Diwali gifting wireless earbuds: దీపావళి పండగ వచ్చిందంటే.. మన ప్రియమైన వారికి ప్రత్యేకమైన గిఫ్టులు ఇవ్వడం ద్వారా మన ప్రేమను వ్యక్తపరుస్తాం. ఈ సారి స్వీట్లు, సాధారణ బహుమతులకు బదులుగా.. రోజూ ఎంతో ఉపయోగపడే ఒక మంచి ట్రెండీ గాడ్జెట్‌ను గిఫ్ట్ ఇస్తే ఎలా ఉంటుంది? మ్యూజిక్ ఇష్టపడేవారికి వైర్లెస్ ఇయర్‌బడ్స్ ఎప్పుడూ నంబర్ 1 ఆప్షన్ గా ఉంటాయి. అది కూడా రూ. 2,000లోపు బడ్జెట్లో, అద్భుతమైన సౌండ్, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్ కలిగిన బెస్ట్ ఇయర్‌బడ్స్‌ను ఈ దీపావళికి ఎలా ఎంచుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఇండియన్ మార్కెట్లో ట్రెండింగ్‌లో ఉండే బ్రాండ్లలో బోట్ ముందుంటుంది. బడ్జెట్ ధరలో.. అదిరిపోయే బేస్ సౌండ్‌ను అందించడంలో.. ఈ ఇయర్‌బడ్స్ ప్రత్యేకత చాటుకుంటున్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, గేమింగ్ కోసం తక్కువ లేటెన్సీ మోడ్ , బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ దీని సొంతం. వాటర్ రెసిస్టెన్స్ ఉండటం వల్ల వర్కౌట్లు చేసే వారికి కూడా పర్ఫెక్ట్గా సరి పోతుంది.
ధర: మోడల్‌ను బట్టి సుమారు రూ.1,299 నుంచి రూ.1,799 వరకు లభిస్తుంది.
క్లీన్ సౌండ్ , స్టైలిష్ డిజైన్ కోరుకునే వారికి.. రియల్‌మి ఇయర్ బడ్స్ చక్కటి ఆప్షన్ అవుతుంది. ఇవి చెవులకు సౌకర్యంగా ఉంటాయి. అంతే కాకుండా వీటి కాల్ క్వాలిటీ చాలా స్పష్టంగా ఉంటుంది. వీటిలోని యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ ఫీచర్, పెద్ద డ్రైవర్ యూనిట్ ద్వారా అద్భుతమైన ఆడియో ఫీల్ ఇస్తాయి. ఒకసారి ఛార్జ్ చేస్తే .. కేసుతో కలిపి రోజంతా బ్యాటరీ బ్యాకప్ వస్తుంది.
ధర: మార్కెట్లో దీని ధర సుమారు రూ.1,499 నుంచి రూ.1,999 మధ్య ఉంది.
ప్రీమియం బ్రాండ్ ఫీల్ తక్కువ ధరలో కోరుకునే వారికి వన్‌ప్లాస్ నార్డ్ బడ్స్ అద్భుతమైన గిఫ్ట్ ఆప్షన్. దీని లుక్ చాలా క్లాసీగా ఉంటుంది. డాల్బీ ఆడియో సపోర్ట్, అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ (కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో.. గంటల తరబడి మ్యూజిక్ ఎంజాయ్ చేయెచ్చు). స్పష్టమైన వాయిస్ కాల్స్ కోసం డ్యూయల్ మైక్ సిస్టమ్ ఉంది.
ధర: దీని ధర సుమారు రూ.1,699 నుంచి రూ.1,999 వరకు అందుబాటులో ఉంది.
మార్కెట్లో చాలా ఫేమస్ అయిన మరో ప్రముఖ బ్రాండ్ నాయిస్. ఇవి బెస్ట్ రంగులలో, మోడర్న్ డిజైన్‌లో లభిస్తాయి. టచ్ కంట్రోల్స్, బ్లూటూత్ లేటెస్ట్ వెర్షన్ కనెక్టివిటీ , హై-కెపాసిటీ బ్యాటరీ దీని ప్రధాన ఆకర్షణ. తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఫీచర్లు కోరుకునే.. వారికి ఇది బెస్ట్ ఛాయిస్.
ధర: సుమారు రూ.999 నుంచి రూ.1,599 ధరలో లభిస్తుంది.
Also Read: స్వీట్లకు బదులుగా.. దీపావళికి ఈ 5 గాడ్జెట్లను బహుమతిగా ఇవ్వండి!
మంచి కనెక్టివిటీ , నమ్మకమైన పనితీరును అందించే.. ఒప్పో ఎన్కో బడ్స్ ఆడియో లవర్స్ ఫేవరెట్ లిస్ట్‌లో ఉంటాయి. ఇంటెలిజెంట్ కాల్ నాయిస్ క్యాన్సలేషన్, గేమింగ్ మోడ్ , వాటర్-డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్ కలిగి ఉన్నాయి. బ్యాటరీ లైఫ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.
ధర: సుమారు రూ.1,499 నుంచి రూ.1,899 ధరలో లభిస్తుంది.
ఈ దీపావళికి మీ ప్రియమైన వారికి కేవలం రూ. 2,000లోపు బడ్జెట్లో ఈ అద్భుతమైన ఇయర్ బడ్స్‌ను గిఫ్ట్ ఇవ్వడం ద్వారా వారి పండగను మరింత ఆనందంగా మార్చండి. సౌండ్, స్టైల్, బ్యాటరీ పరంగా నంబర్‌గా నిలిచే ఈ గాడ్జెట్స్ వారికి కచ్చితంగా నచ్చుతాయి.