Apple Smart Home Doorbell : టెక్ దిగ్గజం యాపిల్.. ఇప్పటికే ఎన్నో లేటెస్ట్ గ్యాడ్జెట్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక టెక్ ప్రపంచాన్ని శాసించే దిశగా తనదైన ముద్ర వేయటానికి ప్రయత్నిస్తున్న ఈ స్మార్ట్ గ్యాడ్జెట్ తయారీ సంస్థ.. త్వరలోనే అదిరిపోయే లేటెస్ట్ గ్యాడ్జెట్ ను పరిచయం చేయటానికి సిద్ధమవుతుంది. అదే FaceID టెక్నాలజీతో స్మార్ట్ హోమ్ డోర్‌బెల్.
యాపిల్ కంపెనీ స్మార్ట్ ఫోన్ అనుభవాన్ని మరింత మెరుగుపరిచే దిశగా లేటెస్ట్ గాడ్జెట్ ను తీసుకురావడానికి సిద్ధమవుతుంది. ఫేస్ ఐడీ టెక్నాలజీతో స్మార్ట్ హోమ్ బెల్స్ ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ గ్యాడ్జెట్ ప్రస్తుతం డిజైన్ దశలోనే ఉండటంతో 2025 చివరలో అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ విషయాన్ని తాజాగా బ్లూమ్ బర్గ్ నివేదిక తెలిపింది. ఇప్పటివరకూ ఈ గ్యడ్జెట్ కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏమీ లేనప్పటికీ తాజాగా నివేదిక తెలిపిన దాని ప్రకారం ఫీచర్స్ కిర్రాక్ గా ఉన్నాయనే చెప్పాలి.
FaceIDతో Apple స్మార్ట్ హోమ్ డోర్‌బెల్ –
అమెరికన్ మల్టీ నేషనల్ టెక్నాలజీ కంపెనీ అధునాతన ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్‌తో అనుసంధానించబడిన రాబోయే స్మార్ట్ హోమ్ డోర్‌బెల్‌పై పని చేస్తోందని బ్లూమ్ బర్గ్ తెలిపింది. అదనంగా, ఇది వైర్‌లెస్‌గా డెడ్‌బోల్ట్ లాక్‌కి కనెక్ట్ అయ్యి ఉంటుందని.. లాక్‌ని ను ఫేస్ తో లేదా బొటనవేలు ఫింగర్ ప్రింట్ తో అన్ లాక్ చేసే ఛాన్స్ ఉంటుందని తెలిపింది.
మార్క్ గుర్మాన్ నివేదిక ప్రకారం యాపిల్ తన స్మార్ట్ హోమ్ డోర్‌బెల్‌ను హోమ్‌కిట్ ప్రోటోకాల్‌తో ఏకీకృతం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న థర్డ్ పార్టీ స్మార్ట్ లాక్‌లతో పనిచేసే ఛాన్స్ కూడా ఉంది. దీంతో యాపిల్ కంపెనీ ఆ ప్రముఖ లాక్ తయారీ కంపెనీలతో వ్యూహాత్మక పార్ట్నర్ షిప్ ను కొనసాగించాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఆపిల్ తో సహా ఆ కంపెనీలన్నీ స్మార్ట్ హోమ్ లాక్ సిస్టమ్ కోసం ఆల్ ఇన్ వన్ సొల్యూషన్ కనుగొనే అవకాశం కనిపిస్తుంది.
యాపిల్ కంపెనీ ఈ స్మార్ట్ హోమ్ లాక్ సిస్టమ్ ను స్టార్ట్ చేస్తే అమెజాన్ రింగ్, గూగుల్ నెస్ట్ వంటి ప్లేయర్‌లతో గట్టి పోటీని ఎదుర్కునే అవకాశం ఉంది. అయితే రెండు ఉత్పత్తులు ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగిస్తాయి. అయితే అవి Apple FaceID టెక్నాలజీ ఫీచర్స్ ను మాత్రం కలిగి లేవు.
ఎలా పనిచేస్తుందంటే –
FaceID టెక్నాలజీతో iPhoneను అన్‌లాక్ చేసినట్లే, రాబోయే డోర్‌బెల్ సిస్టమ్ కూడా అదే విధంగా పని చేస్తుంది. డోర్స్ ను అన్ లాక్ చేశాక.. అనుమతులు పొందిన వారికి యాక్సెస్‌ను మంజూరు చేయడానికి యాపిల్ తన స్మార్ట్ హోమ్ డోర్ లాక్‌ని దాని సెక్యూర్ ఎన్‌క్లేవ్ చిప్ అనుసంధానం చేస్తుంది.
యాపిల్ డోర్‌బెల్ రాబోయే ప్రాక్సిమా వైర్‌లెస్ చిప్ తో పనిచేయనున్నట్లు తెలుస్తుంది. వచ్చే ఏడాది చివరి వరకు మార్కెట్‌లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ కంపెనీ థర్డ్-పార్టీ బ్రాండ్ ద్వారా ఈ ప్రొడెక్ట్ ను సేల్ చెయ్యెచ్చు లేదా లాజిటెక్, బెల్కిన్ Appleతో పార్ట్నర్ షిప్ ను కొనసాగించే ఛాన్స్ ఉంది.
ALSO READ : మనసుదోచే ఫీచర్స్ తో కొత్త ఐపాడ్స్.. ఎన్ని అప్డేట్సో!