E-Paper
Advertisement

ఫోన్ ట్యాపింగ్ కేసులో న్యూ‌ట్విస్ట్.. ఏ-1గా హరీ‌ష్‌రావు పేరు! షాకైన బీఆర్ఎస్ నేతలు

ఫోన్ ట్యాపింగ్ కేసులో న్యూ‌ట్విస్ట్.. ఏ-1గా హరీ‌ష్‌రావు పేరు! షాకైన బీఆర్ఎస్ నేతలు
Advertisement

Phone Tapping Case: తెలంగాణలో సంచలన రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు తిరిగింది. బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్‌రావుపై కేసు నమోదు అయ్యింది. ఈ విషయం తెలియగానే ఆ పార్టీ నేతలు ఒక్కసారిగా షాకయ్యారు. ఉన్నట్లుండి హరీష్ రావు పేరు పెట్టడం వెనుక అసలు ఏం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్లే..

ఫోన్ ట్యాపింగ్ కేసు న్యూ‌ట్విస్ట్

తెలంగాణలో సంచలనం రేపింది ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు. ఈ కేసులో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావుపై కేసు నమోదైంది. చక్రధర్‌గౌడ్‌ ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. మూడేళ్ల కిందట తన ఫోన్‌, భార్య ఫోన్‌ కూడా ట్యాప్‌ చేశారని అందులో ప్రస్తావించారు. పంజాగుట్ట నుంచి సిద్దిపేటకు ఈ కేసు బదిలీ అయ్యింది. ఈ కేసులో సిద్ధిపేట వన్ పోలీసులు కొత్తగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

సిద్దిపేట్‌ పోలీసులు దర్యాప్తు, ఏ1 గా హరీష్‌రావు పేరు?

Advertisement

గతంలో పంజాగుట్టలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌కు కొన్ని సెక్షన్లు జోడించడంతో బీఆర్ఎస్‌లో గుబులు మొదలైంది. పాత ఎఫ్‌ఐఆర్‌తో పోలిస్తే కొత్త ఎఫ్‌ఐఆర్‌లో దాదాపు ఆరు సెక్షన్లు చేర్చినట్లు సమాచారం. ఐపీసీ 419, 420, 467, 406 సెక్షన్లతోపాటు ఐటీ చట్టంలోని 66C, 66D సెక్షన్లను పొందుపరిచినట్టు సమాచారం. ఎఫ్‌ఐఆర్‌లో నిందితుల జాబితాలో ఏ-1గా హరీశ్ రావు, ఏ-2 గా మాజీ డీసీపీ రాధాకిషన్ రావు పేర్లు ఉన్నాయి.

ALSO READ: కేటీఆర్ ముందే కార్యకర్తలపై మల్లారెడ్డి ఆగ్రహం.. ముఖం పగలగొడతా అంటూ..

Advertisement

వీరిద్దరు కాకుండా కొందరి పేర్లు నిందితుల జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. ఈ కేసు సిద్దిపేటకు బదిలీ కావడంతో అక్కడి పోలీసులు కొత్త ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దర్యాప్తులో నిమగ్నమయ్యారు. నిందితులకు రేపో మాపో నోటీసులు ఇచ్చి విచారించాలని ఆలోచన చేస్తున్నారట పోలీసులు. అంతేకాదు కొన్ని అరెస్టులు తప్పవనే వాదనల బలంగా వినిపిస్తోంది. జరుగుతున్న పరిమాణాలతో బీఆర్ఎస్ నేతలు షాకయ్యారు.

Related News

హైదరాబాద్‌లోని ప్రముఖ హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ దాడులు.. 14 హోటళ్లు సీజ్.. పిస్తా హౌస్, ఫలక్‌నుమా ప్యాలెస్‌లకు నోటీసులు!

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎల్ నినో యాక్షన్ ప్లాన్.. ఆదేశాలు జారీ!

హైదరాబాద్‌లో స్పేర్ వీల్స్ చోరీల కలకలం.. MBA విద్యార్థి అరెస్ట్!

కేటీఆర్ ముందే కార్యకర్తలపై మల్లారెడ్డి ఆగ్రహం.. ముఖం పగలగొడతా అంటూ..

ఓయూ పరిధిలో భారీ స్కామ్? ఏకంగా 117 ప్రైవేట్ కాలేజీలకు షోకాజ్ నోటీసులు!

అల్వాల్‌ జానకీనగర్‌లో భారీ చోరీ.. 29 తులాల బంగారం, నగదు అపహరణ!

మల్కారం క్వారీలో విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి!

Big Stories

Advertisement
×