Smartwatches Vs Fitness Bands : స్మార్ట్‌వాచ్‌లు vs ఫిట్‌నెస్ బ్యాండ్‌లు… ఈ రెండూ ఫిట్నెస్ ను అందిచేవే. అయితే ఇందులో చాలా మందికి వీటిలో ఏది బెస్ట్. అసలు తమ అవసరాలకు అనుగుణంగా ఏది ఎంచుకోవాలో తెలియదు. అయితే అసులు వీటి మధ్య తేడా ఏంటి? ఏ అవసరాలకు ఏది బెస్ట్ అనే డీటెయిల్స్ ఒకసారి చూసెద్దాం.
ఫిట్నెస్ విషయంలో కచ్చితంగా సరైన ట్రాకర్ ను ఎంచుకోవడం అత్యవసరం. మార్కెట్లో దొరికే అన్ని ఫిట్నెస్ ట్రాకర్స్, స్మార్ట్ వాచెస్ ఇందుకు అనుకూలంగా తయారు చేసి ఉండకపోవచ్చు. దీంతో సమయం వృధా కావడంతో పాటు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోవచ్చు. అందుకే అసలు ఫిట్నెస్ ట్రాకర్ ను ఎలా ఎంచుకోవాలి. సమయాన్ని బట్టి తగిన ధరలో సరైన గ్యాడ్జెట్స్ ఎంచుకోవడం అత్యవసరం కాబట్టి వీటి మధ్య తేడాలు కచ్చితంగా తెలుసుకోవాలి.
నిజానికి స్మార్ట్ వాచెస్, ఫిట్నెస్ బ్యాండ్స్ వేరు వేరు ప్రయోజనాలను అందిస్తాయి. డిజైన్స్ సైతం వేరుగానే ఉంటాయి.
స్మార్ట్ వాచెస్ – స్మార్ట్ వాచెస్ ఫిట్నెస్ ట్రాకింగ్ కు మాత్రమే కాకుండా ఫీచర్స్ ను రిచ్ గా అందించే గ్యాడ్జెట్స్ అని గుర్తుంచుకోవాలి. స్మార్ట్ ఫోన్లతో కనెక్ట్ అయ్యి పని చేస్తాయి. యాప్ సపోర్ట్, కాల్స్, మెసేజెస్ కు సపోర్ట్ చేస్తాయి. పెద్ద డిస్ప్లేతో మల్టీ మీడియా ప్లేయర్, నావిగేషన్, థర్డ్ పార్టీ యాప్స్ కు సైతం మద్దతు ఇచ్చే విధంగా డిజైన్ చేయబడతాయి. ఇవి నిజానికి గడియారం ఆకారంలోనే ఉంటాయి. కానీ ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. చేసే ఉద్యోగానికి సైతం సంబంధించిన సెట్టింగ్స్ ను అందిస్తాయి. తాజాగా లాంఛ్ అయిన ఆపిల్ వాచెస్, సాంసంగ్ గెలాక్సీ వాచ్ సిరీస్ ఈ విధంగానే పనిచేస్తాయి. ఒకసారి ఛార్జింగ్ పెడితే ఒకటి నుంచి మూడు రోజులు పని చేసే విధంగా ఉంటాయి
ఫీచర్స్ – నోటిఫికేషన్స్, కాల్స్, యాప్స్, మ్యూజిక్ కంట్రోల్, వాయిస్ అసిస్టెంట్ వంటి వాటికి సపోర్ట్ చేస్తూ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీతో పనిచేస్తాయి. హై ఎండ్ మోడల్స్ ఎల్ టి ఏ కనెక్టివిటీ సైతం అందిస్తాయి. ఇక ఫిట్నెస్ విషయానికొస్తే.. ఇందులో ఫిట్నెస్ ట్రాకింగ్ అద్భుతంగా ఉంటుంది. అధునాతన సెన్సార్ తో కావలసిన ఫీచర్స్ ను కలిగి ఉంటుంది.
ఫిట్నెస్ బ్యాండ్స్ – ఫిట్నెస్ బ్యాండ్స్ విషయానికొస్తే.. ఇవి బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పవచ్చు. ఇందులో ఆరోగ్యాన్ని ట్రాక్ చేసే అనేక విషయాలు ఉంటాయి.
ఫీచర్స్ – హృదయ స్పందన రేటు, నిద్ర, నిర్దిష్ట వ్యాయామం వంటి కొలమానాలతో పాటు ఆరోగ్యాన్ని, ఫిట్నెస్ ను సైతం ట్రాక్ చేస్తాయి. ఇక చిన్న స్క్రీన్ తో ఎక్కువ బ్యాటరీ లైఫ్ ను కలిగి ఉంటాయి. ఒకసారి ఛార్జ్ చేస్తే వారం రోజులు కంటే ఎక్కువ పని చేస్తాయి. తేలికగా ఉండే స్లిమ్ డిజైన్స్ తో అందుబాటులోకి వచ్చేసాయి. Xiaomi Mi Band, Fitbit Inspire వంటివి ఫిట్నెస్ బ్యాండ్స్ లో టాప్ గా నిలుస్తున్నాయి. ఇక ఇవి తక్కువ ధరకే అందుబాటులో ఉండటంతో బడ్జెట్ ఫ్రెండ్లీగా నిలుస్తున్నాయి.
ఇక ఫిట్నెస్ కోసం ప్రయత్నించే యూజర్స్ స్మార్ట్ వాచెస్ ఫిట్నెస్ బ్యాండ్ లో ఏది ఎంచుకోవాలంటే.. వాళ్ళ అవసరాలకు అనుగుణంగా సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫీచర్ రిచ్, యాప్స్ సపోర్ట్, కాల్స్, మెసేజెస్, నోటిఫికేషన్, మ్యూజిక్ కంట్రోల్, ఈసీజీ, అధునాతన సెన్సార్స్ తో హెల్త్ ట్రాకింగ్ కావాలనుకునే వారు స్మార్ట్ వాచెస్ ఎంచుకోవచ్చు. అలాగే ఇందులో పెద్ద డిస్ప్లే, చేసే ఉద్యోగానికి సంబంధించిన సెట్టింగ్స్ వంటివి కావాలనుకుంటే తక్కువ బ్యాటరీ లైఫ్ ఉన్నప్పటికీ పర్వాలేదు అనుకునే యూజర్స్ వీటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక హెల్త్ ట్రాకింగ్, హృదయ స్పందన రేటు, నిద్ర, వ్యాయామంతో పాటు చిన్న డిస్ప్లే, మినిమలిస్ట్ డిజైన్స్, ఎక్కువ బ్యాటరీ లైఫ్ కావాలనుకునేవారు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండే ఫిట్నెస్ బ్యాండ్స్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు.
ALSO READ : గ్జియోమీ 15 ఫీచర్స్ లీక్.. అదిరే ప్రోసెసర్, స్టోరేజ్ ఫీచర్స్ వేరే లెవెల్