Tollywood:మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి (Megastar Mammootty) గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. ఏ పాత్రలో అయినా సరే ఇట్టే లీనమైపోయి నటించే కెపాసిటీ ఆయనది. అందుకే మలయాళంలో మెగాస్టార్ గా ఎదిగి, ఈ మధ్య భాషతో సంబంధం లేకుండా ప్రతి భాషలో కూడా సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. ఇటు తెలుగు చిత్ర పరిశ్రమలో ఈయనకు పెద్ద సంఖ్యలోనే అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా తన విలక్షణమైన నటనతో అందరినీ మెప్పించగల గొప్ప నటుడు మమ్ముట్టి. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా పరభాష హీరోల చిత్రాలలో కీలక పాత్ర పోషిస్తూ అలరిస్తున్న విషయం తెలిసిందే.
జల్సా సినిమాలో విలన్ పాత్రకు మమ్ముట్టిని సంప్రదించిన అల్లు అరవింద్..
ఇకపోతే ఈ మధ్యకాలంలో తెలుగు , హిందీ భాషల్లో కూడా విలన్ గా సినిమాలు చేయడానికి ఇతర భాష నటులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravaindh) ‘జల్సా’ సినిమాలో విలన్ క్యారెక్టర్ కోసం మలయాళ మెగాస్టార్ మమ్ముట్టిని సంప్రదించారట. అప్పుడు మమ్ముట్టి ఇచ్చిన రిప్లై విని అల్లు అరవింద్ వెంటనే ఫోన్ పెట్టేశారట. ఈ విషయాన్ని స్వయంగా అల్లు అరవింద్ ఒక ప్రెస్ మీట్ లో గుర్తు చేసుకోవడం జరిగింది. ఇక ఆ ప్రెస్ మీట్ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ..” నేను 10 సంవత్సరాల క్రితం ఒకసారి మమ్ముట్టికి కాల్ చేశాను. మా చిత్రంలో ఒక మంచి పాత్ర ఉంది .మీరు చేయాలి అంటే.. ఆయన ఏం క్యారెక్టర్ అని అడిగారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్నారు. అందులో ఒక మంచి విలన్ పాత్ర ఉంది మీరు చేస్తారా? అని అంటే ఆయన రిప్లై ఇచ్చిన విధానం విని నేనే ఆశ్చర్యపోయాను.
మమ్ముట్టి సమాధానం విని సారీ చెప్పిన అల్లు అరవింద్..
దానికి మమ్ముట్టి అవునా.. అయితే ఆ పాత్రని చిరంజీవి వేయమని చూస్తాను.. ఈ విషయాన్ని నువ్వు అడగగలవా..? అని నన్ను తిరిగి ప్రశ్నించారు. ఇక దానికి సారీ చెప్పి నేను ఫోన్ పెట్టేసాను. అలా జల్సా సినిమా విషయంలో జరిగిన ఈ విషయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను” అంటూ అల్లు అరవింద్ గుర్తు చేసుకున్నారు. ఏది ఏమైనా మమ్ముట్టి ఇచ్చిన రియాక్షన్ కి అల్లు అరవింద్ సైలెంట్ అయిపోయారని చెప్పవచ్చు.
Anupama : అనుపమా ముద్దులాట.. నిజమా? సినిమా స్టంటా?.. ఇదిగో క్లారిటీ..!
మమ్ముట్టి సినిమాలు..
మలయాళం లో ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేసిన ఈయన తెలుగులో కూడా పలు చిత్రాలలో నటించి ఆకట్టుకున్నారు. ముఖ్యంగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమాలో ఆయన పాత్ర పోషించి, నిజంగా రాజశేఖర్ రెడ్డి దిగవచ్చారేమో అనేంతలా అందరిని ఆకట్టుకున్నారు. ఇక తర్వాత సూర్య ది గ్రేట్, లాయర్ ది గ్రేట్, దళపతి, స్వాతి కిరణం, మామంగం, గ్యాంగ్స్ ఆఫ్ 18, వాసుకి వంటి చిత్రాలలో కూడా నటించారు. ఇక ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా ప్రతి భాషా సినిమాలో కూడా నటిస్తున్నారు.