Best Smartphones Under 20K : ఇండియాలో మిడ్ రేంజ్ మెుబైల్స్ కు ఉండే డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ డిమాండ్ ను ఆధారంగా చేసుకుని ఎప్పటికప్పుడు టాప్ బ్రాండ్ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థలని లేటెస్ట్ ఫీచర్స్ తో అతి తక్కువ ధరకే బెస్ట్ మొబైల్స్ ని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి ఇక ఈ ఏడాది సైతం ఎన్నో మొబైల్స్ అందుబాటులోకి వచ్చేసాయి వాటిని బెస్ట్ ఆప్షన్స్ ఏంటో చూద్దాం.
అదిరిపోయే టాప్ బ్రాండ్ కంపెనీలకు చెందిన ఎన్నో మొబైల్స్ రూ.10వేల నుంచి రూ.20వేల రేంజ్ లో ఉన్నాయి. వాటి లిస్ట్ ఇదే
Motorola g45 5G –
Motorola g45 5G ధర రూ. 12,999. స్నాప్‌డ్రాగన్ 6s Gen 3 ఆక్టా-కోర్ ప్రాసెసర్, LPDDR4X మెమరీ, స్టైలిష్ వేగన్ లెదర్ ఫినిషింగ్, IP52 వాటర్ రిపెల్లెంట్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో 120 Hz, 16.51 cm (6.5) HD+ డిస్‌ప్లే, 5000 mAh Batteryతో వచ్చేసింది.
POCO X6 5G –
POCO X6 5G మెుబైల్ Snapdragon 7s Gen2 చిప్‌సెట్, వైల్డ్‌బూస్ట్ 2.0 గేమింగ్ ఆప్టిమైజేషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్, 16.94 సెం.మీ డిస్‌ప్లే, 2712 x 12710 పిక్సెల్స్ రిజల్యూషన్ తో రూ. 18,499కే అందుబాటులో ఉంది. AMOLED డిస్ ప్లే, 64 MP ప్రైమరీ కెమెరా ఉన్నాయి.
CMF by Nothing Phone 1 –
CMF బై నథింగ్ ఫోన్ 1 ధర రూ. 15,499. ఇది MediaTek డైమెన్సిటీ 7300 5G ప్రాసెసర్‌తో 16 GB RAM + 2 TB వరకు స్టోరేజ్ సదుపాయంతో వచ్చేసింది. ఇక పోర్ట్రెయిట్ సెన్సార్‌తో సోనీ 50 MP బ్యాక్ కెమెరా, 16 MP ఫ్రంట్ కెమెరా, 16.94 cm సూపర్ AMOLED డిస్‌ప్లే, 2000 nits వరకు గరిష్ట బ్రైట్నెస్, 120 Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్, Android 14 లాంటి అదిరే ఫీచర్స్ ఉన్నాయి. 5000 mAh బ్యాటరీ 33 W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.
Realme P1 Pro 5G –
Realme P1 Pro 5G ధర రూ. 20,999. బ్యాంక్ ఆఫర్‌లు, డిస్కౌంట్‌లతో రూ. 20,000లోపు కొనుగోలు చేయవచ్చు. ఇది ప్రో-XDR టెక్నాలజీతో 120 Hz AMOLED డిస్‌ప్లేతో వచ్చేసింది. TUV రైన్‌ల్యాండ్-సర్టిఫైడ్ 2160 Hz PWM డిమ్మింగ్, స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 5G చిప్‌సెట్, Sony LYT-600 OIS పోర్ట్రెయిట్ కెమెరా, SuperOIS టెక్నాలజీ, IP65 cm 1700 వాటర్ రెసిస్టెన్స్ ను కలిగి ఉంది.
Realme 12X 5G –
45 W SUPERVOOC ఛార్జ్, 5000 mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6100+ 6nm చిప్‌సెట్, 12.07 cm 120 Hz FHD + Screen, 50MP ప్రధాన కెమెరాతో డ్యూయల్ కెమెరా సెటప్ తో వచ్చేసింది.
Realme P1 5G –
Realme P1 5G ధర రూ. 15,999. ఇది 2400 x 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 16.94 cm (6.67 అంగుళాల) డిస్‌ప్లేతో వచ్చేసింది. 120Hz రిఫ్రెష్ రేట్, స్మార్ట్‌ఫోన్‌లో 6nm ప్రాసెస్‌తో డైమెన్సిటీ 7050 5G చిప్‌సెట్, ఆక్టా-కోర్, 8GB + 8GB డైనమిక్ RAM, 45W SUPERVOOC ఛార్జ్‌తో 5000mAh బ్యాటరీతో వచ్చేసింది.
REDMI Note 13 Pro 5G –
ఈ మెుబైల్ ధర రూ. 21,499. 120 Hz AMOLED 1.5K డిస్ ప్లే, డాల్బీ విజన్, 1800నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 తో వచ్చేసింది.
Realme P1 Speed 5G –
Realme P1 స్పీడ్ 5G ధర రూ. 17,999. 8 GB RAM + 128 GB ఇంటర్నల్ స్టోరేజ్, FHD+ రిజల్యూషన్, 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 64 MP AI- పవర్డ్ ట్రిపుల్ కెమెరా సెటప్, 16 MP ఫ్రంట్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, సింగిల్ ఛార్జ్, 33W ఫాస్ట్ ఛార్జింగ్, డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ తో వచ్చేసింది.
ALSO READ : యాపిల్ ఆ మజాకా! త్వరలోనే FaceID టెక్నాలజీతో స్మార్ట్ హోమ్ డోర్‌బెల్స్