CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక్క నిర్ణయంతో వారి దశ దిశ మారింది. మొన్నటి వరకు సరైన ఉపాధి అవకాశాలు అందక, ఇబ్బందులు ఎదుర్కొన్న వారు, నేడు ఆర్థికంగా బలోపేతమవుతున్నారు. అంతేకాదు తమ కుటుంబానికి పెద్దదిక్కుగా ఉంటూ, కుటుంబ పోషణలో కీలక పాత్ర పోషించనున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. మహిళలకు ఫ్రీ బస్సు పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం, ఆ వెంటనే గృహజ్యోతి పథకంతో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను అందిస్తోంది. అంతేకాదు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లను సైతం అందిస్తూ, మహిళలకు ఆర్థిక భరోసాను కల్పిస్తోంది. తాజాగా మహిళా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.
స్వయం సహాయక బృందాలకు స్వయం ఉపాధి కల్పించేలా తీసుకున్న ఈ నిర్ణయంతో, మహిళలకు ఉపాధికి కొదవ లేకుండా ఉండబోతోంది. రాష్ట్రంలో స్వయం సహాయక బృందాల మహిళలతో సోలార్ పవర్ ప్లాంట్ లు ఏర్పాటు చేసి, వారికి ఆర్థిక బలాన్ని అందించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా మొదటి విడతలో సుమారు 20031 ఎకరాల్లో సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా తొలి దశలో ఐదు జిల్లాలలో సోలార్ పవర్ ప్లాంట్లను స్వయం సహాయక మహిళా సంఘాలతో ఏర్పాటు చేయనున్నారు. రానున్న ఆరు నెలల్లో సోలార్ పవర్ ప్లాంట్ లను ఏర్పాటుచేసి వారిని కోటీశ్వరులను చేయాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యం.
Also Read: Sunny Leone: జానీ సిన్స్ భార్య సన్నీలియోన్‌కు నెలకు రూ.1000 ఆర్థిక సాయం.. అవాక్కయ్యారా?
అంతేకాదు మహిళా సంఘాలచే 150 ఎలక్ట్రికల్ బస్సులను సేకరించి వాటి నిర్వహణ బాధ్యతలను ఆర్టీసీకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఇప్పటికే సంబంధిత అధికారులకు సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ పథకం పూర్తిస్థాయిలో విజయవంతం అయ్యేందుకు అధికారులు ఇప్పటికే తగిన కార్యాచరణ పూర్తి చేశారు. తెలంగాణ మహిళలు కోటీశ్వరులు కావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.