Washing Machine Under 10k: ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో.. చేత్తో బట్టలు ఉతకడం అంటే కత్తి మీద సామే. అందుకే మధ్య తరగతి కుటుంబాల నుంచి బ్యాచిలర్ల వరకు అందరూ వాషింగ్ మెషీన్ కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే.. ఎక్కువ ధర పెట్టి ఫుల్ ఆటోమేటిక్ మెషీన్లు కొనలేక పోయే వారి కోసం, ప్రముఖ బ్రాండ్లు చాలా తక్కువ ధరకే.. సెమీ-ఆటోమేటిక్, కొన్ని కాంపాక్ట్ వాషింగ్ మెషీన్లను మార్కెట్లోకి తెచ్చాయి. ప్రస్తుతం బడ్జెట్ హోమ్ అప్లయన్సెస్.. గురించిన సెర్చ్ విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో రూ 10,000 లోపు దొరికే బెస్ట్ టాప్-5 వాషింగ్ మెషీన్లు ఏవో ఇప్పుడు చూద్దాం.
నమ్మకానికి మారుపేరైన శామ్‌సంగ్ బ్రాండ్ నుంచి వస్తున్న ఈ మోడల్ బడ్జెట్ లవర్స్‌కు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. 7 కేజీల కెపాసిటీ ఉండటం వల్ల చిన్న, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు బట్టలు ఈజీగా ఉతుక్కోవచ్చు. ఎయిర్ టర్బో డ్రై సిస్టమ్ ద్వారా బట్టలు త్వరగా ఆరి పోయేలా చేస్తుంది. తక్కువ పవర్ కన్జంప్షన్ దీని ప్రత్యేకత.
ఎల్‌జీ ఉత్పత్తులకు మార్కెట్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రస్ట్-ప్రూఫ్ ప్లాస్టిక్ బాడీతో వస్తుంది కాబట్టి తుప్పు పట్టే సమస్య ఉండదు. కాలం చెల్లినా కొత్త దాని లాగే మెరుస్తుంది. విభిన్న రకాల బట్టల కోసం వేర్వేరు వాష్ ప్రోగ్రామ్స్ అందించడం వల్ల బట్టలు పాడవకుండా క్లీన్ అవుతాయి.
ఎక్కువ కెపాసిటీ కావాలనుకునే వారికి వైర్‌పూల్ బ్రాండ్ బెస్ట్ ఆప్షన్. మొండి మరకలను ఈజీగా వదిలించడానికి ప్రత్యేకమైన సోక్ టెక్నాలజీ ఇందులో పని చేస్తుంది. కింద చక్రాలు ఉండటం వల్ల.. మెషీన్‌ను.. ఒక చోటు నుంచి మరో చోటుకి ఈజీగా జరుపుకోవచ్చు.
తక్కువ బడ్జెట్‌లో మంచి క్వాలిటీ కోరుకునే వారికి గాడ్‌ప్రెజ్ అద్భుతమైన ఫీచర్లు ఇస్తోంది. పవర్‌ఫుల్ అండ్ సైలెంట్ మోటార్ ఉండటం వల్ల ఉతికేటప్పుడు ఎలాంటి పెద్ద సౌండ్స్ రావు. డ్రయింగ్ పవర్ చాలా బలంగా ఉంటుంది. దీని వల్ల తడి బట్టల్లోని నీరు పూర్తిగా తొలగిస్తుంది.
Also Read: జీమెయిల్ స్టోరేజ్ ఫుల్ ప్రాబ్లమా?క్షణాల్లోనే ఇలా స్పేస్ పెంచండి!
టాటా గ్రూప్‌నకు చెందిన వోల్టాస్ బెకో మార్కెట్లో అత్యంత వేగంగా ఆదరణ పొందుతున్న బ్రాండ్. తక్కువ కరెంట్, తక్కువ నీటితో ఎక్కువ బట్టలను శుభ్రం చేస్తుంది. ఎలుకల వంటి వాటి నుంచి మెషీన్ లోపలి వైరింగ్‌ను కాపాడటానికి ప్రత్యేకమైన ప్రొటెక్షన్ ఇస్తున్నారు.
ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫార్మ్స్‌లో (అమెజాన్, ఫ్లిప్‌కార్ట్) క్రెడిట్/డెబిట్ కార్డ్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను ఉపయోగిస్తే.. ఈ ధరలు మరింత తగ్గి రూ.7,000 నుంచి రూ.8,500లకే లభించే అవకాశం ఉంది.
మీ ఇంట్లో ఉండే సభ్యుల సంఖ్యను బట్టి 6.5 కేజీ లేదా 7.5 కేజీ కెపాసిటీని ఎంచుకోవడం బెస్ట్.
ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా.. తక్కువ ధరలో మంచి పర్ఫామెన్స్ అందించే వాషింగ్ మెషీన్ కోరుకుంటే.. పైన పేర్కొన్న బ్రాండ్లు చక్కటి ఆప్షన్స్.