Mobile Security Tips: ప్రస్తుత డిజిటల్ యుగంలో మన స్మార్ట్ఫోనే.. మన సర్వస్వం. బ్యాంక్ అకౌంట్లు, ఫోటోలు, పర్సనల్ చాట్స్ అన్నీ దాంట్లోనే ఉంటాయి. ఒక వేళ పొరపాటున ఫోన్ పోగొట్టుకున్నా లేదా ఎవరైనా ఎత్తుకెళ్లినా.. మన గుండె ఆగిపోయినంత పనవుతుంది. అయితే.. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఐఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లు రెండింటిలోనూ మీ ఫోన్‌ను దూరం నుంచే.. లాక్ చేసే అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. అవేంటో.. వాటిని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం!
మీది ఆండ్రాయిడ్ ఫోన్ (శామ్సంగ్, రెడ్మి, రియల్మీ, వివో మొదలైనవి) అయితే.. మీ ఫోన్లో ఉన్న ‘గూగుల్ ఫైండ్ మై డివైస్’ (Google Find My Device) ఫీచర్ ద్వారా దాన్ని ఈజీగా లాక్ చేయవచ్చు. ఇందుకోసం మీ దగ్గర వేరే ఫోన్ లేదా ల్యాప్‌టాప్ ఉంటే.. అందులో మీ జీమెయిల్ అకౌంట్‌తో [android.com/find](https://android.com/find) వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. లేదా వేరే ఫోన్లో ‘Find My Device’ యాప్ ఓపెన్ చేయెచ్చు. అక్కడ మీ పోయిన ఫోన్ లొకేషన్ కనిపిస్తుంది. దాని కింద ‘Secure Device’ (సెక్యూర్ డివైస్) అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే మీ ఫోన్ వెంటనే లాక్ అయిపోతుంది. అంతే కాదు.. మీ స్క్రీన్ మీద వేరే.. ఒక నంబర్‌తో పాటు మెసేజ్ కూడా డిస్ప్లే చేయెచ్చు. తద్వారా దొరికిన వ్యక్తి మీకు కాల్ చేయడానికి వీలవుతుంది.
యాపిల్ ఐఫోన్ యూజర్లకు సెక్యూరిటీ విషయంలో.. అగ్రస్థానం ఉంటుంది. ఐఫోన్ పోయినప్పుడు దాన్ని కాపాడుకోవడానికి ‘Find My’ యాప్ లేదా క్లౌడ్ చాలా పవర్ ఫుల్ గా పని చేస్తాయి. ముందుగా వేరే ఐఫోన్ లేదా ఐప్యాడ్‌లో ‘Find My’ యాప్‌ని ఓపెన్ చేయాలి. లేదా [icloud.com/find](https://icloud.com/find) వెబ్‌సైట్‌కి వెళ్లి మీ యాపిల్ ఐడీ (Apple ID) తో లాగిన్ అవ్వాలి.అక్కడ మీ ఐఫోన్‌ను సెలెక్ట్ చేసి ‘Lost Mode’ (లాస్ట్ మోడ్) ఆక్టివేట్ చేయాలి. ఇది ఆన్ చేయగానే.. మీ ఐఫోన్ వెంటనే లాక్ అయిపోతుంది. ఆన్లైన్ పేమెంట్స్ (Apple Pay) వంటి సేవలు నిలిచిపోతాయి. ఒకవేళ ఫోన్ పూర్తిగా దొరికే అవకాశం లేదనిపిస్తే, ‘Erase iPhone’ ఆప్షన్ ద్వారా మీ ఫోన్లోని డేటాను మొత్తం దూరం నుంచే వైప్ (డెలీట్) చేసుకోవచ్చు.
Also Read: జీమెయిల్ స్టోరేజ్ ఫుల్ ప్రాబ్లమా?క్షణాల్లోనే ఇలా స్పేస్ పెంచండి!
ఫోన్ పోగొట్టుకున్నప్పుడు రిమోట్‌గా లాక్ చేయడానికి ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు, ఇది పూర్తిగా ఉచితం. అయితే భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే.. ఎప్పుడూ మీ ఫోన్లో ‘Location’ ,’Find My Device / Find My’ ఆప్షన్స్‌ను ఆన్‌లోనే ఉంచుకోవాలి.
ఒకవేళ మీ ఫోన్ ఖరీదైనదైతే (ఉదాహరణకు కొత్త ఐఫోన్లు లేదా ఫ్లాగ్షిప్ ఆండ్రాయిడ్ ఫోన్లు రూ. 50,000 నుంచి రూ. 1,50000+ ధరల వరకు ఉంటాయి). ఫోన్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. చాలా కంపెనీలు రూ. 1,500 నుంచి రూ. 4,000 వరకు ప్రీమియంతో.. దొంగతనం, నష్టాలకు కవరేజ్ అందిస్తున్నాయి.
టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో..సేఫ్టీ, మొబైల్ సెక్యూరిటీ కూడా అంతే ముఖ్యం. ఫోన్ పోయిన వెంటనే.. కంగారు పడకుండా పైన చెప్పిన సింపుల్ పద్ధతులు పాటిస్తే.. మీ పర్సనల్ డేటాను సురక్షితంగా కాపాడుకోవచ్చు. ఈ ట్రిక్స్‌ను ఇప్పుడే తెలుసుకుని మీ డిజిటల్ లైఫ్‌ను సేఫ్‌గా ఉంచుకోండి!