BigTV English

I phone 16 & 16 Pro Max: ఐఫోన్ 16 ప్రో, ప్రో మ్యాక్స్ ధరలు.. తగ్గుతున్నాయా?

I phone 16 & 16 Pro Max: ఐఫోన్ 16 ప్రో, ప్రో మ్యాక్స్ ధరలు.. తగ్గుతున్నాయా?

I phone 16 & 16 Pro Max Price: కొత్త ఐఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయంటే, రకరకాల ప్రచారాలు మార్కెట్లో వైరల్ అవుతుంటాయి. ఫీచర్లు బ్రహ్మాండమని, ధరలు తగ్గుతున్నాయని రకరకాల వార్తలు షికార్లు చేస్తుంటాయి. అయితే ఈసారి కొత్తగా మార్కెట్ లోకి రాబోతున్న ఐఫోన్ 16 ప్రో, ప్రో మ్యాక్స్ ధరలు తగ్గనున్నట్టు లీక్ లు వస్తున్నాయి. దీంతో అందరి అటెన్షన్ ఈ ఫోన్ల మీదకి మళ్లింది. మరి వాటి సంగతేమిటో ఒకసారి చూసేద్దాం పదండి.


ఐఫోన్ 16 ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్లను భారతదేశంలో ఉత్పత్తి చేసేందుకు ఆపిల్ సంస్థ సిద్ధంగా ఉంది. అలా జరిగితే ఈ హై-ఎండ్ పరికరాలను చైనా వెలుపల ఉత్పత్తి చేయడం ఇదే మొదటిసారి అవుతుంది. అప్పుడు దిగుమతి సుంకాలు ఆదా అవుతాయి. ఆ కారణంగా ఐ ఫోన్లలో 10 శాతం వరకు ధరలు తగ్గే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. కొందరేమంటున్నారంటే, ఇతర దేశాలతో పోల్చితే, భారతదేశంలో కొన్ని ఖర్చులు అధికంగా ఉంటాయి. అందువల్ల ధరలు తగ్గే అవకాశాలు లేవని చెబుతున్నారు.

గత ఏడాది భారతదేశంలో ఐఫోన్ 15, తయారీ తర్వాత, ఆపిల్ సంస్థ ఐఫోన్ 16 ప్రో ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మోడళ్లు కూడా ఇక్కడే తయారుచేయాలని యోచిస్తోంది. అమెరికా, ఆసియా పవర్ హౌస్ మధ్య కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆపిల్ భారత్ వైపు మొగ్గుచూపుతోందని అంటున్నారు.


ఈ డివైస్ లను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన వెంటనే ఫాక్స్ కాన్ అసెంబ్లింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. పెగాట్రాన్ ,ఇంకా స్థానిక యూనిట్, టాటా గ్రూప్ తో సహా భారతదేశంలోని ఇతర ఆపిల్ భాగస్వాములు కూడా అసెంబ్లింగ్ ప్రక్రియకు దోహదం చేస్తారని అంటున్నారు.

భారతదేశంలో తయారుచేయడం వల్ల ధరలు తగ్గింపు సాధ్యమేనని అంటున్నారు. ఇక్కడే తయారైతే, జీఎస్టీ తప్ప అదనపు సుంకాలు ఉండవని కొందరంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోన్లపై దిగుమతి సుంకాలు ఉన్నాయి. ఇవన్నీ తగ్గిపోతాయని అంటున్నారు. అయితే ఎంత చెప్పుకున్నా.. ఎంత తగ్గించినా ఇతర దేశాల కరెన్సీ, అమెరికా డాలర్లతో పోల్చుకుంటే, మన దేశంలో ధరలు ఎక్కువేనని అసలు విషయం చల్లగా చెబుతున్నారు.

Also Read: వన్ ప్లస్ బడ్స్ ప్రో 3.. ఫీచర్లు అదరహో

ఐఫోన్ ఉత్పత్తిలో భారతదేశ వాటాను వచ్చే సంవత్సరం నాటికి 14% నుండి 25% కు పెంచాలని ఆపిల్ సంస్థ భావిస్తోంది. అలా మార్కెట్ ని పట్టుకోగలిగితే, ప్రొడక్షన్ పెరుగుతుంది. ఆటోమేటిక్ గా ఖర్చులు కలిసివస్తాయని అంటున్నారు.

అందరూ అంటున్నట్టు సెప్టెంబర్ 10న ఆపిల్ పార్క్ లో కొత్త ఐఫోన్ సిరీస్ ను ఆవిష్కరించనున్నట్లు టిప్ స్టర్ మాజిన్ బు తెలిపారు. ఈవెంట్ పోస్టర్ లో “రెడీ” అనే పదం రాయడంతో
అందరి అనుమానాలు తీరిపోయాయని టెక్ నిపుణులు చెబుతున్నారు. కొత్త ఐఫోన్ లో ఐఓఎస్ 18.1 అప్ డేట్ వరకు కొన్ని ఏఐ ఫీచర్లు అందుబాటులో ఉండకపోవచ్చని బ్లూమ్ బర్గ్ కు చెందిన మార్క్ గుర్మన్ తెలిపారు.

ప్రో మోడళ్లు నిగనిగలాడే టైటానియం ఫినిషింగ్ ను కలిగి ఉంటాయని, మునుపటి మోడళ్లతో పోలిస్తే మెరుగైన స్క్రాచ్ రెసిస్టెన్స్ , మరింత ప్రీమియం లుక్ ను అందిస్తాయని ప్రచారం జరుగుతోంది. ఐఫోన్ 16 ప్రో కోసం 6.3 అంగుళాలు, ప్రో మ్యాక్స్ కోసం 6.9 అంగుళాల పెద్ద డిస్ ప్లేలను కలిగి ఉంటాయని చెబుతున్నారు.

విస్తృతమైన వీక్షణ అనుభవాన్ని అందించడానికి ఆధునాతనమైన ఏఐ టెక్నాలజీని తీసుకొస్తున్నారు. మొత్తానికి మార్కెట్లోకి ఆపిల్ ఫోన్లు రాకముందే, రకరకాల వార్తలు నెట్టంట హల్చల్ చేస్తున్నాయి. ఇక వచ్చాక ఎంత హడావుడి జరుగుతుందోనని టెకీలు కామెంట్ చేస్తున్నారు.

Related News

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్.. iQOO Z10 టర్బో+ 5G లాంచ్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Big Stories

×