E-Paper
Advertisement

GHMC: జీహెచ్ఎంసీ లో పక్కాగా రాంకీ ఒప్పందం అమలు.. రెండు కార్పొరేషన్లు ప్రైవేటుకు అప్పగించే యోచన

GHMC: జీహెచ్ఎంసీ లో పక్కాగా రాంకీ ఒప్పందం అమలు.. రెండు కార్పొరేషన్లు ప్రైవేటుకు అప్పగించే యోచన

GHMC: తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : కోర్ అర్బన్ రీజియన్ లోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మెరుగైన శానిటేషన్ సేవలందించే దిశగా వేగంగా అడుగులు పడుతున్నట్ల్లు తెలిసింది. జీహెచ్ఎంసీతో పాటు కొత్తగా ఏర్పడిన రెండు కార్పొరేషన్లలో శానిటేషన్ ను గాడీన పెట్టి, గ్యార్బేజీ ఫ్రీ సిటీ లక్ష్యంగా ముందుకు సాగేందుకు సర్కారు సిద్దమైనట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో కూడా శానిటేషన్ పై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, ఎంతటి వారినైనా సస్పెండ్ చేస్తామని సీఎం అల్టిమేటం జారీ చేయటం శానిటేషన్ పై సర్కారు ఫోకస్ చేసిందన్న వాదనకు బలాన్ని చేకూరుస్తుంది. ఇదివరకే రాంకీ సంస్థతో జీహెచ్ఎంసీ చేసుకున్న ఒప్పందం ప్రకారం డోర్ టూ డోర్ చెత్త సేకరణ, ట్రాన్స్ ఫర్ స్టేషన్ కు తరలించి, అక్కడి నుంచి డంపింగ్ యార్డుకు తరలించి సైంటిఫిక్ గా డిస్పోజ్ చేయాల్సి ఉంది. కానీ జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఇంటింటి నుంచి చెత్తను సేకరించాల్సిన రాంకీ స్థానంలో స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికులు చెత్తను సేకరించి ట్రాన్స్ ఫర్ స్టేషన్ కు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

డోర్ చెత్త కలెక్షన్ రాంకీ సంస్థే చేయాలి 

కానీ ఒప్పందం ప్రకారం డోర్ టూ డోర్ చెత్త కలెక్షన్ రాంకీ సంస్థే చేయాలని ఇప్పటికే అధికారులు తేల్చి చెప్పటంతో మొత్తం స్వచ్ఛ ఆటో టిప్పర్లను రాంకీ పరిధిలోకి తీసుకువస్తే, కార్మికులకు తామే జీతాలను చెల్లిస్తూ డోర్ టూ డోర్ చెత్త సేకరణ చేసేందుకు ఆ సంస్థ సిద్దంగా ఉన్నా, రాంకీ ఆధీనంలో పనులు చేసేందుకు కార్మికులు నిరాకరిస్తున్న నేపథ్యంలో మెరుగైన శానిటేషన్ పనుల కోసం మున్సిపల్ శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి మూడు ప్రతిపాదనలను ఇప్పటికే పంపినట్లు సమాచారం. ముఖ్యంగా కోర్ అర్బన్ రీజియన్ ను గ్యార్బేజీ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దటంలో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో రాంకీ ఒప్పందాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తూ స్వచ్ఛ ఆటో టిప్పర్లను కొనసాగిస్తూ పనులు నిర్వహించాలన్న ప్రతిపాదన కూడా సర్కారుకు పంపిన వాటిలో ఉన్నట్లు తెలిసింది. దీంతో పాటు మూడు కార్పొరేషన్ల పరిధిలో జీహెచ్ఎంసీ మిగిలిన సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో శానిటేషన్ పనులకు మరోసారి టెండర్ల ప్రకియ చేపట్టి, ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలా? లేక రాంకీ ఒప్పందాన్ని కొత్తగా ఏర్పడిన రెండు మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రత్యేకంగా సవరించాలా? అన్న ప్రతిపాదనలు మున్సిపల్ శాఖ నుంచి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి చేరినట్లు విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో పూర్తి స్థాయిలో రాంకీ ఒప్పందం అమలు కాకపోవటంతో పాటు చెత్త సేకరణ, తరలింపులో రాంకీ వహస్తున్న అలసత్వం, నిర్లక్ష్యంతో పాటు పలు అక్రమాలకు చెక్ పెట్టేలా ఈ మూడు ప్రతిపాదనలను మున్సిపల్ శాఖ రూపకల్పన చేసినట్లు తెలిసింది.

Also Read: Harish Rao: మన ఊరు – మన బడి బకాయిలు వెంటనే చెల్లించాలి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్ రావు డిమాండ్

త్వరలో సర్కారు తుది నిర్ణయం

కోర్ అర్బన్ రీజియన్ లో ఎన్ని ప్రయత్నాలు చేసినా, సత్ఫలితాలు రాని శానిటేషన్ పనులపై ఇటీవలే సర్కారుకు అందిన మూడు ప్రతిపాదనలపై సర్కారు తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనలపై సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావన వచ్చినట్లు కూడా విశ్వసనీయ సమాచారం. రాంకీ ఒప్పందాన్ని కేవలం జీహెచ్ఎంసీకే పరిమితం చేసి, కట్టుదిట్టంగా అమలు చేసేలా పలు సూచనలు, సలహాలను సర్కారు ఇవ్వనున్నట్లు తెలిసింది. కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో రాంకీ ఒప్పందం అమలకు ఎదురవుతున్న అడ్డంకులు కొత్తగా ఏర్పడిన రెండు కార్పొరేషన్లలో తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టేలా సర్కారు నిర్ణయం ఉండనున్నట్లు తెలిసింది.

 రాంకీ ఒప్పందాన్ని మరింత ఖచ్చితంగా అమలు

కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ అయినా జీహెచ్ఎంసీ పరిధిలోకి ఇప్పటికే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా రావటంతో ఇక్కడ ఇప్పటికే అమల్లో ఉన్న రాంకీ ఒప్పందాన్ని మరింత ఖచ్చితంగా అమలు చేసేలా కూడా సర్కారు ఆదేశాలివ్వనున్నట్లు తెలిసింది. కొత్తగా విలీనమైన పట్టణ స్థానిక సంస్థల్లో శానిటేషన్ తో పాటు ఇతర సేవలకు సంబంధించి నిధుల మంజూరీ, స్టాఫ్ ప్యాట్రన్ వంటి అంశాలు కూడా ఇప్పటికే సర్కారు దృష్టికి తీసుకెళ్లటంతో సర్కారు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకపోలేదు. జీహెచ్ఎంసీ పరిధి వరకు స్వచ్చ ఆటో టిప్పర్లను కొనసాగిస్తూ, మిగిలిన రెండు కార్పొరేషన్లకు సంబంధించి కొత్తగా రాంకీతో ఒప్పందం చేసుకోవాలా? లేక ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు టెండర్ల ప్రక్రియ చేపట్టాలా? అన్న విషయంపై త్వరలోనే సర్కారు క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలిసింది.

Also ReadBharat Taxi App: అద్భుతమైన భారత్ టాక్సీ యాప్.. ఇక 80 శాతం ఆదాయం వారికే, అమిత్ షా కీలక విషయాలు

Related News

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Big Stories

×