E-Paper
Advertisement

జీమెయిల్ స్టోరేజ్ ఫుల్ ప్రాబ్లమా?క్షణాల్లోనే ఇలా స్పేస్ పెంచండి!

జీమెయిల్ స్టోరేజ్ ఫుల్ ప్రాబ్లమా?క్షణాల్లోనే ఇలా స్పేస్ పెంచండి!
Advertisement

Free Up Google Space: ప్రస్తుత డిజిటల్ యుగంలో.. మన మెయిల్స్, ప్రమోషనల్ మెసేజ్‌లు, అనవసరమైన న్యూస్‌లెటర్స్‌తో జీమెయిల్ బాక్స్ ఇన్‌బాక్స్ త్వరగా నిండిపోతుంది. గూగుల్ ఇచ్చే 15GB ఉచిత లిమిట్ అయిపోగానే.. అదనపు స్టోరేజ్ కోసం డబ్బులు చెల్లించమని నోటిఫికేషన్లు వస్తుంటాయి. కానీ.. కొంచెం స్మార్ట్‌గా ఆలోచిస్తే ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా మీ జీమెయిల్‌లో బోలెడంత స్థలాన్ని ఖాళీ చేసుకోవచ్చు. ఫోన్‌లో స్పేస్‌ను ఎలా మేనేజ్ చేసుకోవాలో చూద్దాం.

1. పెద్ద ఫైల్స్, అటాచ్‌మెంట్లు డిలీట్ చేయడం:

మన జీమెయిల్‌లోఎక్కువ.. స్థలాన్ని ఆక్రమించేవి.. ఫోటోలు వీడియోలు ఉన్న మెయిల్స్. వీటిని ఈజీగా గుర్తించి డిలీట్ చేయెచ్చు. ఇందుకోసం మీ జీమెయిల్ సెర్చ్ బార్‌లో has:attachment larger:10MB అని టైప్ చేసి సెర్చ్ చేయండి. 10MB కంటే ఎక్కువ సైజ్ ఉన్న మెయిల్స్ అన్నీ మీ ముందుకు వస్తాయి. వాటిలో మీకు అవసరం లేని మెయిల్స్‌ను సెలెక్ట్ చేసి శాశ్వతంగా డిలీట్ చేయండి.

2. ప్రమోషనల్ మెయిల్స్ :

Advertisement

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్విగ్గీ, జొమాటో , వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌ల నుంచి వచ్చే అనవసరమైన నోటిఫికేషన్ మెయిల్స్ వేల సంఖ్యలో నిండిపోయి ఉంటాయి. వీటి కోసం సెర్చ్ బార్‌లో label:promotions లేదా label:social అని టైప్ చేసి.. పైన ఉన్న ‘Select All’ ఆప్షన్ పై క్లిక్ చేసి ఒకేసారి వేల మెయిల్స్‌ను సెలెక్ట్ చేసి డిలీట్ చేయెచ్చు. దీని వల్ల ఇన్‌బాక్స్ క్లీన్ అవ్వడంతో పాటు భారీగా స్పేస్ ఫ్రీ అవుతుంది.

3. ట్రాష్,’స్పామ్’ఫోల్డర్‌ క్లియర్ :

మనం ఏ మెయిల్స్‌నైతే.. డిలీట్ చేస్తామో..అవన్నీ నేరుగా ‘Trash’ ఫోల్డర్‌లోకి వెళ్తాయి.అలాగే..స్పామ్ ఫోల్డర్‌లో కూడా అనవసరమైన మెయిల్స్ పేరుకుపోతాయి.ఇవి కూడా మీ 15GB స్టోరేజ్‌లో భాగమే అవుతాయి. జీమెయిల్ మెనూలోకి వెళ్లి ‘Trash’, ‘Spam’ ఫోల్డర్‌లను ఓపెన్ చేసి..పైన ఉండే ‘Empty Trash now’, ‘Empty Spam now’ పై క్లిక్ చేయండి. క్షణాల్లో మీ మెమరీ ఖాళీ అవుతుంది.

4. గూగుల్ ఫోటోలు :

Advertisement

మీ జీమెయిల్ స్టోరేజ్ నిండటానికి కేవలం మెయిల్స్ మాత్రమే కాకుండా.. గూగుల్ ఫోటోలు, డ్రైవ్‌లో సేవ్ అయిన వీడియోలు కూడా ప్రధాన కారణం కావచ్చు. ఇలాంటి సందర్భంలో [one.google.com/storage](https://one.google.com/storage) వెబ్‌సైట్‌కి వెళ్తే మీ స్టోరేజ్ ఎక్కడ ఎక్కువగా నిండిందో క్లియర్ కట్‌గా కనిపిస్తుంది. అక్కడ ‘Clean up space’ ఆప్షన్ ద్వారా బ్లర్ అయిన ఫోటోలు, వీడియోలను ఈజీగా తొలగించవచ్చు.

Also Read: విండోస్ 11లో స్క్రీన్‌షాట్ తీయడం ఎలా? ఈ 7 ట్రిక్స్ మీకు తెలుసా?

5. ఆటోమేటిక్ ఫిల్టర్స్ :

భవిష్యత్తులో స్టోరేజ్ మళ్లీ నిండకుండా ఉండాలంటే.. మీకు రోజూ వచ్చే అనవసరమైన మార్కెటింగ్ మెయిల్స్‌కు ‘Unsubscribe’ చేయడం మంచిది. అలాగే.. ఆటోమేటిక్ ఫిల్టర్స్ సెట్ చేయడం ద్వారా రాబోయే జంక్ మెయిల్స్ నేరుగా డిలీట్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు.

పైన చెప్పిన 5 పద్ధతులను పాటిస్తే మీ గూగుల్ అకౌంట్‌లో కనీసం 2GB నుంచి 10GB వరకు స్పేస్ ఫ్రీ అవుతుంది. పెయిడ్ ప్లాన్స్.. ఒకవేళ మీకు నిజంగానే ఎక్కువ స్టోరేజ్ అవసరమైతే.. గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా 100GB స్టోరేజ్ నెలకు సుమారు రూ. 130 లేదా సంవత్సరానికి రూ. 1,300 ధరతో అందుబాటులో ఉంది.

జీమెయిల్ స్టోరేజ్ ఫుల్ అయిందని టెన్షన్ పడాల్సిన పని లేదు. ప్రతి నెలా డబ్బులు చెల్లించి క్లౌడ్ స్పేస్ కొనాల్సిన అవసరం అంతకంటే.. లేదు. పైన పేర్కొన్న చిన్న చిన్న ట్రిక్స్ పాటిస్తే.. మీ జీమెయిల్‌ను ఎంతో నీట్‌గా,ఫ్రీగా ఉంచుకోవచ్చు. ఈ రోజే మీ మెయిల్స్‌ను క్లీన్ చేసుకోండి!

Related News

మొబైల్ బ్యాటరీ లైఫ్ పెరగాలా?ఈ రోజు నుంచే ఈ అలవాట్లు మార్చుకోండి!

టెక్ ప్రపంచంలో ఊహకందని అద్భుతం.. శాంసంగ్ నుంచి 17 ఇంచుల ట్యాబ్లెట్, జేబులో పట్టేస్తుంది!

కొత్త బట్టలు కొనకుండానే ట్రెండీ లుక్స్ ట్రై చేయొచ్చు.. మెటా తెచ్చిన ఈ యాప్ ఏంటో తెలుసా?

అమెజాన్ సేల్..బెస్ట్ సైడ్-బై-సైడ్ రిఫ్రిజిరేటర్లపై అదిరిపోయే ఆఫర్లు!

లేటెస్ట్ ఫీచర్లతో అదిరిపోయే 32 ఇంచుల టీవీలు..ధర కూడా చాలా తక్కువ

వాట్సప్‌లో ఇలాంటి మెసేజ్ వస్తే వెంటనే ఆ పని చేయండి.. లేదంటే మొత్తం ఊడ్చేస్తారు!

విండోస్ 11లో స్క్రీన్‌షాట్ తీయడం ఎలా? ఈ 7 ట్రిక్స్ మీకు తెలుసా?

Big Stories

Advertisement
×