Mini Washing Machines: బ్యాచిలర్లు, హాస్టల్ విద్యార్థులు, అద్దె ఇళ్లల్లో ఉండేవారికి బట్టలు ఉతకడం ఎప్పుడూ సవాలే. వాషింగ్ మిషన్ కొనాలని భావించినా ఇంటిలోని పరిమిత స్థలం, బడ్జెట్ వారిని వెనక్కి లాగుతుంటుంది. అటువంటి వారికి రూ.6,000 లోపు లభించే మినీ వాషింగ్ మిషన్లు గొప్ప ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. తేలికపాటి దుస్తులు, లోదుస్తులు, సాక్స్, టీషర్టులను ఉతకడానికి ఇవి బాగా ఉపయోగపడనున్నాయి. రూ.6 వేల లోపున్న బెస్ట్ మినీ వాషింగ్ మిషన్లు, వాటి ఫీచర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఈ మిని వాషింగ్ మిషన్ 3 కేజీల సామర్థ్యాన్ని కలిగి ఉంది. 1.5 కేజీల డ్రైయర్ బాస్కెట్ దీనికి అందించారు. ఇది ప్లాస్టిక్ బాడీతో రూపొందినప్పటికీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. రోజూ 6 నుండి 7 జతల తేలికపాటి బట్టలు ఉతకడానికి అనువుగా ఉంటుందని పేర్కొంటున్నారు. జీన్స్, బెడ్ షీట్లు కాకుండా తేలికపాటి షర్టులు, టీ షర్టులు ఉతకడానికి ఇది బెస్ట్ ఆప్షన్.
ఇది సిలికాన్ మెటీరియల్‌తో వస్తుంది. 16 లీటర్ల కెపాసిటీతో ఉన్న ఈ మిషన్ ను వాడిన తర్వాత మడతపెట్టి పక్కన పెట్టే వెసులు బాటు కూడా ఉంది. దీనిలోని స్పిన్ బాస్కెట్ బట్టలను వాషింగ్ చేయడంతో పాటు సమర్ధవంతంగా పిండుతుందని కంపెనీ చెబుతోంది. హాస్టల్స్ లో ఉండేవారు, నిత్యం జర్నీలు చేస్తుండేవారికి ఈ ఫోల్డబుల్ వాషింగ్ మిషన్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది.
Also Read: జనవరి 1 నుంచి కొత్త చెక్ బుక్ రూల్స్.. రూ.50 వేలు దాటితే పాత చెక్కులు చెల్లవా? ఆర్‌బీఐ ఏమందంటే!
ఈ వాషింగ్ మిషన్.. 2 కేజీల సామర్థ్యం, 3 క్లీనింగ్ మోడ్స్ తో రూపొందింది. ఇది కూడా ఫోల్డబుల్ డిజైన్ కావడం వల్ల చాలా తక్కువ స్థలంలోనే దీన్ని అడ్జస్ట్ చేయవచ్చు. తేలికపాటి దుస్తులు, సాక్స్, లోదుస్తులను ఉతుక్కోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుందని కంపెనీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
Also Read: దేశంలో వింత స్టేషన్.. రైలు ఎక్కాలంటే టికెట్ ఒక్కటే సరిపోదు.. వీసా, పాస్‌పోర్ట్ కూడా ఉండాల్సిందే!