Scams : సాధారణంగా మన కాంటాక్ట్ లిస్ట్‌లో లేని నంబర్ నుంచి కాల్ రాగానే ఎవరు చేస్తున్నారనే ఆసక్తితో దానిని అటెండ్ చేసేస్తాం. అదే అవతలి వ్యక్తులు ఫలానా బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం, లోన్ కావాలా? క్రెడిట్ కార్డ్ తీసుకోండి సార్, అని అనగానే స్పామ్ కాల్ అని పక్కన పెట్టేస్తాం. కానీ కొన్ని సార్లు వచ్చిన పార్సెల్ తీసుకోవడానికి లేదా ఏమైనా డీటెయిల్స్ చెప్పడానికి ఒకటి నొక్కండి అంటూ కొన్ని కాల్స్ వస్తాయి. అయితే తాజాగా ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కు ఏం జరిగిందో తెలిస్తే ఇంకెప్పటికీ మీరు ఇలాంటి కాల్స్ ను నమ్మనే నమ్మరు.
కొన్నిసార్లు లాటరీ గెలుచుకున్నారని, క్రెడిట్/డెబిట్ కార్డు గడువు ముగిసిందని, మీ కొరియర్ డెలివరీ కాలేదు, మీకు ఓ పార్సిల్ వచ్చింది, డీటెయిల్స్ చెప్పండి అంటూ మోసపూరిత కాల్స్ కూడా వస్తుంటాయి. ఒకటి నొక్కండి, రెండు నొక్కండి అని కూడా చెబుతుంటారు. అయితే ఇలాంటి స్పామ్/స్కామ్ కాల్స్ నుంచి కొంతమంది అవగాహనతో బయటపడుతుంటే, మరికొంతమంది మోసపోతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. 26 ఏళ్ల ఓ సాఫ్వేర్ డెవలపర్ డయల్ ప్యాడ్‌లో ‘1’ నొక్కి లక్ష పోగొట్టుకున్నాడు.
ఎక్కడ జరిగిందంటే? – ఘట్లోడియాలో నివసించే ఓ కుర్రాడు, సింధు భవన్ రోడ్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతడికి ఓ ఆటోమేటెడ్ కాల్ వచ్చింది. అతడేమో ఐవీఆర్ సిస్టమ్‌ను నమ్మి 1 నొక్కాడు. దీంతో గుర్తు తెలియని ఓ వ్యక్తికి కాల్ కనెక్ట్ అయింది. పార్సిల్ చెన్నై నుంచి ముంబయికి వచ్చింది అంటూ డీటెయిల్స్ అడిగాడు. జెన్యూన్ కాల్ అనుకుని, దాన్ని నమ్మిన అతడు ఆధార్ డీటెయిల్స్‌తో పాటు ఇతర సమాచారాన్ని ఇచ్చాడు.
ఆ తర్వాత కాల్ సునీల్ దత్ అనే మరొకరికి కనెక్ట్ అయింది. ‘ముంబయి క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాం, పార్సెస్లో ఆరు బ్యాంక్ కార్డులు ఉన్నాయి, మీరు ఫైనాన్షియల్ క్రైమ్ చేస్తున్నారు? డిజిటల్ అరెస్ట్ చేస్తాం’ అంటూ సునీల్ దత్ చెప్పాడు. అనంతరం అడ్వకేట్ మాట్లాడుతున్నాను అంటూ ఖలీమ్ అన్సారీ అనే వ్యక్తి కూడా సాఫ్ట్ వేర్ డెవలపర్‌ను భయపెట్టాడు. ఈ క్రమంలో సాఫ్ట్ వేర్ డెవలపర్‌ను భయపెట్టి అతడి నుంచి రూ.1 లక్ష ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. వారి మాటలను నమ్మి భయపడిన సాఫ్ట్ వేర్ డెవలవర్ కూడా డబ్బును వారికి ట్రాన్స్సెక్షన్ చేశాడు. అనంతరం డబ్బు ట్రాన్స్ఫర్ అవ్వగానే సునీల్ దత్, ఖలీమ్ అన్సారీ మాయమైపోయారు. అలా 26 ఏళ్ల సాఫ్ట్వేర్ డెవలపర్ అనవసరమైన కాల్‌ను ఎత్తి 1 నొక్కి లక్ష పోగొట్టుకున్నాడు.
స్కామ్ కాల్స్నుంచి ఎలా బయటపడాలంటే? –
అనవసరమైన కాల్స్‌ను ఎత్తి పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వకూడదు. ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఆటోమేటెడ్ కాల్స్‌ను ఎత్తకూడదు. ఐపీఆర్ ఇన్స్ట్రక్షన్స్ను ఫాలో అవ్వకూడదు. ఎందుకంటే స్కామర్స్ మీ బలవంతం చేసి, భయపెట్టి, కన్ఫూజన్‌లోకి నెట్టేస్తారు. అనంతరం డబ్బులు కాజేస్తారు. కాబట్టి అనుమానం రాగానే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి.
ALSO READ : ఓడియమ్మా.. నాయిస్ కొత్త ఎయిర్ క్లిప్స్ ఏమున్నాయ్ బాస్.. 40గంటల ప్లేబ్యాక్, డ్యూయల్ డివైజ్ ఇంకా!