boAt Ultima Vogue 2: చేతికి స్టైలిష్ లుక్ ఇవ్వడంతో.. పాటు ఫిట్నెస్ కోసం మంచి స్మార్ట్ వాచ్ కొనాలని చాలా మంది కోరుకుంటారు. అయితే.. ఎక్కువ ధర పెట్టి ప్రీమియం వాచ్‌లు కొనలేక పోయే.. వారి కోసం ప్రముఖ వేరబుల్ బ్రాండ్ ‘బోట్’ అద్భుతమైన ఫీచర్లతో.. కూడిన కొత్త మోడల్‌ను పరిచయం చేసింది. అదే boAt Ultima Vogue 2. ప్రస్తుత మార్కెట్లో దీని ధర కేవలం రూ.2,599 మాత్రమే ఉండటం గమనార్హం. తక్కువ ధరలో.. ప్రీమియం ఫీల్ అందించే ఈ వాచ్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఈ స్మార్ట్‌వాచ్ ప్రధాన ఆకర్షణ దీని డిస్ప్లే. రూ. 2,599 బడ్జెట్లో అమోలెడ్ స్క్రీన్‌ను అందించడం నిజంగా.. అద్భుతమనే చెప్పాలి. దీని డిస్ప్లే చాలా బ్రైట్‌గా, రంగులు ఎంతో స్పష్టంగా కనిపిస్తాయి. ఎండలో.. బయటికి వెళ్లినప్పుడు కూడా స్క్రీన్ క్లియర్‌గా కనిపిస్తుంది. అలాగే .. దీని మెటాలిక్ ఫినిషింగ్ డిజైన్ చేతికి చాలా ఆకర్షణీయంగా, రిచ్ లుక్‌ను ఇస్తుంది. క్యాజువల్ వేర్ లేదా ట్రెండీ ఔట్ఫిట్స్పైకి ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది.
ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే వారికి ఈ వాచ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ స్థాయిలను గుర్తించే SpO2 సెన్సార్, నిద్రపోయే విధానాన్ని పర్యవేక్షించే స్లీప్ ట్రాకర్ వంటి ముఖ్యమైన హెల్త్ ఫీచర్లు ఉన్నాయి. అలాగే వివిధ రకాల స్పోర్ట్స్ మోడ్స్ కూడా అందుబాటులో ఉండటం వల్ల రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్ వంటి వర్కౌట్లను కచ్చితంగా ట్రాక్ చేసుకోవచ్చు.
Also Read: హోమ్ థియేటర్ కొనాలనుకుంటున్నారా? దీని కంటే బెస్ట్ ఉండదేమో!
ప్రస్తుత స్మార్ట్‌వాచ్‌లలో.. అత్యంత డిమాండ్ ఉన్న ఫీచర్ బ్లూటూత్ కాలింగ్. ఈ బోట్ అల్టిమా వోగ్ 2 వాచ్ ద్వారా ఫోన్ చేతిలో లేకపోయినా.. నేరుగా వాచ్ నుంచే కాల్స్ మాట్లాడొచ్చు. ఇందులో ..ఇన్‌బిల్ట్ మైక్రోఫోన్, స్పీకర్ ఉండటం వల్ల వాయిస్ క్లారిటీ చాలా బాగుంటుంది. అంతే కాకుండా సోషల్ మీడియా నోటిఫికేషన్లు, వాట్సాప్ మెసేజ్‌లు, వెదర్ అప్డేట్స్ వంటి అన్ని స్మార్ట్ నోటిఫికేషన్లను నేరుగా దీంతో పొందొచ్చు.
ఎక్కువ రోజులు బ్యాటరీ లైఫ్ ఇవ్వడం..ఈ వాచ్‌లోని మరో ప్లస్ పాయింట్. ఒక్క సారి ఛార్జ్ చేస్తే ఇది ఎక్కువ రోజుల పాటు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. దీని వల్ల పదే పదే ఛార్జ్ చేయాల్సిన టెన్షన్ ఉండదు. అలాగే.. ఇది వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్‌తో వస్తుంది. అందుకే చిన్న పాటి వర్షంలో తడిచినా లేదా చెమట పట్టినా వాచ్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
కేవలం రూ.2,599 బడ్జెట్లో ప్రీమియం అమోలెడ్ డిస్ప్లే, బ్లూటూత్ కాలింగ్, హెల్త్ ట్రాకింగ్ ,స్టైలిష్ డిజైన్ కోరుకునే వారికి ఈ మోడల్ చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. తక్కువ ధరలో.. బెస్ట్ ఫీచర్స్ ఉన్న స్మార్ట్‌వాచ్ కొనాలని చూస్తున్నట్లయితే.. నిరభ్యంతరంగా దీనిని మీ లిస్ట్‌లో చేర్చుకోవచ్చు!