AP Politics: ఆయనొక కడప జిల్లా ఎమ్మేల్యే.. ప్రభుత్వ విప్ కూడ. మాజీ సీఎం జగన్ ను ఉద్దేశించి కీలక కామెంట్స్ చేశారు. అది కూడా గిల్లారు.. గల్లీకెక్కారంటూ చేసిన కామెంట్ ఇప్పుడు పొలిటికల్ టాక్ గా మారింది. ఇంతకు ఆ ఎమ్మేల్యే మాటల్లో జగన్ ఎవరిని గిల్లారు.. గల్లీకెక్కింది ఎవరో తెలుసుకుందాం.
మాజీ సీఎం జగన్ కుటుంబంలో ఆస్తి తగాదాల విషయం అందరికీ తెలిసిందే. వారి కుటుంబ వ్యవహారం అయినప్పటికీ బహిరంగ లేఖలతో బహిర్గతమైంది. ఈ విషయంపై టీడీపీ వర్సెస్ వైసీపీలా మాటల యుద్దం సాగింది. నేరుగా సీఎం చంద్రబాబుతో వైఎస్ షర్మిళ కుమ్మక్కై జగన్ ను అరెస్ట్ చేయాలని భావిస్తున్నట్లు కూడా వైసీపీ నేతలు కామెంట్స్ చేశారు. అయితే ఈ విషయం ఇటీవల వార్తల్లో అంతగా లేదు. తాజాగా కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మేల్యే ఆదినారాయణ రెడ్డి ఈ వ్యవహారంపై మీడియా ముఖంగా సంచలన కామెంట్స్ చేశారు.
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ.. మౌలిక వసతుల్లో దేశం ఐదో స్థానంలో ఉందని, బీజేపీ పాలనలో దేశంలో టెర్రరిజం, నక్సలిజం తగ్గిందన్నారు. కూటమి ప్రభుత్వం లో నెలనెలా రెగ్యులర్ జీతాలు ఉద్యోగులకు అందుతున్నాయని, గత ప్రభుత్వం జీతాలకు తిప్పలు పెట్టిందన్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలుపై ఎమ్మేల్యే మాట్లాడుతూ.. నాలుగు నెలల్లో సూపర్ సిక్స్ పథకాలు తప్పక అమలవుతాయని భరోసానిచ్చారు.
జమ్మలమడుగు లో నీటి సంఘం ఎన్నికల్లో విఆర్వోల కిడ్నాప్ అవాస్తవమని, నీటి సంఘాల ఎన్నికలను జగన్ బైకాట్ చేశారన్నారు. కానీ నీటి సంఘాల ఎన్నికలు జరిపేందుకు రామసుబ్బారెడ్డి, ఎంపీ అవినాష్ లు కుట్రలు పన్నారన్నారు. పెద్ద బాస్ చెప్పినా కూడా ఇక్కడి చిన్న బాస్ లు ఆ మాట వినకుండా తమ పని కానిచ్చేశారన్నారంటూ విమర్శించారు. జగన్, అవినాష్ మధ్య లోపించిన సమన్వయం లేదనే అనుమానాలు వైసీపీ కార్యకర్తల్లో వ్యక్తమవుతోందని ఎమ్మేల్యే తెలిపారు. రాష్ట్రంలో విపరీతమైన అప్పులు చేసిన వ్యక్తి జగన్ అంటూ.. ఆయుష్మాన్ భారత్ కార్డును ప్రజలకు అందకుండా, తుంగలో తొక్కిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు.
Also Read: Jamili Elections : జమిలి ఎన్నికలపై వెనక్కి తగ్గిన కేంద్రం.. జాబితా నుంచి తొలగింపు.. కారణం ఇదేనా?
సంక్రాంతి నుండి జగన్ జనంలోకి వస్తారన్న మాటలు వినిపిస్తున్నాయని, దమ్ముంటే ప్రజల్లోకి వచ్చి వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని ఆది సవాల్ విసిరారు. జగన్ తన ఇద్దరు చెల్లెళ్లను గిల్లారు కాబట్టే, వాళ్ళు గల్లీకెక్కారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఎవరైనా చెల్లెళ్లకు కీడు తలపెట్టాలని చూసే అన్నయ్య ఈయనే అంటూ జగన్ ను విమర్శించారు. ఏపీలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా, తాము సిద్దమని ఇంకా జగన్ సిద్దంగా లేరని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు.