E-Paper
Advertisement

స్పామ్ కాల్స్ లొల్లి.. జియో vs ఎయిర్‌టెల్ vs వీఐ.. ట్రాయ్ షాకింగ్ రిపోర్ట్!

స్పామ్ కాల్స్ లొల్లి.. జియో vs ఎయిర్‌టెల్ vs వీఐ.. ట్రాయ్ షాకింగ్ రిపోర్ట్!
Advertisement

Spam Complaints: దేశంలోనే అత్యధిక మంది యూజర్లను కలిగి ఉన్న రిలయన్స్ జియో.. మెరుగైన సేవలను అందించడంలో అగ్రస్థానంలో నిలిచింది. స్పామ్ కాల్స్, కస్టమర్లకు పెద్దగా అవసరం లేని వాణిజ్య సందేశాల (UCC) కట్టడిలో జియో మెరుగైన పనితీరును కనబరిచింది. 2026 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో జియో నెట్‌వర్క్ నుంచి వచ్చే స్పామ్ ఫిర్యాదులు.. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంటే తక్కువగా నమోదయ్యాయని భారత టెలికాం నియంత్రణ సంస్థ (TRAI) తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

వినియోగదారుల సంఖ్యలో జియోనే టాప్

2026-27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి సంబంధించి ట్రాయ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. సెప్టెంబర్ 30 నాటికి జియో 52.72 కోట్ల (527.25 మిలియన్లు) క్రియాశీల వినియోగదారులతో అగ్రస్థానంలో ఉంది. ఎయిర్‌టెల్ 50.67 కోట్ల (506.7 మిలియన్లు) మందితో రెండో స్థానంలో నిలవగా.. వొడాఫోన్ ఐడియా 20.08 కోట్ల (200.88 మిలియన్లు) మంది కస్టమర్లను కలిగి ఉంది.

స్పామ్ ఫిర్యాదు లెక్కలు ఇలా..

Advertisement

వినియోగదారుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ.. జియో నెట్‌వర్క్ నుంచి వచ్చే కాల్స్, ఎస్ఎంఎస్‌లపై 2,93,716 ఫిర్యాదులు మాత్రమే వచ్చాయి. ఇదే సమయంలో ఎయిర్‌టెల్‌పై 3,52,062 ఫిర్యాదులు, వొడాఫోన్ ఐడియాపై అత్యధికంగా 5,39,285 ఫిర్యాదులు నమోదయ్యాయి. వీటిలో చర్యలు తీసుకోవడానికి అర్హమైన ఫిర్యాదులుగా జియోకు సంబంధించి 1,72,622, ఎయిర్‌టెల్‌కు 1,86,013, వొడాఫోన్ ఐడియాకు 3,19,629 కేసులను ట్రాయ్ గుర్తించింది.

నిబంధనల ఉల్లంఘనలపై కఠిన చర్యలు

పదేపదే నిబంధనలను ఉల్లంఘించిన వారిపై టెలికాం సంస్థలు కఠిన చర్యలే తీసుకున్నాయి. ఎయిర్‌టెల్ అత్యధికంగా 7,889 టెలికాం కనెక్షన్లను ఏడాది పాటు డిస్‌కనెక్ట్ చేయగా జియో 4,963 కనెక్షన్లను, వొడాఫోన్ ఐడియా 355 కనెక్షన్లను నిలిపివేశాయి. అటు స్పామ్ సందేశాలు పంపేవారిని బ్లాక్‌లిస్ట్ చేయడంలో జియో ముందుంది. జియో 274 మందిని ఏడాది పాటు బ్లాక్‌లిస్ట్ చేయగా, ఎయిర్‌టెల్ 85 మందిని, వొడాఫోన్ ఐడియా కేవలం 9 మందిని మాత్రమే బ్లాక్‌లిస్ట్ చేశాయి. అలాగే జియో 1,506 మంది ఎస్ఎంఎస్ పంపేవారిని బ్లాక్ చేయగా, ఎయిర్‌టెల్ 882 మందిని, వొడాఫోన్ ఐడియా 770 మందిని బ్లాక్ చేశాయి.

జియో యూజర్లకే స్పామ్ బెడద ఎక్కువ

Advertisement

మరోవైపు ఇతర నెట్‌వర్క్‌ల నుంచి తమ వినియోగదారులకు వచ్చే స్పామ్ కాల్స్, మెసేజ్‌ల విషయంలో జియో అత్యధిక ఫిర్యాదులను అందుకుంది. ఈ త్రైమాసికంలో జియో కస్టమర్ల నుంచి 6,96,283 ఫిర్యాదులు రాగా ఎయిర్‌టెల్ 6,43,546, వొడాఫోన్ ఐడియా 1,38,736 ఫిర్యాదులను స్వీకరించాయి. తదుపరి చర్యల నిమిత్తం జియో 6,50,038 ఫిర్యాదులను సంబంధిత నెట్‌వర్క్‌లకు బదిలీ చేయగా ఎయిర్‌టెల్ 6,35,420, వొడాఫోన్ ఐడియా 1,37,182 ఫిర్యాదులను ఫార్వర్డ్ చేశాయి.

డీఎన్‌డీ నమోదులో వెనుకబడ్డ జియో

అవాంఛిత కాల్స్ రాకుండా ‘డు నాట్ డిస్టర్బ్’ (DND) సేవలను ఎంచుకోవడంలో వొడాఫోన్ ఐడియా వినియోగదారులు ముందున్నారు. ఆ సంస్థ కస్టమర్లలో 32.7 శాతం మంది డీఎన్‌డీలో నమోదు చేసుకోగా ఎయిర్‌టెల్‌లో 17.2 శాతం, జియోలో కేవలం 10.7 శాతం మంది మాత్రమే ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు.

Also Read: రైలు సీట్లు నీలం రంగులోనే ఎందుకు ఉంటాయి? దీని వెనుక ఆసక్తికర కారణాలివే!

ట్రాయ్ డీఎన్‌డీ యాప్ ద్వారా అధిక ఫిర్యాదులు

మొత్తంగా జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో దేశవ్యాప్తంగా వివిధ నెట్‌వర్క్‌ల నుంచి 71,401 కోట్ల కాల్స్ నమోదు కాగా ట్రాయ్‌కు 15.29 లక్షల స్పామ్ ఫిర్యాదులు అందాయి. వీటిలో 7,23,831 ఫిర్యాదులను చర్యలకు అర్హమైనవిగా గుర్తించారు. అయితే మొత్తం ఫిర్యాదులలో 92.9 శాతం (14.21 లక్షలు) కేవలం ‘ట్రాయ్ డీఎన్‌డీ యాప్’ ద్వారానే అందాయి. స్పామ్ కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా 1.24 లక్షలకు పైగా టెలికాం వనరులపై చర్యలు తీసుకోవడంతో పాటు 374 మందిని బ్లాక్‌లిస్ట్ చేయడం, ఎస్ఎంఎస్ హెడర్లను బ్లాక్ చేయడం వంటి కఠిన నిర్ణయాలను ట్రాయ్ అమలు చేసింది.

Also Read: వందే భారత్ vs విమానం.. ప్రయాణికులకు ఇచ్చే ఫుడ్‌ పరంగా ఏది బెస్ట్? నెట్టింట ఆసక్తికర చర్చ!

Tags

Related News

మడత కనిపిస్తే ఒట్టు.. 200MP గింబల్ కెమెరాతో ఒప్పో తెస్తున్న కొత్త ఫోల్డబుల్ ఫోన్ వివరాలు లీక్!

ఏడాదంతా ఫ్రీ కాల్స్.. ఎయిర్‌టెల్, జియో, వీఐలో.. అత్యంత చౌకైన ప్లాన్లు ఇవే!

జియోలో దుమ్మురేపే ఫ్యామిలీ ప్లాన్.. రూ.749కే 100GB, అపరిమిత 5G, నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్!

23 ఏళ్లకే రూ.40 వేల కోట్ల సామ్రాజ్యం.. ఇద్దరు కుర్రాళ్ల ప్రపంచ రికార్డు!

ఇంట్లోనే ఆధార్ మొబైల్ నంబర్ మార్చుకోండి..కేవలం నిమిషాల్లో పని పూర్తి!

సీసీ కెమెరా కాకుండా ఇంటి సేఫ్టీ కోసం..ఈ స్మార్ట్ గాడ్జెట్లు బెస్ట్

షారుఖ్ వాచ్ ధర రూ.1.8కోట్లు..ప్రపంచంలో 22 మంది దగ్గరే ఉన్నఈ రేర్ పీస్ ప్రత్యేకతలివే!

Big Stories

Advertisement
×