E-Paper
Advertisement

మనలాగే మాట్లాడే ఈ ‘పర్సనల్ ఏఐ అవతార్’ గురించి తెలుసా? గూగుల్ జెమిని కొత్త ఫీచర్ ఇదే!

మనలాగే మాట్లాడే ఈ ‘పర్సనల్ ఏఐ అవతార్’ గురించి తెలుసా? గూగుల్ జెమిని కొత్త ఫీచర్ ఇదే!
Advertisement

Google Gemini AI Avatar: నేటి ఆధునిక యుగంలో మన ఫొటోలు, వీడియోలను కొత్తగా మార్చుకోవడానికి రోజుకో కొత్త ఏఐ టూల్ అందుబాటులోకి వస్తోంది. ఇప్పుడు టెక్ దిగ్గజం గూగుల్ జెమిని కూడా మరో అద్భుతమైన ఫీచర్‌ను మన ముందుకు తీసుకొచ్చింది. దీని సాయంతో అచ్చం మన ముఖం, మన గొంతుతోనే పనిచేసే సొంత AI Avatar ను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అంతేకాదు.. ఈ అవతార్‌ను మన స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేసుకుని, వాళ్ల క్రియేషన్స్‌లోనూ ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది. మరి ఈ సరికొత్త ఫీచర్‌ని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందామా..

ఏమిటీ పర్సనల్ అవతార్?

గూగుల్ జెమినీలో పర్సనల్ అవతార్ అంటే మన రూపం, గొంతును పోలి ఉండే ఏఐ రూపం. దీనికోసం యూజర్ తన ముఖం, గొంతును రికార్డ్ చేసి ఇవ్వాలి. ఆ వివరాల ఆధారంగా జెమినీ అవతార్‌ను తయారు చేస్తుంది. తర్వాత మన రూపంతో ఫొటోలు, వీడియోలు క్రియేట్ చేసుకోవచ్చు. ఇతరులు కూడా తమ అవతార్లను షేర్ చేస్తే.. వాటితో కలిపి కొత్త క్రియేషన్స్ తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం గూగుల్ నానో బనానా, జెమినీ ఓమ్ని టూల్స్ ఉపయోగిస్తుంది.

Advertisement

Also Read: ఐఫోన్ డ్యూయో స్క్రీన్ క్రాక్ సమస్య.. సర్వీస్ సెంటర్లకు యాపిల్ చేసిన ఆదేశాలివే!

ఎవరికి అందుబాటులో ఉంది?

ఈ ఫీచర్‌ను ఉపయోగించాలంటే 18 ఏళ్లు నిండి ఉండాలి. వ్యక్తిగత గూగుల్ అకౌంట్ కూడా అవసరం. ప్రస్తుతం ఇంగ్లీష్ భాషకు మాత్రమే సపోర్ట్ ఉంది. యూకే, యూరోపియన్ ఎకనామిక్ ఏరియా, స్విట్జర్లాండ్‌లో ఈ ఫీచర్ అందుబాటులో లేదు. పర్సనల్ అవతార్‌తో వీడియోలు తయారు చేయాలంటే గూగుల్ ఏఐ ప్లాన్ ఉండాలి. అయితే ఫీచర్ అందుబాటు మీ అకౌంట్‌ను బట్టి మారవచ్చు.

Advertisement

అవతార్ ఎలా తయారు చేయాలి?

ముందుగా జెమినీ యాప్ లేదా వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. పర్సనల్ అవతార్స్ విభాగంలోకి వెళ్లి కొత్త అవతార్ తయారీ ఎంపికను ఎంచుకోవాలి. స్క్రీన్‌పై కనిపించే క్యూఆర్ కోడ్‌ను ఫోన్‌తో స్కాన్ చేయాలి. తర్వాత మంచి వెలుతురు ఉన్న చోట ముఖం, గొంతును సూచనల ప్రకారం రికార్డ్ చేయాలి. ముఖం స్పష్టంగా కనిపించేలా చూసుకోవాలి. రికార్డింగ్స్ సమర్పించిన తర్వాత జెమినీ వాటిని ప్రాసెస్ చేసి అవతార్‌ను సిద్ధం చేస్తుంది.

షేర్ చేయడం, డిలీట్ చేయడం ఎలా?

తయారైన అవతార్‌ను ఇతరులతో షేర్ చేయాలంటే వారి జీమెయిల్ అడ్రస్‌కు ఆహ్వానం పంపాలి. అవతార్‌ను ఉపయోగించాలంటే అవతార్ యజమాని పంపిన ఆహ్వానాన్ని వారు అంగీకరించాలి. ఇక అవతార్ అవసరం లేదనుకుంటే గూగుల్ అకౌంట్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి డిలీట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఫీచర్ ఉపయోగించే ముందు ఎవరితో షేర్ చేస్తున్నామో.. మన రూపాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకోవడం మంచిది.

Also Read: వాట్సప్‌లో ఇలాంటి మెసేజ్ వస్తే వెంటనే ఆ పని చేయండి.. లేదంటే మొత్తం ఊడ్చేస్తారు!

Tags

Related News

200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. ఒప్పో రెనో 17 సిరీస్‌లో ఇవే స్పెషల్ ఫీచర్లు!

ఫోన్ పోయిందా? దొంగల చేతికి చిక్కకుండా సెక్యూరిటీ లాక్ వేయండిలా?

పిల్లల కోసం బెస్ట్ స్మార్ట్‌వాచ్..నాయిస్ జూనియర్ ఎక్స్ప్లోరర్ 2 ఫీచర్లు ఇవే!

రూ.10వేలలోపు బెస్ట్ వాషింగ్ మెషీన్స్..ఆఫర్ ముగిసేలోపే కొనేయండి

మొబైల్ బ్యాటరీ లైఫ్ పెరగాలా?ఈ రోజు నుంచే ఈ అలవాట్లు మార్చుకోండి!

జీమెయిల్ స్టోరేజ్ ఫుల్ ప్రాబ్లమా?క్షణాల్లోనే ఇలా స్పేస్ పెంచండి!

టెక్ ప్రపంచంలో ఊహకందని అద్భుతం.. శాంసంగ్ నుంచి 17 ఇంచుల ట్యాబ్లెట్, జేబులో పట్టేస్తుంది!

Big Stories

Advertisement
×