Rashmika Mandanna: పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి రష్మిక మందన. ఈమె పట్టిందల్లా బంగారమే అన్నట్లు.. ఏ సినిమా అయినా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్టార్ గా కోట్లు కొల్లగొడుతున్న సినిమాలలో మెయిన్ క్యారెక్టర్ గా నటించడం రష్మిక కి అదృష్టం గానే చెప్పొచ్చు. టాలీవుడ్ లోనే కాక బాలీవుడ్ లోను బాక్స్ ఆఫీస్ క్వీన్ గా టాప్ ప్లేస్ లోకి వెళ్లి పోయారు రష్మిక. బాలీవుడ్ లో ఒకప్పుడు దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా, ఆలియా భట్ లాంటి పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ ని సైతం వెనక్కి నెట్టి టాప్ ప్లేస్ లోకి వెళ్లిపోయారు రష్మిక. తెలుగు, హిందీలోనే కాక ప్రపంచవ్యాప్తంగా నేషనల్ క్రష్ గా మారిపోయిన రష్మిక ఏ పోస్ట్ చేసిన అది నిమిషాల్లో వైరల్ అవుతుంది. తాజాగా సోషల్ మీడియాలో ఈమె చేసిన వీడియో ఒకటి హల్ చల్ చేస్తోంది.
లవ్ యు అంటూ..
పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక, విక్కీతో కలిసి నటించిన చావా సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా వసూలు రాబట్టింది. ఈ సినిమాలో ఈమె చత్రపతి సంభాజీ మహారాజ్ భార్యగా నటించింది. ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉన్న, రష్మిక ఈరోజు ఉదయం గుడ్ మార్నింగ్ అంటూ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో రాత్రంతా షూటింగ్ వల్ల చాలా టైడ్ అయిపోయాను. రాత్రంతా నిద్ర లేదు. కళ్ళు ఎర్రగా అయ్యాయి.. షూటింగ్ వల్ల బాగా అలసిపోయాను. అయినా ఉదయాన్నే మీ ముందుకి పాజిటివ్ రెస్పాండ్ తో వస్తున్నాను అని ముద్దులతో లవ్ యు అంటూ, మీరు కూడా ఇలానే సంతోషంగా రోజుని మొదలు పెట్టాలని కోరుకుంటున్నాని.. ఏం జరిగినా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయమని రష్మిక వీడియోలో తెలిపారు. ఈ వీడియో చూసిన వారంతా రష్మిక కి వెరీ గుడ్ మార్నింగ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
కెరియర్ పరంగా ..
ఇక సినిమాల విషయానికి వస్తే.. తాజాగా పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు. తర్వాత రిలీజ్ అయిన చావా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ తో సికిందర్ సినిమా విడుదలై మంచి వసూళ్లను సాధించింది. ప్రస్తుతం ఈమె హర్రర్ కామెడీ చిత్రమైన తమ లో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఈ వేసవికి పూర్తి చేయనున్నారు. ఈ సినిమాను దీపావళి కానుకగా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక ఒక డిఫరెంట్ రోల్లో కనిపిస్తుందని సమాచారం. ఆ తరువాత ధనుష్, నాగార్జున తో కలిసి నటిస్తున్న కుబేర సినిమాలో కీలకపాత్రలో రష్మిక పోషించనున్నారు.
Sukumar : సుకుమార్‌ను చూసి సిగ్గుపడ్డ ఐటెం గర్ల్… ఆ ఒక్క ఛాన్స్ ఇస్తాడా అని…