Airtel 1729 Plan: ప్రస్తుతం టెలికాం రంగంలో పోటీ బాగా పెరిగింది. కస్టమర్లను ఆకట్టుకోవడానికి కంపెనీలు రకరకాల ప్లాన్లను తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా ఒకే రీఛార్జ్‌తో డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు ఎక్కువ రోజుల వ్యాలిడిటీ, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు కోరుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇలాంటి వారికోసమే ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ ఒక అద్భుతమైన ప్లాన్‌ను అందుబాటులో ఉంచింది. సాధారణంగా ఓటీటీ బెనిఫిట్స్ ఉండే ప్లాన్లకు వ్యాలిడిటీ తక్కువగా ఉంటుంది. కానీ ఎయిర్‌టెల్ తీసుకొచ్చిన ఈ ప్లాన్‌లో లాంగ్ వ్యాలిడిటీతో పాటు అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఆ ప్లాన్ పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఎయిర్‌టెల్ అందిస్తున్న ఈ ప్రత్యేక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ధర రూ.1,729గా ఉంది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే కస్టమర్లకు ఏకంగా 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అంటే.. దాదాపు మూడు నెలల పాటు రీఛార్జ్ టెన్షన్ ఉండదు. ఇందులో భాగంగా ప్రతిరోజూ 2జీబీ హై-స్పీడ్ డేటా వస్తుంది. మీ ప్రాంతంలో 5జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉంటే, అర్హులైన కస్టమర్లు అన్‌లిమిటెడ్ 5జీ డేటాను కూడా ఉచితంగా వాడుకోవచ్చు. దీంతో పాటు ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ, రోమింగ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా ఉచితంగా లభిస్తాయి.
సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఎక్కువగా చూసే వారికి ఈ ప్లాన్ నిజంగా ఒక వరమనే చెప్పాలి. ఈ ప్లాన్‌లో భాగంగా ఎయిర్‌టెల్ ఏకంగా నాలుగు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల సబ్‌స్క్రిప్షన్లను ఉచితంగా అందిస్తోంది. ఇందులో నెట్‌ఫ్లిక్స్ బేసిక్, జియోహాట్‌స్టార్ సూపర్, జీ5 ప్రీమియం, ఎక్స్‌ట్రీమ్ ప్లే ప్రీమియం ఉన్నాయి. విడివిడిగా వీటికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా, ఒకే రీఛార్జ్‌తో మీకు నచ్చిన కంటెంట్‌ను హాయిగా ఎంజాయ్ చేయవచ్చు.
Also Read: ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే చాలు.. ఫేస్‌బుక్, ఇన్‌స్టా, వాట్సప్‌లో మీ పర్సనల్ డేటా 100% సేఫ్!
ఓటీటీలు మాత్రమే కాకుండా ఈ ప్లాన్‌లో మరికొన్ని క్రేజీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. కస్టమర్లకు 12 నెలల పాటు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం యాక్సెస్‌ను ఎయిర్‌టెల్ ఉచితంగా ఇస్తోంది. వీటి విలువ దాదాపు రూ. 4,000 వరకు ఉంటుందని కంపెనీ చెబుతోంది. డిజైనింగ్, కంటెంట్ క్రియేషన్ చేసే వారికి అడోబ్ ప్రీమియం యాక్సెస్ ఎంతో ఉపయోగపడుతుంది.
ప్రస్తుత రోజుల్లో స్పామ్ కాల్స్, ఆన్‌లైన్ మోసాలు బాగా పెరిగిపోయాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎయిర్‌టెల్ ఈ ప్లాన్‌లో Airtel Safe ఫీచర్‌ను కూడా అందిస్తోంది. దీని ద్వారా మీకు వచ్చే స్పామ్ కాల్స్ గురించి ముందే అలర్ట్ వస్తుంది. అంతేకాకుండా.. నకిలీ లింక్‌లను బ్లాక్ చేయడం, ఓటీపీ ఆధారిత బ్యాంకింగ్ మోసాల బారిన పడకుండా ఇది పూర్తి రక్షణ కల్పిస్తుంది. మొత్తం మీద తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
Also Read: టెలికాం రంగంలో సంచలనం.. తాజా రిపోర్ట్‌లో Jio, BSNLను వెనక్కి నెట్టిన Airtel, కారణం ఏంటంటే?