E-Paper
Advertisement

ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం బిగ్ అలర్ట్.. వెంటనే ఈ పని చేయకపోతే డేంజర్!

ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం బిగ్ అలర్ట్.. వెంటనే ఈ పని చేయకపోతే డేంజర్!
Advertisement

Android Security: భారత్‌లోని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు తమ ఫోన్ల భద్రత పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) హెచ్చరించింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో పలు తీవ్రమైన సెక్యూరిటీ లోపాలు (Vulnerabilities) ఉన్నట్లు గుర్తించిన కేంద్ర ప్రభుత్వ సాంకేతిక విభాగాలు.. ఈ మేరకు వినియోగదారులకు కీలక సూచనలు జారీ చేశాయి.

ఇంతకీ ఏంటా భద్రతా లోపాలు?

CERT-In ఇటీవల ‘CIVN-2026-0536’ పేరుతో ఒక భద్రతా నోట్‌ను విడుదల చేసింది. ఆండ్రాయిడ్ ఫ్రేమ్‌వర్క్, ఇతర సిస్టమ్ భాగాలలో గుర్తించిన ఈ లోపాలను సైబర్ నేరగాళ్లు ఆసరాగా చేసుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది. కొన్ని సందర్భాల్లో వినియోగదారులు ఎలాంటి అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయకపోయినా, అపరిచిత యాప్‌లను ఇన్‌స్టాల్ చేయకపోయినా.. హ్యాకర్లు సులువుగా ఫోన్‌లోకి చొరబడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

ఈ లోపాల వల్ల ఎదురయ్యే ముప్పులు

Advertisement

కేంద్ర సాంకేతిక విభాగం హెచ్చరికల ప్రకారం.. ఆండ్రాయిడ్ లోని ఈ లోపాల కారణంగా వ్యక్తిగత సమాచారం, రహస్య డేటా చోరీకి గురయ్యే ప్రమాదం ఉంది. ఫోన్ లోని కీలక ఫీచర్లు హ్యాకర్ల ఆధీనంలోకి వెళ్లొచ్చు. డివైజ్ ఒక్కసారిగా క్రష్ కావడం లేదా ఫోన్ పనితీరు నిలిచిపోవడం వంటి సమస్యలు ఆండ్రాయిడ్ యూజర్లు ఫేస్ చేసే ఛాన్స్ ఉంది.

ఆ ఆండ్రాయిడ్ వెర్షన్లలో ఎక్కువ లోపాలు!

ఆండ్రాయిడ్ 14, 15, 16, 16 QPR2, ఆండ్రాయిడ్ 17 వెర్షన్లపై పనిచేసే ఫోన్లపై ఈ భద్రతా లోపాల ప్రభావం ఎక్కువగా ఉందని తేలింది. అయితే ఈ సమస్య తీవ్రతను గుర్తించిన గూగుల్, సెక్యూరిటీ ప్యాచ్‌లను విడుదల చేసింది. అయితే శాంసంగ్, షావోమి (Xiaomi), వన్‌ప్లస్ వంటి మొబైల్ తయారీ సంస్థలు తమ స్వంత అప్‌డేట్ షెడ్యూల్‌ల ప్రకారం ఈ ప్యాచ్‌లను అందించనున్నాయి. కాబట్టి ఫోన్‌లో లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్ ఉన్నప్పటికీ.. అప్‌డేట్ చేసిన సెక్యూరిటీ ప్యాచ్ డేట్‌ను సరిచూసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.

ఫోన్ లో అప్‌డేట్ ఎలా చెక్ చేయాలి?

Advertisement

ప్రస్తుతానికి మీ ఫోన్ లో ఎలాంటి సమస్య లేనప్పటికీ లేటెస్ట్ అప్డేట్ లో మెుబైల్ ఉందో లేదో చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం ముందుగా ఫోన్ లోని సెట్టింగ్స్ ఓపెన్ చేసి.. సిస్టమ్ లేదా సాఫ్ట్ వేర్ అప్డేట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అక్కడ ‘చెక్ ఫర్ అప్డేట్స్’ పై టాప్ చేస్తే.. అప్డేట్ పరిస్థితి ఏంటో తెలుస్తుంది. ఒక వేళ కొత్త అప్‌డేట్ కనిపిస్తే వెంటనే డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి. అప్‌డేట్ పూర్తయ్యాక ఫోన్‌ను రీస్టార్ట్ చేయండి.

Also Read: దీపావళి ముందు తీవ్ర విషాదం.. రోడ్డుపై లేడీ డ్రైవర్ బీభత్సం.. బైకర్‌ను 30 మీటర్లు ఈడ్చుకెళ్లిన థార్!

అప్‌డేట్ రాకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

ఒకవేళ ఫోన్‌కు ఇంకా అప్‌డేట్ రాకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. కంపెనీలు విడతల వారీగా అప్‌డేట్లను విడుదల చేస్తాయి కాబట్టి అప్పటివరకూ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని పేర్కొంటున్నారు. ఇందులో భాగంగా అనుమానస్పద మెసేజ్ లు, ఈమెయిళ్లలో వచ్చే లింక్స్ ను క్లిక్ చేయవద్దని హితవు పలుకుతున్నారు. అలాగే తెలియని యాప్స్ ఇన్ స్టాల్ చేయడం మానుకోవాలన్నారు. అధికారిక అప్‌డేట్ అందుబాటులోకి రాగానే ఆలస్యం చేయకుండా ఇన్‌స్టాల్ చేసుకుంటే సరిపోతుందని సూచించారు.

Also Read: ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారు సరే.. పవర్ బిల్లు గురించి ఆలోచించారా? ఈ లెక్కలు చూడు మామ!

Tags

Related News

రూ.2వేల బడ్జెట్‌లో సూపర్ ఇయర్‌బడ్స్..ప్రియమైన వారికి పర్ఫెక్ట్ దీపావళి గిఫ్ట్

స్వీట్లకు బదులుగా.. దీపావళికి ఈ 5 గాడ్జెట్లను బహుమతిగా ఇవ్వండి!

దీపావళికి కొత్త ఫోన్ కొనాలా?పాత ఫోన్ ఇచ్చి కొత్త ఫోన్ పట్టుకెళ్లండి!

యూట్యూబ్ కొత్త లుక్ వచ్చేసిందోచ్..ఈ సారి షార్ట్స్, క్రియేషన్‌కు పెద్ద పీట

ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారు సరే.. పవర్ బిల్లు గురించి ఆలోచించారా? ఈ లెక్కలు చూడు మామ!

టాప్-నాచ్ డిస్‌ప్లే,అల్ట్రా పెర్ఫార్మెన్స్..అసస్ ప్రోఆర్ట్ P16 రివ్యూ ఇదిగో

సామాన్యులకు పండగే.. రూ.6000 లోపే వాషింగ్ మిషన్లు.. ఇక చేత్తో ఉతికే పనేలేదు!

Big Stories

Advertisement
×