E-Paper
Advertisement

ఐఫోన్ 18 డ్యూయోనా? యూరప్ ట్రిప్పా? రూ.4.5 లక్షలతో ఈ దేశాలు హ్యాపీగా చుట్టేయొచ్చు!

ఐఫోన్ 18 డ్యూయోనా? యూరప్ ట్రిప్పా? రూ.4.5 లక్షలతో ఈ దేశాలు హ్యాపీగా చుట్టేయొచ్చు!
Advertisement

iPhone 18 Duo or Europe Trip: ఆపిల్ తొలిసారిగా ఫోల్డబుల్ ఐఫోన్‌ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. కొత్తగా వచ్చిన ఈ మోడల్‌కు ‘ఐఫోన్ డ్యూయో’గా పేరు పెట్టింది. అత్యాధునిక డిజైన్, మడతపెట్టే డిస్‌ ప్లే లాంటి ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్‌పై టెక్ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. అయితే, దేశంలో దీని ధర మాత్రం చాలామందికి షాక్ ఇచ్చేలా ఉంది. దేశంలో ఐఫోన్ డ్యూయో 256GB వేరియంట్ ధర రూ.2,99,900 నుంచి మొదలవుతుంది. టాప్ ఎండ్ 2TB మోడల్ కోసం రూ.4,49,900 వరకు చెల్లించాలి. అంటే దాదాపు రూ.4.5 లక్షలు. ఇంత మొత్తం ఒక ఫోన్‌పై ఖర్చు చేయడానికి బదులుగా అదే బడ్జెట్‌తో కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లొచ్చనే ఆలోచన కూడా వస్తుంది. అయితే రూ.4.5 లక్షలతో ఏ దేశాలకు వెళ్లొచ్చు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

దుబాయ్ ట్రిప్.. లగ్జరీగా వెళ్లొచ్చు!

రూ.4.5 లక్షల బడ్జెట్‌లో దుబాయ్ పర్యటనను సౌకర్యవంతంగా ప్లాన్ చేసుకోవచ్చు. హైదరాబాద్, ఇతర ప్రధాన నగరాల నుంచి రిటర్న్ విమాన టికెట్లకు సాధారణంగా రూ.20 వేల నుంచి రూ.35 వేల వరకు ఖర్చు కావచ్చు. మూడు నుంచి నాలుగు రోజుల ట్రిప్‌లో హోటల్, ఫుడ్, లోకల్ జర్నీ, బుర్జ్ ఖలీఫా లాంటి ప్రముఖ ప్రదేశాల సందర్శనకు కలిపి ఒక్కొక్కరికి సుమారు రూ.60 వేల నుంచి రూ.1.2 లక్షల వరకు బడ్జెట్ అవసరం కావచ్చు. కుటుంబంతో వెళ్తే ఖర్చు పెరుగుతుంది. అయినప్పటికీ రూ.4.5 లక్షల్లో ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది కోసం మంచి ప్యాకేజీని ప్లాన్ చేసే అవకాశం ఉంటుంది.

థాయ్‌లాండ్.. బడ్జెట్‌లో బెస్ట్ ఆప్షన్!

Advertisement

బీచ్‌లు, నైట్ మార్కెట్లు, ద్వీపాలు, రిసార్టులతో థాయ్‌లాండ్ భారతీయ పర్యాటకులకు ఎప్పటి నుంచో ఫేవరెట్. బ్యాంకాక్, ఫుకెట్, పట్టాయా లాంటి ప్రాంతాలను కలిపి ఐదు నుంచి ఆరు రోజుల ట్రిప్ ప్లాన్ చేయవచ్చు. విమాన టికెట్లు, హోటల్, ఫుడ్, లోకల్ ట్రావెల్, కొన్ని టూర్ యాక్టివిటీలను కలిపినా ఒక్కొక్కరికి సుమారు రూ.60 వేల నుంచి రూ.1.2 లక్షల బడ్జెట్‌లో ట్రిప్ పూర్తయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఐఫోన్ డ్యూయో ధరలో కుటుంబంతో కలిసి థాయ్‌లాండ్ వెళ్లొచ్చు.

మలేసియా.. తక్కువ ఖర్చుతో మంచి ఎక్స్ పీరియెన్స్!

కౌలాలంపూర్, లంకావీ లాంటి ప్రదేశాలను చూడాలనుకునేవారికి మలేసియా మరో మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.  ఐదు రోజుల పర్యటనకు విమాన ప్రయాణం, హోటల్, ఫుడ్, లోకల్ ట్రావెల్, సందర్శనా స్థలాల టికెట్లను కలిపి ఒక్కొక్కరికి దాదాపు రూ.50 వేల నుంచి రూ.90 వేల వరకు ఖర్చు కావచ్చు. షాపింగ్ కోసం కొంత మొత్తాన్ని కేటాయించినా రూ.4.5 లక్షల బడ్జెట్‌లో పర్యటనను ప్లాన్ చేయొచ్చు.

శ్రీలంక.. దగ్గర్లోనే అద్భుతమౌన విదేశీ అనుభూతి!

Advertisement

భారత్‌కు దగ్గరగా ఉండటంతో శ్రీలంక ప్రయాణ ఖర్చు కూడా తక్కువగానే ఉంటుంది. కొలంబో, క్యాండీ, గాలే లాంటి ప్రాంతాలను కలిపి నాలుగు నుంచి ఐదు రోజుల ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. విమాన ప్రయాణం, హోటల్, ఫుడ్, లోకల్ ట్రావెల్ లాంటి ఖర్చులను కలిపి ఒక్కొక్కరికి సుమారు రూ.40 వేల నుంచి రూ.80 వేల వరకు బడ్జెట్‌లో పర్యటన సాధ్యమవుతుంది.

యూరప్ ట్రిప్ సాధ్యమేనా?

రూ.4.5 లక్షలతో యూరప్‌లో చాలా దేశాలకు వెళ్లి రావడం కష్టం. అయితే, ఒక దేశాన్ని, రెండు నగరాలను మాత్రమే ఎంచుకుని ముందుగానే విమాన టికెట్లు, బడ్జెట్ హోటళ్లు బుక్ చేసుకుంటే చిన్న ట్రిప్ ప్లాన్ చేయవచ్చు. పారిస్, రోమ్ లాంటి నగరాల్లో నాలుగు నుంచి ఐదు రోజుల పర్యటనకు విమాన టికెట్లు, వీసా, వసతి, ఫుడ్, లోకల్ ట్రావెల్ లాంటి ఖర్చులు కలిపి ఒక్కొక్కరికి రూ.1.5 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు వెళ్లొచ్చు. మీ దగ్గర రూ.4.5 లక్షలు ఉంటే.. ఫోల్డబుల్ ఐఫోన్ కొంటారా? లేక కుటుంబంతో కలిసి విదేశీ ట్రిప్ వేస్తారా? కామెంట్ లో చెప్పేయండి.

Read Also: ఐఫోన్ 18 డ్యూయో ఫోన్‌కి రూ.4.5 లక్షలా? అదే ధరలో దొరికే 5 కొత్త కార్లు ఇవే!

Tags

Related News

ఢిల్లీలో రైళ్లకు బ్రేక్.. ఏకంగా 110 సర్వీసులపై ఎఫెక్ట్.. కారణం ఏంటంటే?

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఓలా, ఉబర్‌లోనే.. సిటీ బస్సుల లైవ్ లొకేషన్!

నీళ్లు తాగకుండానే.. జీవితాంతం బతికేసే 6 వింత జంతువులు.. ఇదేం విచిత్రం సామీ!

రైలులో చైన్ ఎప్పుడు లాగాలి? చట్టం ఏం చెబుతోంది? దుర్వినియోగం చేస్తే పరిస్థితేంటి!

ట్రైన్ కాదు.. నడిచే 5-స్టార్ హోటల్.. ఈ రష్యా రైలును చూస్తే షాక్ అవ్వాల్సిందే!

టోకెన్ ఉన్నా లేకపోయినా రూ. 10 లక్షల ఇన్సూరెన్స్.. టీటీడీ సంచలన నిర్ణయం!

మళ్లీ పట్టాలెక్కనున్న భారత్-బంగ్లాదేశ్ రైళ్లు.. 2 ఏళ్ల తర్వాత ఇరు దేశాల కీలక నిర్ణయం!

Big Stories

Advertisement
×