Upcoming Mobiles In 2025 : ఎప్పటికప్పుడు లేటెస్ట్ మొబైల్స్ ను లాంఛ్ చేస్తున్న ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలన్నీ ఈ ఏడాది అదిరిపోయే ఫీచర్స్ తో బెస్ట్ మొబైల్స్ ను మార్కెట్లోకి లాంఛ్ చేశాయి. ఇక వచ్చే ఏడాది సైతం ఆపిల్, సామ్ సాంగ్, గ్జియోమీ, గూగుల్ బెస్ట్ మొబైల్స్ ను తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి. కాగా 2025లో వచ్చే టాప్ మొబైల్స్ ఏంటో ఒకసారి చూద్దాం.
మరికొన్ని రోజుల్లో 2024 సక్సెస్ ఫుల్ గా పూర్తయిపోతుంది. ఈ ఏడాది హై ఎండ్ మొబైల్స్ లాంఛ్ అయ్యి యూజర్స్ ను ఆకట్టుకున్నాయి. ఇక వచ్చే ఏడాది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో కొత్త మొబైల్స్ లాంఛ్ కు సిద్ధమైపోయాయి. ఇందులో ఐఫోన్ 17 సిరీస్, ఐఫోన్ SE4, శాంసంగ్ గెలాక్సీ S 25తో పాటు మోటోరోలా, గూగుల్ పిక్సెల్ మెుబైల్స్ ఉన్నాయి.
Apple iPhone 17 Series – 2025లో లాంఛ్ కాబోతున్న హై ఎండ్ స్మార్ట్ ఫోన్స్ లో ఐఫోన్ 17 సిరీస్ టాప్ ప్లేస్ లో ఉండనుంది. ప్రతీ ఏడాది సెప్టెంబర్ లో ఐఫోన్ ఫెస్ట్ ఉన్నట్లే 2025 లో సెప్టెంబర్ లో ఈ సిరీస్ లాంఛ్ కాబోతుంది.
iPhone SE 4 – బడ్జెట్లోనే ఐఫోన్స్ ను తీసుకురావాలనే ఉద్దేశంతో యాపిల్ కంపెనీ తీసుకొస్తున్న SE మొబైల్స్ కు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఈ సిరీస్ లో 3 మొబైల్స్ లో లాంఛ్ చేసిన యాపిల్.. వచ్చే ఏడాది SE 4ను మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ మొబైల్స్ ఏప్రిల్ లో మార్కెట్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
Samsung Galaxy s25 – ప్రపంచవ్యాప్తంగా సామ్ సాంగ్ మొబైల్స్ కు ఉన్న డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఏడాది లాంఛ్ అయిన samsung galaxy s24కు స్పెషల్ డిమాండ్ నెలకొనటంతో అదే సిరీస్ లో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 లాంఛ్ కు సిద్ధమవుతుంది.
Samsung Galaxy Z Fold 7 FE – సామ్ సాంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 మొబైల్స్ ను ఆ సంస్థ 2025లో లాంఛ్ చేయడానికి సిద్ధమవుతుంది.
Samsung Galaxy Z Flip 7 – సామ్ సాంగ్ జెట్ ఫ్లిప్ 7 మొబైల్స్ వచ్చే ఏడాది లాంఛ్ కానున్నాయి. ఈ సిరీస్ బడ్జెట్ ఫ్రెండ్లీలో రాబోతుంది.
Xiaomi 15 Series – చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమి 15 సిరీస్ కూడా వచ్చే ఏడాది లాంఛ్ కాబోతుంది. ఈ సిరీస్ లో Xiaomi 15, Xiaomi 15 ప్రో మెుబైల్స్ రాబోతున్నాయి.
Google Pixel 9A – 2025లో గూగుల్ తీసుకోరాబోతున్న బెస్ట్ మెుబైల్స్ లో గూగూల్ పిక్సెల్ 9A కూడా ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.3 అంగుళాల డిస్ ప్లే, 18W ఛార్జింగ్ 5000mAh బ్యాటరీతో రాబోతుంది. 8GB RAM + 128GB, 8GB RAM + 256GB స్టోరేజ్‌తో కలిపి టెన్సర్ G4 చిప్‌సెట్ తో రాబోతుంది.
Motorola – మోటో రేజర్ 2025 లైనప్ లో రాబోతున్న ఈ మెుబైల్.. వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో రాబోతుంది. 4 మోడల్స్ లో ఈ మెుబైల్ రాబోతున్నట్లు టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ALSO READ : ‘1’ నొక్కాడు, సాఫ్ట్వేర్ డెవలపర్ అకౌంట్లో రూ.లక్ష గోవిందా!