Best Soundbars 2026: కుటుంబ సభ్యులతో కలిసి టీవీ చూడటం అనేది ఎంతో సరదాగా, ఆహ్లాదకరంగా సాగుతుంది. అయితే కరోనా తర్వాత థియేటర్లకు వెళ్లే అలవాటు చాలా వరకు తగ్గిపోయింది. దీనికి కారణం కేవలం ఆరోగ్యపరమైన జాగ్రత్తలే కాకుండా, కాలానికి అనుగుణంగా మారుతున్న ఆధునిక జీవనశైలికి ప్రజలు అలవాటు పడటమే. ఇప్పుడంటే ఇంట్లోనే థియేటర్ అనుభూతిని అందించే బిగ్ స్క్రీన్ Smart TVలు, నచ్చిన సినిమా లేదా సిరీస్‌ను ఎప్పుడైనా చూడటానికి OTT ప్లాట్‌ఫామ్స్, నాణ్యమైన ఆడియో అనుభూతి కోసం అత్యాధునిక ఫీచర్లతో కూడిన సౌండ్ స్పీకర్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే బయటకు వెళ్లాల్సిన అవసరమే లేకుండా ఇంట్లోనే సినిమా ఎంజాయ్ చేసే అన్ని సౌకర్యాలు చాలా మందికి అందుబాటులోకి వచ్చాయి.
అయితే ఇంట్లో కుటుంబ సభ్యులు ఎక్కువగా ఉన్నప్పుడు టీవీ ద్వారా వచ్చే సాధారణ ఆడియో అందరికీ సమానంగా వినిపించకపోవడం సాధారణ సమస్య. ముఖ్యంగా డైలాగ్స్ స్పష్టంగా వినిపించకపోవడం వల్ల సినిమాను పూర్తిగా ఆస్వాదించ లేకపోతున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది బడ్జెట్‌లోనే బెస్ట్ సౌండ్ స్పీకర్లు లేదా సౌండ్ బార్స్ కొనాలని ఆలోచిస్తున్నారు.
అలాంటి వారికోసం 2026 జనవరిలో బెస్ట్ సౌండ్ బార్స్‌గా నిలిచే కొన్ని ఆధునిక ఆడియో డివైసులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రీమియం స్థాయి డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉన్న సౌండ్ బార్స్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ మోడల్స్ వరకు విభిన్న అవసరాలకు సరిపోయే ఆప్షన్స్ ఉన్నాయి. మరి అవేంటో ఇప్పుడు ఓసారి చూసేద్దామా..
Also Read: కొత్త ఏడాది బంపర్ ఆఫర్ అంటే ఇదే.. ఒక్కసారిగా పడిపోయిన యాపిల్ వాచ్‌ల ధరలు!
ఇది ఒక ప్రీమియం లెవల్ 11.1.4-చానెల్ Dolby Atmos సౌండ్‌బార్. హాలీవుడ్ అడ్వెంచర్ సినిమాలు, గేమింగ్, అలాగే డ్యాన్స్ ప్రాక్టీస్ లాంటి సందర్భాల్లో శబ్దాన్ని ఎక్కువగా ఆస్వాదించాలనుకునే వారికి ఇది అద్భుతమైన ఎంపిక. దీనిలో పవర్ఫుల్ సబ్వూఫర్‌తో పాటు రియర్ సాటిలైట్ స్పీకర్లు సైతం ఉండటం వల్ల, మీరు గదిలో ఏ మూలన ఉన్నా సరే శబ్దం స్పష్టంగా, సమానంగా వినిపిస్తుంది. Samsung అందించే ప్రత్యేకమైన Q-Symphony ఫీచర్ ద్వారా ఈ సౌండ్‌బార్ మీ Samsung టీవీ స్పీకర్లతో కలిసి పని చేసి మరింత శక్తివంతమైన, సరికొత్త అనుభవాన్ని ఇస్తుంది. పెద్ద OLED లేదా QLED టీవీలతో కలిపి వాడితే, ఇంట్లోనే నిజమైన థియేటర్ లాంటి ఫీలింగ్‌ను పొందవచ్చు.
ఈ సౌండ్‌బార్ 9.1.4-చానెల్ Dolby Atmos సెటప్‌తో వస్తుంది. Q990F కంటే కొంచెం తక్కువ ధరలో మంచి పనితనాన్ని అందిస్తుంది. గ్రాఫిక్ EQ సహాయంతో మీ గది ఆకారం, పరిమాణాన్ని బట్టి సౌండ్ ప్రొఫైల్‌ను మీరే కస్టమైజ్ చేసుకోవచ్చు. దీనిలో ఉన్న రూమ్ కరెక్షన్ టూల్స్ ఆడియోను ఆటోమేటిక్‌గా గదికి అనుగుణంగా ట్యూన్ చేసి, శబ్దం సహజంగా వినిపించేలా చేస్తాయి. సినిమాలు చూసేటప్పుడు లేదా సంగీతం వింటున్నప్పుడు ఈ సౌండ్‌బార్ స్పష్టమైన డైలాగ్‌లు, మంచి పవర్‌తో మీ హోమ్ థియేటర్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది.
మిడ్ రేంజ్ విభాగంలో ఇది ఒక అత్యుత్తమ సౌండ్‌బార్. 7.1.3-చానెల్ Dolby Atmos ఫార్మాట్‌ను సపోర్ట్ చేయడం వల్ల సినిమాలు మాత్రమే కాకుండా సంగీతం, డైలాగ్‌లు కూడా చాలా క్లియర్‌గా వినిపిస్తాయి. శబ్దం సమానంగా గది చుట్టూ అన్ని దిశల నుంచి విస్తరించి వినిపించడం వల్ల, టీవీ షోలు చూసేటప్పుడు లేదా పాటలు వినేటప్పుడు కూడా మంచి అనుభూతి లభిస్తుంది. ఇంట్లో ఆడియో నాణ్యత కోసం బ్యాలెన్స్‌డ్ సౌండ్‌బార్ కావాలంటే దీనిని కొనుగోలు చేయవచ్చు.
బడ్జెట్ లెవల్‌లో మంచి హోమ్ థియేటర్ అనుభవం కావాలనుకునే వారికి ఇదొక మంచి ఎంపిక. 5.1-చానెల్ సెటప్‌తో వచ్చే ఈ సౌండ్‌బార్‌లో ఒక సబ్వూఫర్, రెండు రియర్ స్పీకర్లు ఉన్నాయి. పూర్తి స్థాయి Dolby Atmos సపోర్ట్ లేకపోయినా, శబ్దం స్పష్టంగా వినిపించడమూ కాకుండా.. డైలాగ్‌లు కూడా చాలా క్లియర్‌గా ఉంటాయి. ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టకుండా సినిమాలు, OTT కంటెంట్‌ను ఆస్వాదించాలనుకునే వారికి ఇది బెస్ట్.
చిన్నదైన.. పాకెట్ ఫ్రెండ్లీ సౌండ్‌బార్ కావాలనుకునే వారికి Sonos Beam (Gen 2) బాగా సరిపోతుంది. ముఖ్యంగా అపార్ట్‌మెంట్‌లు లేదా చిన్న లివింగ్ రూమ్‌ల కోసం ఇది డిజైన్ చేయబడింది. 5.0-చానెల్ సౌండ్‌తో Dolby Atmos ఇమర్షన్‌ను అందించినప్పటికీ, భారీ పవర్ కంటే క్లియర్ డైలాగ్, మ్యూజిక్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. అవసరమైతే దీనిని సబ్వూఫర్ లేదా స్లిమ్ సాటిలైట్ స్పీకర్లతో జతచేసి ఆడియో అనుభవాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు.
Also Read: మీ వైఫైను ఎవరెవరు వాడుతున్నారో తెలుసుకోవాలంటే.. ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వండి!