగా ఉంటున్నాయి. అయితే.. మనం ఎప్పుడైనా ఆలోచించామా.. అసలు ఫోటో ఎడిటింగ్ యాప్‌కి లేదా ఒక సాధారణ గేమ్‌కి మన లొకేషన్ ఎందుకు అవసరం? అని. ఇక్కడే అసలు విషయం దాగుంది.చాలా యాప్స్ మనకు తెలియకుండానే ..మనం ఎక్కడ తిరుగుతున్నామో, ఏ ప్రాంతంలో ఉంటున్నామో ఆ డేటాని బ్యాక్‌గ్రౌండ్‌లో రికార్డ్ చేస్తున్నాయి.

యాప్స్ లొకేషన్ ఎందుకు.. అడుగుతాయి?

మనం ఒక కొత్త యాప్‌ను డౌన్‌ లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే..అది రకరకాల పర్మిషన్స్ అడుగుతుంది. అందులో.. లొకేషన్ యాక్సెస్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఉదాహరణకు.. గూగుల్ మ్యాప్స్ లేదా ఉబర్ లాంటి ట్రావెల్ యాప్స్‌కి లొకేషన్ అవసరం కాబట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ..ఎలాంటి సంబంధం లేని ఆఫ్‌లైన్ గేమ్‌లు, ఫోటో ఫిల్టర్ యాప్‌లు, మ్యూజిక్ ప్లేయర్‌లు కూడా మన లొకేషన్ పర్మిషన్ అడుగుతుంటాయి. మనం కూడా ఎంతో సింపుల్‌గా ‘అలో’ లేదా ‘వైల్ యూజింగ్ ది యాప్’ (While using the app) అని క్లిక్ చేసేస్తుంటాం.

Advertisement

ఇలాంటి అనవసరమైన యాప్స్ మన లొకేషన్‌ను సేకరించి, థర్డ్-పార్టీ అడ్వర్టైజింగ్ కంపెనీలకు అమ్ముతుంటాయి. దీనివ ల్ల మనకు ఇష్టమైన ప్రొడక్ట్స్ యాడ్స్ రూపంలో ఫోన్ స్క్రీన్ పైకి రావడమే కాకుండా..మన పర్సనల్ మూమెంట్స్, ట్రావెల్ హిస్టరీ సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కే ప్రమాదం ఉంది. గూగుల్ లేటెస్ట్ ప్రైవసీ అప్‌డేట్స్ ప్రకారం..యూజర్ల అనుమతి లేకుండా డేటాను కలెక్ట్ చేసే యాప్‌లపై గూగుల్ ప్లే స్టోర్ కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ..మన ఫోన్ సేఫ్టీ మన చేతుల్లోనే ఉండటం ముఖ్యం.

లొకేషన్ పర్మిషన్స్ ఎలా ఆఫ్ చేయాలి?

మీ ఫోన్ ప్రైవసీని కాపాడుకోవడానికి, అనవసరమైన యాప్‌లు మీ లొకేషన్‌ను ట్రాక్ చేయకుండా నిలిపివేయడానికి ఈ కింది సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి.

ఆండ్రాయిడ్ ఫోన్లు:

Advertisement

మీ ఫోన్‌లోని Settings (సెట్టింగ్స్) ఓపెన్ చేయండి. అందులో Apps లేదా Apps & Notifications ఆప్షన్‌పై క్లిక్ చేయండి.తర్వాత See all apps పై నొక్కి మీ ఫోన్‌లో ఉన్న అన్ని యాప్‌ల లిస్ట్ చూడండి. ఇప్పుడు మీకు అనుమానం ఉన్న గేమ్ లేదా ఫోటో యాప్‌ను సెలెక్ట్ చేయండి. అందులో Permissions ఆప్షన్‌లోకి వెళ్లి, Location పై క్లిక్ చేయండి. అక్కడ Don’t allow లేదా Ask every time అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోండి. అంతే..ఆ యాప్ ఇకపై మీ లొకేషన్‌ను ఎప్పటికీ ట్రాక్ చేయలేదు.

Also Read: ఫ్లిప్‌కార్ట్‌లో రూ.15వేలలోపు.. బెస్ట్ 5 స్మార్ట్ టీవీలు ఇవే!

ఐఫోన్:

మీ ఐఫోన్‌లో Settings ఓపెన్ చేయండి. తర్వాత కిందకు స్క్రోల్ చేసి Privacy & Security పై క్లిక్ చేయండి. మొదటి ఆప్షన్ అయిన Location Services పై ట్యాప్ చేయండి. ఇక్కడ మీ ఫోన్‌లోని ఏ యాప్‌కి లొకేషన్ యాక్సెస్ ఉందో క్లియర్ స్పష్టంగా కనిపిస్తుంది. అనవసరమైన గేమ్ లేదా ఫోటో యాప్‌పై క్లిక్ చేసి, దాని పర్మిషన్‌ను Neverకి మార్చండి.

డిజిటల్ యుగంలో.. మన స్మార్ట్‌ఫోన్ మన ప్రైవసీకి అద్దం పడుతుంది. చిన్న నిర్లక్ష్యం మన పర్సనల్ డేటాను ఇతరుల పాలు చేస్తుంది. అందుకే.. ఇప్పటికీ మీ ఫోన్‌లో ఏయే యాప్‌లు లొకేషన్ పర్మిషన్ తీసుకుంటున్నాయో ఒక సారి చెక్ చేసుకోండి. అనవసరమైన యాప్స్‌కి.. లొకేషన్ యాక్సెస్ ఆఫ్ చేసి, మీ ప్రైవసీని కాపాడుకోండి!

Related News

మనసు మార్చుకున్న యాపిల్.. టచ్‌స్క్రీన్‌తో MacBook Pro లాంచ్, ధర ఎంతంటే?

ఇన్‌స్టంట్ గీజర్ Vs స్టోరేజ్ గీజర్..మీ ఇంటికి ఏది బెస్ట్?

ఫ్లిప్‌కార్ట్‌లో రూ.15వేలలోపు.. బెస్ట్ 5 స్మార్ట్ టీవీలు ఇవే!

BSNL చౌకైన ప్లాన్లు.. రోజుకు రూ.5, రూ.6 మాత్రమే.. 330 రోజుల వ్యాలిడిటీతో ఫ్రీ కాల్స్, డేటా!

రూ. 15,000 లోపే బెస్ట్ మినీ ఫ్రిజ్‌లు.. హాస్టలర్స్, బ్యాచిలర్స్‌కి సూపర్ ఛాయిస్!

యాపిల్ నుంచి మరో సంచలనం.. రూ.80 వేల లోపే శక్తివంతమైన A20 చిప్‌తో కొత్త ఐఫోన్!

చెవులకు క్లిప్‌లా ఫిట్ చేసుకోవచ్చు.. 32 గంటల బ్యాటరీతో రెడ్‌మీ కొత్త ఇయర్‌బడ్స్ లాంచ్!

Big Stories

Advertisement
×