Bluetooth Earbuds: ప్రస్తుత రోజుల్లో బ్లూటూత్ లేకుండా జీవితాన్ని ఊహించడం చాలా కష్టమని చెప్పవచ్చు. వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లను.. స్మార్ట్‌వాచ్‌లు, ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కార్లు ఇలా అనేక డివైస్ లకు ఉపయోగించుకోవచ్చు. కానీ, మనం ఇయర్‌బడ్‌లు లింక్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అవి కనెక్ట్ కాకపోతే ఎంత ఫ్రస్ట్రేషన్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బ్లూటూత్ టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందినా, కొన్ని చిన్నపాటి తేడాల వల్ల లింక్ చేయడంలో ఇబ్బందులు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ చిట్కాలు పాటిస్తే, మీ ఇయర్‌బడ్‌లు లేదా బ్లూటూత్ పరికరాలు వెంటనే లింక్ అవుతాయి.
ముందు బ్లూటూత్ ఆన్‌లో ఉందో లేదో చెక్ చేయండి
పిల్లలైనా, పెద్దవారైనా.. చాలా సార్లు మనం బ్లూటూత్ లింక్ కావట్లేదని చెప్పుకుంటూ, అసలు బ్లూటూత్ ఆన్ చేశామా? అన్నది మర్చిపోతుంటాం. Android: నోటిఫికేషన్ ప్యానెల్‌లో బ్లూటూత్ ఐకాన్ కనిపిస్తే అది ఆన్‌లో ఉందని అర్థం. iPhone: Settings > Bluetooth లోకి వెళ్లి టాగిల్ చెక్ చేయండి.
లింక్ చేసే మోడ్‌లో ఉందా
ఇయర్‌బడ్‌లు, స్పీకర్లు మొదలైన పరికరాలు జత చేయాలంటే “Pairing Mode”లో ఉండాలి. సాధారణంగా, పవర్ బటన్‌ను కొద్దిసేపు నొక్కి ఉంచితే లైట్ మెరుస్తుంది. ఇది లింక్ చేసే మోడ్‌కు సంకేతం. ప్రతి బ్రాండ్‌కు లింక్ చేసే విధానం వేరుగా ఉంటుంది. Googleలో “Your Device Name + Pairing Mode” అని వెతికితే సరిపోతుంది!
దూరం
బ్లూటూత్ పరికరాలు సాధారణంగా 10 మీటర్ల పరిధిలో పనిచేస్తాయి. కానీ జత చేసే సమయంలో వీటిని 5 అడుగుల దూరంలో ఉంచితే ఈజీగా కనెక్షన్ వస్తుంది.
Read Also: Meta Breakup: మెటాకు షాక్.. ఈ తీర్పుతో వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ …
బ్లూటూత్ రీసెట్
కొన్ని సార్లు చిన్నగా ఓ “రీసెట్” చేస్తే చాలు. ఫోన్‌లో బ్లూటూత్‌ను ఆఫ్ చేసి, కొన్ని సెకన్ల తర్వాత మళ్లీ ఆన్ చేయండి. లేదా Airplane Mode ON చేసి తర్వాత OFF చేసి చూడండి. అవసరమైతే, మీ ఫోన్‌ను రీస్టార్ట్ చేయడం కూడా బాగుంటుంది.
బ్యాటరీ స్థితి
తక్కువ ఛార్జ్ ఉన్నప్పుడు బ్లూటూత్ ఆగిపోయే అవకాశం ఉంటుంది. మీ ఇయర్‌బడ్‌లు, ఫోన్‌లో కనీసం 30% పైగా బ్యాటరీ ఉందో లేదో చూసుకోండి.
పాత కనెక్షన్‌ల క్లియర్
ఒక బ్లూటూత్ పరికరం సాధారణంగా 1-3 పరికరాలకు ఒకేసారి కనెక్ట్ అవుతుంది. మీ ఇయర్‌బడ్‌లు ఇప్పటికే ఇతర పరికరాలకు కనెక్ట్ అయి ఉంటే, వాటినుంచి డిస్‌కనెక్ట్ చేయండి. అవసరమైతే పరికరాన్ని ఫ్యాక్టరీ రీసెట్ చేయండి.
వైఫై రౌటర్ నుంచి దూరం
Wi-Fi కూడా 2.4GHz ఫ్రీక్వెన్సీలోనే పనిచేస్తుంది. అదే బ్లూటూత్ ఫ్రీక్వెన్సీ కూడా. రౌటర్ దగ్గర బ్లూటూత్ జత చేయడంటే, రెండు ఫ్రీక్వెన్సీలు తగలడమే అవుతుంది. దీంతో లింక్ చేయడం విఫలమవుతుంది.
బ్లూటూత్ ప్రొఫైల్ మ్యాచింగ్
ప్రతి బ్లూటూత్ పరికరం ఒక ప్రత్యేక “ప్రొఫైల్”తో పనిచేస్తుంది. ఉదాహరణకి: హెడ్‌ఫోన్‌లు A2DP ప్రొఫైల్ ఉపయోగిస్తాయి (ఆడియో స్ట్రీమింగ్ కోసం). కార్లు, మౌస్‌లు వంటి వాటికి HID, HFP వంటి వేర్వేరు ప్రొఫైల్స్ ఉంటాయి. మీరు జత చేయాలనుకునే పరికరం మీ ఫోన్‌కి అవసరమైన ప్రొఫైల్‌ని సపోర్ట్ చేస్తుందా లేదో చూసుకోండి.
ఇతర స్మార్ట్ పరికరాలు
స్మార్ట్ హోమ్ పరికరాలు – Alexa, Google Home, Zigbee బ్రిడ్జిలు ఇవన్నీ కూడా అదే 2.4GHz బాండ్‌ను ఉపయోగిస్తాయి. బ్లూటూత్ జత చేసేటప్పుడు వీటి నుంచి కొన్ని అడుగుల దూరం ఉండటమే ఉత్తమం.