Noise Junior Explorer 2: స్కూల్స్,ట్యూషన్స్‌కి వెళ్లే పిల్లల సంరక్షణపై నేటి పేరెంట్స్ చాలా కేర్‌ఫుల్‌గా ఉంటున్నారు. ప్రతి సారీ చిన్న పిల్లల చేతిలో.. స్మార్ట్‌ఫోన్ పెట్టడం మంచిది కాదు కాబట్టి.. టెక్ మార్కెట్లోకి ‘కిడ్స్ స్మార్ట్ వాచ్‌లు’ భారీ డిమాండ్‌తో.. దూసుకొచ్చాయి. ఇందులో ప్రముఖ బ్రాండ్ అయిన ‘నాయిస్’సంస్థ విడుదల చేసిన తాజా మోడల్ Noise Junior Explorer 2 మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఇలాంటి సేఫ్టీ గాడ్జెట్ల గురించే పేరెంట్స్ ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ వాచ్ అతిపెద్ద ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో నానో 4G సిమ్ కార్డ్ వేసుకోవడానికి అవకాశం ఉంది.
వీడియో కాలింగ్: వాచ్‌లో బిల్ట్-ఇన్ కెమెరా ఉండటం వల్ల పేరెంట్స్ పిల్లలతో నేరుగా వీడియో కాల్స్ మాట్లాడొచ్చు. పిల్లలు ఎక్కడ ఉన్నారో ఎప్పుడూ కాంటాక్ట్‌లో ఉండటానికి ఇది చాలా బాగా ఉపయోగ పడుతుంది.
టూ-వే కమ్యూనికేషన్: ఎమర్జెన్సీ సమయంలో.. పిల్లలు నేరుగా పేరెంట్స్‌కి కాల్ చేయడానికి లేదా వాయిస్ మెసేజ్‌లు పంపడానికి ఈ వాచ్ చక్కగా పని చేస్తుంది.
పిల్లలు స్కూల్ నుంచి ఎక్కడికైనా వెళ్లారా లేదా కరెక్ట్ టైమ్‌కి చేరుకున్నారా అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ వాచ్‌లో ఉన్న రియల్-టైమ్ GPS ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా తల్లిదండ్రులు తమ స్మార్ట్‌ఫోన్ యాప్ సహాయంతో.. పిల్లల కచ్చితమైన లొకేషన్‌ను ఎప్పటికప్పుడు లైవ్‌లో ట్రాక్ చేయెచ్చు. అంతేకాకుండా ‘సేఫ్ జోన్స్’అనగా స్కూల్ లేదా ఇల్లు వంటి ప్రాంతాలను సెట్ చేసుకోవచ్చు. పిల్లలు ఆ జోన్ దాటి వెళ్తే.. వెంటనే పేరెంట్స్ ఫోన్‌కు అలర్ట్ వస్తుంది.
పిల్లలకు ఆపద సమయంలో ..లేదా ఏదైనా సమస్య ఎదురైనప్పుడు వాచ్‌పై ఉండే SOS బటన్‌ను ఒక సారి నొక్కితే.. చాలు, వెంటనే ప్రీ-ప్రోగ్రామ్ చేసిన పేరెంట్స్ నంబర్లకు ఎమర్జెన్సీ అలర్ట్, లొకేషన్ వెళ్తుంది.ఇది పిల్లల సేఫ్టీకి రక్షణ కవచంలా పని చేస్తుంది.
పిల్లలు వాడే గాడ్జెట్ కాబట్టి ఇది చాలా మంచి క్వాలిటీతోతయారు చేయబడింది. అంతే కాకుండా ఇది రంగు రంగుల స్ట్రాప్స్‌తో చూడటానికి చాలా ట్రెండ్‌గా, ఆకర్షణీయంగా ఉంటుంది.వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ దీనిలో ఉండటం వల్ల పిల్లలు ఆడుకునేటప్పుడు నీళ్లు పడ్డా లేదా వర్షంలో.. తడిచినా వాచ్‌కు ఎలాంటి డ్యామేజ్ కాదు. బ్యాటరీ లైఫ్ కూడా.. ఒక సారి ఛార్జ్ చేస్తే రోజంతా..వచ్చేలాగా పవర్‌ఫుల్ బ్యాటరీని ఇచ్చారు.
Also Read:
ఈ స్మార్ట్ వాచ్ అసలు ధర మార్కెట్లో సుమారు రూ. 5,999 వరకు ఉంది.
అయితే ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫార్మ్స్ (అమెజాన్, ఫ్లిప్‌కార్ట్), నాయిస్ అధికారిక వెబ్‌సైట్‌లో జరిగే సేల్స్, బ్యాంక్ ఆఫర్ల సమయంలో.. ఈ వాచ్ మరింత తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది.
పిల్లల డిజిటల్ సేఫ్టీ, పేరెంట్స్ మనశ్శాంతిని దృష్టిలో ఉంచుకుంటే.. ఈ ప్రైస్ రేంజ్‌లో ‘Noise Junior Explorer 2’ ఒక బెస్ట్ వాల్యూ ఫర్ మనీ గాడ్జెట్ అని చెప్పొచ్చు. ట్రెండింగ్ టెక్నాలజీతో.. మీ పిల్లలను మరింత సేఫ్‌గా ఉంచడానికి ఈరోజే.. ఈ స్మార్ట్‌వాచ్‌ను ఆర్డర్ చేయెచ్చు.