E-Paper
Advertisement

భారత పైలట్ ధైర్యానికి యూఏఈ ఫిదా.. అత్యున్నత పురస్కారంతో సత్కారం!

భారత పైలట్ ధైర్యానికి యూఏఈ ఫిదా.. అత్యున్నత పురస్కారంతో సత్కారం!
Advertisement

Indian Pilot Smith Machar Honoured by UAE: విమానంలో ఊహించని ప్రమాదకర పరిస్థితి ఎదురైనా.. తీవ్రంగా గాయపడి బాధపడుతున్నా.. తన బాధ్యతను మర్చిపోకుండా ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన ధైర్యసాహసాలను గుర్తించిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రభుత్వం, ఫ్లైదుబాయ్ సిబ్బందిని ప్రత్యేక పురస్కారాలతో సత్కరించింది. క్లిష్ట సమయంలో వారు చూపిన తెగువ, వృత్తి నైపుణ్యాన్ని ప్రశంసించింది.

మచ్చర్ కు ఆర్డర్ ఆఫ్ జాయెద్ II పురస్కారం

కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ తో పాటు ఫ్లైదుబాయ్ సిబ్బందికి  ఫస్ట్ క్లాస్ ఆర్డర్ ఆఫ్ జాయెద్ II పురస్కారాన్ని UAE ప్రభుత్వం ప్రదానం చేసింది. UAE అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తరఫున దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఈ గౌరవాన్ని అందజేశారు. ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణికుల భద్రత కోసం సిబ్బంది చేసిన కృషిని యూఏఈ పెద్దలు అభినందించారు.

సెప్టెంబర్ 30న ఏం జరిగింది?

Advertisement

గత సెప్టెంబర్ 30న ఫ్లైదుబాయ్ విమానం క్రాష్ ల్యాండింగ్ కు ప్రయత్నం జరిగింది. విమానంలోని కో పైలెట్ దాడిలో  కెప్టెన్ స్మిత్ మచ్చర్ తీవ్రంగా గాయపడ్డారు. అయినప్పటికీ, ఆయన ధైర్యం కోల్పోకుండా కాక్‌పిట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించారు. వెంటనే ఇతర సిబ్బంది, ప్యాసింజర్స్ స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. వారి సమయస్ఫూర్తి, పైలట్ ధైర్యంతో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ తీసుకుంది.

ప్రపంచాధినేతల ప్రశంసలు   

కెప్టెన్ స్మిత్ చూపిన ధైర్యసాహసాలపై పలువురు ప్రపంచ నాయకులు ప్రశంసలు కురిపించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయన తెగువను అభినందించగా, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా స్మిత్ సాహసాన్ని కొనియాడారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఆయన ధైర్యాన్ని కొనియాడారు. అంతేకాకుండా, స్మిత్ గాయాల నుంచి కోలుకున్న తర్వాత ఆయనకు అత్యున్నత ధైర్యసాహస పురస్కారం అందించాలని ఇజ్రాయెల్ నిర్ణయించింది.

ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన క్రౌన్ ప్రిన్స్

Advertisement

అక్టోబర్ 3న ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్‌ను షేక్ హమ్దాన్ స్వయంగా పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన బాధ్యతాయుతంగా వ్యవహరించిన తీరును, ప్రయాణికుల ప్రాణాల రక్షణకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని ప్రశంసించారు. విపత్కర పరిస్థితుల్లోనూ విధి నిర్వహణకు కట్టుబడి ఉండటం, ప్రయాణికుల భద్రత కోసం ధైర్యంగా వ్యవహరించడం ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది. కెప్టెన్ స్మిత్‌కు లభించిన గౌరవం విమానయాన రంగంలోని సిబ్బంది సేవలకు అరుదైన గుర్తింపుగా నిలుస్తోంది.

Read Also: బుల్లెట్ రైలు ప్రయాణానికి ముహూర్తం ఖరారు.. రైల్వే మంత్రి ఏమన్నారంటే!

Tags

Related News

యూరప్ రైళ్ల కంటే వందే భారత్ బెటర్.. పోలాండ్ యువతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాలు రద్దు.. ప్రయాణికులు ఏం చేయాలంటే?

ఒకసారి కాదు.. మూడు సార్లు పెళ్లి చేసుకునే అమ్మాయిలు! ఆ ప్రాంతంలో వింత సంప్రదాయం

ఆర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. విశాఖ నుంచి విజయవాడ వరకు ఎన్ని ఫ్లైట్స్ రద్దు అయ్యాయంటే?

అర్నబ్ కల్లోలం.. తెలుగు రాష్ట్రాల్లో 64 రైళ్లు క్యాన్సిల్!

అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. 100కు పైగా రైళ్లు రద్దు!

జంతువుల కోసం ఫ్లైఓవరా? కెనడా చేసిన ఈ పనికి.. యావత్ ప్రపంచమే ఫిదా!

Big Stories

Advertisement
×