E-Paper
Advertisement

రాప్తాడు ఘటనపై మంచు మనోజ్ ఎమోషనల్..పోస్ట్ వైరల్!

రాప్తాడు ఘటనపై మంచు మనోజ్ ఎమోషనల్..పోస్ట్ వైరల్!
Advertisement

Manchu Manoj: మంచు మనోజ్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.. ఇలా హీరోగా, విలన్ పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న మంచు మనోజ్(Manchu Manoj) సామాజిక అంశాల గురించి కూడా మాట్లాడుతూ తన అభిప్రాయాలను తెలియజేస్తుంటారు. ముఖ్యంగా మహిళల పట్ల అమ్మాయిల పట్ల ఎక్కడైనా దాడులు జరిగిన వెంటనే ఈయన స్పందిస్తుంటారు. గతంలో కూడా ఇలాంటి విషయాలలో మనోజ్ బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా రాప్తాడు ఘటనపై కూడా మంచు మనోజ్ స్పందించారు.

రాప్తాడు ఘటన కలిచివేసింది..

అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న గోపిక అనే విద్యార్థినిపై హేమంత్ అనే వ్యక్తి దారుణంగా చెట్లు కట్ చేసే రంపంతో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బాలిక తీవ్ర ప్రాణాపాయ స్థితిలో ఉంది మెరుగైన వైద్యం కోసం ఆమెను బెంగళూరుకు తరలించారు. ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వం బాలిక ఆరోగ్యం పట్ల అప్డేట్స్ తెలియజేస్తూ ఉన్నారు. ఈ ఘటనపై మంచు మనోజ్ తాజాగా స్పందిస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. రాప్తాడు స్కూల్ లో జరిగిన ఘటన నన్ను ఎంతగానో కలిసివేసింది దాడిలో గాయాలు పాలైన ఇద్దరు అమ్మాయిలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు మనోజ్ తెలిపారు.

మహిళలకు గౌరవం ఇవ్వండి..

Advertisement

తన స్నేహితురాలి ప్రాణాలను కాపాడటం కోసం ఎంతో ధైర్య సాహసాలతో ముందుకు వచ్చిన తన స్నేహితురాలి పై కూడా మనోజ్ ప్రశంసలు కురిపించారు. పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు టీచర్లకు అలాగే బాధిత కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇప్పించాలని మనోజ్ కోరారు. అదేవిధంగా గోపిక విషయంలో వైద్యులు స్పందిస్తున్న తీరుకు ఈయన వైద్య బృందానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇలా సమాజంలో అమ్మాయిలు మహిళల పట్ల జరుగుతున్న ఈ దాడులను మనోజ్ ఖండించడమే కాకుండా మహిళలకు గౌరవం ఇవ్వాలని కోరారు.

Advertisement

మహిళల పట్ల గౌరవం మన ఇంట్లోనే ప్రారంభమవుతుందని మా పిల్లలు కూడా చూస్తున్నారు మనం కోరుకునే సమాజం మహిళలకు మనం ఇచ్చే గౌరవం అనేది మన ఇంట్లో నుంచే మొదలవుతుందని, అందరం కలిసి ఆసురక్షితమైన సమాజాన్ని నిర్మిద్దాం అంటూ మంచు మనోజ్ ఈ సందర్భంగా ఈ ఘటన పట్ల ఎమోషనల్ అవుతూ బాధిత బాలిక త్వరగా కోలుకోవాలని అలాగే ప్రతి ఒక్కరూ మహిళలకు గౌరవం ఇవ్వాలని కోరుతూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక మంచు మనోజ్ ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న దాదా సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు వడ్డీ కాసుల వాడ, డేవిడ్ రెడ్డి వంటి తదితర సినిమాలో షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.

Also Read: ‘రుద్రవనం పి.ఎస్’ వెబ్ సిరీస్ రివ్యూ అండ్ రేటింగ్

Related News

సమంతకు కవల పిల్లలా? హింట్ ఇచ్చిన స్టార్ హీరోయిన్!

చిరు చేతుల మీదుగా ఆర్‌సీ17 గ్రాండ్ ప్రారంభం.. సుకుమార్ భార్య ఎమోషనల్ పోస్ట్!

ఆకట్టుకుంటున్న సూర్య ‘ సీన్’ తెలుగు ట్రైలర్..ఎలా ఉందంటే?

వెంకీ మామకు షాక్.. ఆదర్శ కుటుంబం కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే!

పెయింటింగ్‌లా పాలక్ తివారీ.. చూపు తిప్పుకోనివ్వని అందంతో సోషల్ మీడియాలో రచ్చ!

ఆ ఏడు రోజులు నిద్రపోలేదు.. కన్నీళ్లు పెట్టుకున్న రాజీవ్

అందాల ఆరబోతలో తగ్గేదే లేదంటున్న హెబ్బా!

Big Stories

Advertisement
×