Diwali smartphone shopping guide: దీపావళి పండగ వచ్చిందంటే చాలు, కొత్త వస్తువులు ముఖ్యంగా స్మార్ట్ ఫోన్‌లు కొనడానికి అందరూ ఆసక్తి చూపుతారు. ఆన్ లైన్ ఈ-కామర్స్ దిగ్గజాలు అందించే భారీ డిస్కౌంట్లు ఈ సమయాన్ని.. మరింత ప్రత్యేకంగా మారుస్తాయి. మీ బడ్జెట్‌కు తగినట్టుగా, బెస్ట్ ఫీచర్లు కలిగిన ఫోన్‌ను ఎంచుకోవడం కాస్త కష్టమైన పనే. అందుకే.. రూ. 10,000 నుంచి రూ. 25,000 ధరల మధ్య లభించే బెస్ట్ 12 స్మార్ట్ ఫోన్‌ల లిస్ట్ మీకోసం అందిస్తున్నాం. దీపావళి షాపింగ్ చేయడానికి ముందే ఈ లిస్ట్ ఒకసారి చూసేయండి.
తక్కువ ధరలో.. అద్భుతమైన ఫీచర్లు కోరుకునే.. వారి కోసం ఈ విభాగంలో నాలుగు ఫోన్‌లు ఉన్నాయి.
రెడ్‌మి నోట్ సిరీస్ : అద్భుతమైన కెమెరా, పెద్ద బ్యాటరీతో లభించే ఈ ఫోన్ ప్రారంభ ధర సుమారు రూ.11,999 నుంచి ఉంది.
పోకో M సిరీస్ (POCO M Series): గేమింగ్, స్టైలిష్ లుక్ కోరుకునే.. యూజర్లకు ఇది బెస్ట్ ఆప్షన్. దీని ధర సుమారు రూ.12,499 వద్ద లభిస్తుంది.
రియల్‌మి నార్జో సిరీస్ (Realme Narzo): స్మూత్ పెర్ఫార్మెన్స్ , ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వచ్చే.. ఈ ఫోన్ ధర సుమారు రూ.13,999గా ఉంది.
సామ్‌సంగ్ గెలాక్సీ M సిరీస్ (Samsung Galaxy M Series): బ్రాండ్ వాల్యూ, నమ్మకమైన డిస్‌ప్లే కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. దీని ధర సుమారు రూ.14,499 నుంచి మొదలవుతుంది.
కెమెరా క్వాలిటీ, ప్రాసెసర్ వేగం కొద్దిగా ఎక్కువగా ఉండాలనుకునే.. వారికి ఈ మిడ్‌రేంజ్ ఫోన్‌లు సరిగ్గా సరిపోతాయి.
5. మోటోరోలా గీక్ / ఎడ్జ్ సిరీస్ (Motorola): క్లీన్ ఆండ్రాయిడ్ ఫీల్, ప్రీమియం డిజైన్ కోసం దీన్ని ఎంచుకోవచ్చు. ధర సుమారు రూ.16,999.
6. ఐక్యూ Z సిరీస్ (iQOO Z Series): పవర్ ఫుల్ గేమింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే ఈ ఫోన్ ధర సుమారు రూ. 17,999 వద్ద అందుబాటులో ఉంది.
7. వన్‌ప్లస్ నార్డ్ CE సిరీస్ (OnePlus Nord CE): బ్రాండ్ , స్మూత్ యూజర్ ఇంటర్‌ఫేస్ కోరుకునే.. వారి ఫేవరెట్ ఛాయిస్. దీని ధర సుమారు రూ.19,999.
8. వివో T సిరీస్ (Vivo T Series): అద్భుతమైన పోర్ట్రెయిట్ కెమెరాలతో.. ఆకట్టుకునే ఈ ఫోన్ ధర సుమారు రూ.18,999.
ఫ్లాగ్‌షిప్ లెవెల్ ఫీచర్లను కాస్త తక్కువ బడ్జెట్‌లో అందించే టాప్ 4 ఫోన్‌లు ఇవి..
9. నథింగ్ ఫోన్ (Nothing Phone): గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ , యూనిక్ డిజైన్‌తో ట్రెండ్ సృష్టిస్తున్న ఈ ఫోన్ ధర సుమారు రూ.21,999 నుంచి ఉంది.
10. రియల్‌మి జిటి / ప్రో సిరీస్ (Realme Pro Series): కర్వ్డ్ డిస్‌ప్లే , అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్‌తో లభించే.. ఈ ఫోన్ ధర సుమారు రూ.22,999.
11. రెడ్‌మి నోట్ ప్రో ప్లస్ (Redmi Note Pro+): హై-ఎండ్ కెమెరా, వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్లతో వచ్చే ఈ ఫోన్ ధర సుమారు రూ.23,999.
12. సామ్‌సంగ్ గెలాక్సీ A సిరీస్ (Samsung Galaxy A Series): లాంగ్ లాస్టింగ్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు , బెస్ట్ డిస్‌ప్లే కలిగిన ఈ ఫోన్ ధర సుమారు రూ.24,999కే లభిస్తుంది.
ఈ దీపావళి పండగకు మీ బడ్జెట్‌కు తగినట్లుగా ఈ 12 ఫోన్లలో మీకు నచ్చిన దాన్ని ఎంచుకోండి. బ్యాంక్ ఆఫర్లు , ఎక్స్ఛేంజ్ ఆఫర్లను ఉపయోగించుకుంటే.. వీటిపై మరిన్ని డిస్కౌంట్లు లభించే అవకాశం ఉంది.