Built-in GPS Smartwatches: ఒకప్పుడు బిల్ట్-ఇన్ జీపీఎస్ ఉన్న స్మార్ట్‌వాచ్ కొనాలంటే చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కాలం మారింది. కేవలం రూ.10 వేల లోపు బడ్జెట్‌లోనే అద్భుతమైన ఫీచర్లతో కూడిన వాచ్‌లు మార్కెట్లోకి వచ్చేశాయి. ఫోన్ వెంట తీసుకెళ్లకుండానే మన వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్ వివరాలను ఇవి కచ్చితంగా ట్రాక్ చేస్తాయి. అమోలెడ్ డిస్‌ప్లే, ఎక్కువ రోజులు వచ్చే బ్యాటరీ లైఫ్, హార్ట్ రేట్, ఆక్సిజన్ లెవల్స్, నిద్రను పర్యవేక్షించే సదుపాయాలు వీటిలో ఉన్నాయి. మరి ఆ బెస్ట్ వాచ్‌లు ఏవో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం రండి..
నాయిస్ కంపెనీ నుంచి వచ్చిన ఈ వాచ్‌లో 1.5 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, టైటానియం అల్లాయ్ బెజెల్స్ ఉన్నాయి. ఔట్‌డోర్ వర్కౌట్ల కోసం ఐదు శాటిలైట్ సిస్టమ్‌లకు సపోర్ట్ చేసే డ్యూయల్ బ్యాండ్ జీపీఎస్ ఇచ్చారు. హార్ట్ రేట్, ఒత్తిడి, నిద్ర ట్రాకింగ్‌తో పాటు ఇందులో బిల్ట్-ఇన్ టార్చ్ కూడా ఉంది. దీని బ్యాటరీ 10 రోజుల వరకు వస్తుంది. నీటిలో ఈత కొట్టడానికి వీలుగా వాటర్ రెసిస్టెన్స్ సదుపాయం ఉంది. భారత్‌లో దీని ధర రూ.9,999గా ఉంది.
నథింగ్ సబ్ బ్రాండ్ సీఎంఎఫ్ తీసుకొచ్చిన ఈ వాచ్‌లో 1.43 అంగుళాల అమోలెడ్ స్క్రీన్ ఉంది. ఇందులోనూ డ్యూయల్ బ్యాండ్ జీపీఎస్, 130కి పైగా స్పోర్ట్స్ మోడ్స్ లభిస్తాయి. బ్లూటూత్ కాలింగ్, క్విక్ రిప్లైస్, కెమెరా కంట్రోల్స్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. నథింగ్ యాప్ ద్వారా ఆరోగ్య వివరాలను ఇతర యాప్స్‌తో సింక్ చేసుకోవచ్చు. సాధారణ వాడకంలో దీని బ్యాటరీ 13 రోజుల పాటు పనిచేస్తుంది. మార్కెట్లో దీని ధర రూ.7,999గా నిర్ణయించారు.
Also Read: ఒక్క రీఛార్జ్‌తో 84 రోజుల వ్యాలిడిటీ, 4 ఓటీటీలు, రూ.4,000 విలువైన ప్రీమియం బెనిఫిట్స్ ఫ్రీ!
పెద్ద స్క్రీన్ కోరుకునే వారికి అమేజ్‌ఫిట్ బిప్ 6 మంచి ఎంపిక. ఇందులో 1.97 అంగుళాల బ్రైట్ అమోలెడ్ డిస్‌ప్లే, అల్యూమినియం ఫ్రేమ్ ఉన్నాయి. 140కి పైగా వర్కౌట్ మోడ్స్‌తో పాటు ఆఫ్‌లైన్ మ్యాప్స్ సపోర్ట్ కూడా ఉండటం దీని ప్రత్యేకత. బ్లూటూత్ కాలింగ్, మహిళల ఆరోగ్య ట్రాకింగ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 14 రోజుల పాటు బ్యాటరీ వస్తుంది. ఆన్‌లైన్, రిటైల్ స్టోర్లలో దీని ధర రూ.7,999గా ఉంది.
తక్కువ బరువుతో, స్లిమ్‌గా ఉండే బ్యాండ్ కావాలనుకునే వారికి హువావే బ్యాండ్ 11 ప్రో బాగా నచ్చుతుంది. ఇందులో 1.62 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఫోన్ అవసరం లేకుండానే వర్కౌట్లు ట్రాక్ చేయడానికి ఇండిపెండెంట్ జీపీఎస్ ఇచ్చారు. 100కు పైగా స్పోర్ట్స్ మోడ్స్, హార్ట్ రేట్, ఆక్సిజన్ మానిటరింగ్ సదుపాయాలు ఉన్నాయి. సాధారణ వాడకంలో 8 – 14 రోజుల బ్యాటరీ లైఫ్ వస్తుంది. అమెజాన్‌లో దీని ధర రూ.6,299గా ఉంది.
బడ్జెట్ ధరలో బెస్ట్ ఫీచర్లు కోరుకునే వారి కోసం బోట్ ఈ వాచ్‌ను తీసుకొచ్చింది. గొరిల్లా గ్లాస్ రక్షణతో కూడిన 1.43 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఇందులో ఉంది. బిల్ట్-ఇన్ జీపీఎస్, బ్లూటూత్ కాలింగ్, ఏఐ వర్కౌట్ గుర్తింపు వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఈత కొట్టే వారి కోసం ప్రత్యేక ట్రాకింగ్ వివరాలు అందిస్తుంది. దీని బ్యాటరీ ఏకంగా 15 రోజుల వరకు వస్తుంది. వేరియంట్‌ను బట్టి దీని ధర రూ.5,999 నుంచి రూ.6,499 మధ్యలో ఉంది.
Also Read: భారతీయులు ఇల్లు క్లీన్ చేసే విషయంలో ఇంత నిర్లక్ష్యమా? డైసన్ సర్వేలో షాకింగ్ విషయాలు!