Phone Overheating Solutions: ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు స్మార్ట్ ఫోన్ మనతోనే ఉంటుంది. ఆఫీస్ పని నుంచి సోషల్ మీడియా స్క్రోలింగ్ వరకు ప్రతి దానికీ ఫోనే ఆధారం. అయితే ఇలా ఫోన్వాడుతున్నప్పుడు ఫోన్ ఒక్క సారిగా వేడెక్కడం గమనించే ఉంటారు. చాలా మంది దీన్ని సాధారణ విషయంగా తీసుకుని లైట్ తీసుకుంటారు. నిపుణుల హెచ్చరికల ప్రకారం.. ఫోన్ పదేపదే హీట్ ఎక్కడం వల్ల బ్యాటరీ సామర్థ్యం దెబ్బతింటుంది. ఒకానొక టైంలో బ్యాటరీ ఉబ్బిపోయి పేలిపోయే ప్రమాదం కూడా ఉంది. మరి మనం చేసే ఏ పొరపాట్లు ఈ ముప్పును కొనితెస్తున్నాయో చూద్దాం.
చాలా మంది ఒరిజినల్ ఛార్జర్ పోతే మార్కెట్లో.. దొరికే లో కాస్ట్ లోకల్ ఛార్జర్లతో ఫోన్ చార్జ్ చేస్తుంటారు. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. లోకల్ ఛార్జర్లు సరైన వోల్టేజ్‌ను అందించకపోవడం వల్ల బ్యాటరీపై.. విపరీతమైన భారం పడి ఫోన్ వేడెక్కుతుంది. దీని వల్ల కొద్ది రోజుల్లోనే బ్యాటరీ లైఫ్ పూర్తిగా తగ్గిపోతుంది. ఒరిజినల్ కంపెనీ ఛార్జర్లు సాధారణంగా రూ. 1,000 నుంచి రూ.2,500 వరకు ఉంటాయి. కొంచెం డబ్బులు మిగుల్చుకోవాలని లోకల్ ఛార్జర్లు (రూ.300-రూ.500) కొంటే,మీ విలువైన ఫోన్ బ్యాటరీ పాడైపోతుంది.
ఇది చాలామంది చేసే కామన్ పొరపాటు. ఫోన్ ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు ప్రాసెసర్, బ్యాటరీ ఇప్పటికే వేడెక్కుతుంటాయి. ఆ సమయంలో.. హెవీ గేమ్స్ ఆడటం లేదా సినిమా చూడటం వల్ల ఉష్ణోగ్రత అమాంతం పెరుగుతుంది. ఇది బ్యాటరీలోని కెమికల్స్‌ను దెబ్బతీసి దాని సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది.
ఫోన్ స్క్రీన్ బ్రైట్ నెస్‌ను ఎప్పుడూ ఫుల్‌గా పెట్టుకోవడం, అవసరం లేకపోయినా.. బ్యాక్‌గ్రౌండ్‌లో డజన్ల కొద్దీ యాప్స్‌ను రన్ చేయడం వల్ల ప్రాసెసర్ పాడైపోతుంది. దీనివల్ల ఫోన్ త్వరగా వేడెక్కుతుంది. అలాగే డైరెక్ట్ సూర్యకాంతిలో (ఎండలో) ఫోన్‌ను ఎక్కువసేపు ఉంచడం కూడా ప్రమాదకరమే.
Also Read: జీమెయిల్ స్టోరేజ్ ఫుల్ ప్రాబ్లమా?క్షణాల్లోనే ఇలా స్పేస్ పెంచండి!
మీ స్మార్ట్‌ఫోన్, బ్యాటరీ ఆయువును పెంచడానికి కొన్ని చిన్న జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం.
కవర్ తొలగించండి: గేమ్స్ ఆడుతున్నప్పుడు లేదా ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు థిక్ కవర్స్ తొలగించడం మంచిది. ఇది ఫోన్ లోపలి వేడి బయటకు పోవడానికి సహాయ పడుతుంది.
ఒరిజినల్ యాక్ససరీస్ : ఎప్పుడైనా సరే కంపెనీ అందించిన లేదా సర్టిఫైడ్ ఛార్జర్లను మాత్రమే ఉపయోగించండి.
అవసరం లేని యాప్స్ : బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యే అనవసరమైన యాప్స్‌ను.. ఎప్పటికప్పుడు క్లియర్ చేయడం ద్వారా ప్రాసెసర్‌పై భారం తగ్గుతుంది.
స్మార్ట్‌ఫోన్ అనేది మన జీవితంలో.. ఒక ముఖ్యమైన భాగం అయిపోయింది. చిన్న చిన్న అలవాట్లను మార్చుకోవడం.. ద్వారా మీ ఫోన్ బ్యాటరీని కాపాడుకోవచ్చు. ఈ రోజే మీ ఈ టెక్ పొరపాట్లను సరిదిద్దుకుని మీ ఫోన్‌ను ఎల్లప్పుడూ కూల్‌గా, ట్రెండీగా ఉంచుకోండి!