Best Smart Phones Under 30,000 : ఈ ఏడాది టాప్ ఎండ్ స్పెసిఫికేషన్స్‌తో కొన్ని బెస్ట్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లోకి విడుదల అయ్యాయి. అయితే మీరు మంచి బ్యాటరీ లైఫ్ ఉన్న కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే? దాని కోసం వెతుకుతున్నట్టైతే, దానికి సంబంధించి కొన్ని ఫోన్ల వివరాలను మీ ముందుకు తీసుకొచ్చాం. మొత్తంగా రూ.30 వేలలోపు ఉన్న వివో, ఒప్పో, హానర్ వంటి టాప్ 5 బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్స్ డీటెయిల్స్ ఇక్కడ తెలుసుకుందాం.
Vivo V40e : ఈ Vivo V40e ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు సూపర్ స్పెసిఫికేషన్స్‌తో వచ్చింది. ఈ స్మార్ ఫోన్ 50 MP వైడ్ యాంగిల్ ప్రధాన కెమెరా, 8 MP అల్ట్రావైడ్ కెమెరాతో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో 50 MP వైడ్ యాంగిల్ సెల్ఫీ కెమెరాను అమర్చారు. అలా ఆకట్టుకునే కెమెరా సెటప్‌తో పాటు, ఈ Vivo V40e 5500mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.
Honor 200 : రూ.30 వేలలోపు మరో బెస్ట్ కెమెరా-సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్ హానర్ 200. ఈ స్మార్ట్ ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వచ్చింది. 50 MP ప్రధాన కెమెరా, 12 MP అల్ట్రావైడ్ కెమెరా, 2.5x ఆప్టికల్ జూమ్, 50x డిజిటల్ జూమ్‌తో కూడిన 50 MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఇంకా ఈ Honor 200 స్మార్ట్ ఫోన్ 5200 mAh బ్యాటరీ సామర్థ్యంతో నడుస్తుంది.
Oppo Reno 12 : ఈ Oppo Reno 12 AI తో పాటు కొన్ని ఆకట్టుకునే కెమెరా ఫీచర్లను కలిగి ఉంది. 50 MP ప్రధాన కెమెరా, 8 MP అల్ట్రావైడ్ కెమెరా, క్లోజ్-అప్ షాట్‌ల కోసం 2 MP మాక్రో లెన్స్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. మ్యాజిక్ ఎరేజర్ సహా మరిన్ని కెమెరా AI ఫీచర్లతో ఇది వచ్చింది. ఈ Oppo Reno12 5000 mAh బ్యాటరీతో ఎక్కువ సమయం పాటు పని చేస్తుంది.
Motorola Edge 50 Fusion : రూ. 30,000 లోపు ఉన్న బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్‌ల జాబితాలో Motorola Edge 50 Fusion కూడా ఒకటి. ఈ స్మార్ట్ ఫోన్ డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 50 MP ప్రధాన కెమెరా, 13 MP అల్ట్రావైడ్ కెమెరాను అమర్చారు. ఇంకా సెల్ఫీలను క్యాప్చర్ చేయడానికి 32 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కూడా ఇచ్చారు. మొత్తంగా ఈ ఎడ్జ్ 50 సిరీస్, ప్రత్యేకమైన డిజైన్, బెస్ట్ కెమెరాకు బాగా పాపులర్ అయింది. స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో మంచి పోటీనిస్తూ దూసుకెళ్తోంది!
Nothing Phone 2a Plus : నథింగ్ ఫోన్ 2aకు హై-ఎండ్ వెర్షన్ Nothing Phone 2a Plus. ఈ స్మార్ట్ ఫోన్ ఆకట్టుకునే కెమెరా ఫీచర్‌లతో వచ్చింది. స్పష్టమైన ఫొటోలను క్యాప్చర్ చేస్తుంది. 50 MP డ్యూయల్ కెమెరా సెటప్, 50 MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. అద్భుతమైన పనితీరు కోసం, ఈ స్మార్ట్‌ఫోన్ 5000 mAh బ్యాటరీను కలిగి ఉంది.
మరి ఇంకెందుకు ఆలస్యం.. తక్కువ ధరలోనే బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వినియోగదారులు ఈ మెుబైల్స్ ను ట్రై చేసేయండి.