E-Paper
Advertisement

ఫైబర్ నెట్ ఉన్నా సరే.. వైఫై రూటర్లలో ఇప్పటికీ DSL పోర్ట్ ఎందుకు ఇస్తున్నారో తెలుసా?

ఫైబర్ నెట్ ఉన్నా సరే.. వైఫై రూటర్లలో ఇప్పటికీ DSL పోర్ట్ ఎందుకు ఇస్తున్నారో తెలుసా?
Advertisement

Wi-Fi Router DSL Port: సాధారణంగా వై-ఫై రూటర్ వెనుక చాలా రకాల పోర్ట్‌లు కనిపిస్తాయి. వీటిలో LAN, WAN పోర్ట్‌ల గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ వాటి పక్కనే చిన్నగా ఉండే DSL పోర్ట్ చూసి ఇది ఎందుకు ఇచ్చారు, ఫైబర్ కేబుల్స్ వాడుతున్న ఈ రోజుల్లో దీని అవసరం ఏంటి అని చాలామందికి సందేహం వస్తుంటుంది. నిజానికి ఈ పోర్ట్ వెనుక ఒక ముఖ్యమైన కారణం ఉంది. దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

DSL అంటే ఏమిటి?

డీఎస్‌ఎల్ అంటే డిజిటల్ సబ్‌స్క్రైబర్ లైన్ అని అర్థం. పాత రోజుల నుండి మన ఇళ్లలో ఉండే ల్యాండ్‌లైన్ టెలిఫోన్ రాగి తీగల ద్వారా ఇంటర్నెట్ అందించే ఒక టెక్నాలజీ ఇది. ఇంటర్నెట్ కనెక్షన్ నేరుగా మన ఇంటికి రావడానికి టెలిఫోన్ లైన్‌ను రూటర్‌కు కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫోన్ వైర్‌ను ప్లగ్ చేయడానికి ప్రత్యేకంగా ఈ డీఎస్‌ఎల్ పోర్ట్‌ను ఇస్తారు.

ఇందులో వాడే కేబుల్ ఎలా ఉంటుంది?

Advertisement

సాధారణ ఇంటర్నెట్ కేబుల్స్‌తో పోలిస్తే.. డీఎస్‌ఎల్ కేబుల్ కొంచెం భిన్నంగా ఉంటుంది. దీనికి ఆర్‌జే11 అనే చిన్న పిన్ ఉంటుంది. మనం ల్యాండ్‌లైన్ ఫోన్‌కు వాడే సన్నని వైర్ ఎలా ఉంటుందో ఇది కూడా అచ్చం అలాగే ఉంటుంది. కాబట్టి.. ఈ పోర్ట్ పరిమాణం కూడా సాధారణ పోర్ట్‌ల కంటే కాస్త చిన్నదిగా కనిపిస్తుంది.

Also Read: ఎయిర్‌టెల్ యూజర్లకు జాక్‌పాట్.. ఒక్క రీఛార్జ్‌తో 84 రోజుల వ్యాలిడిటీ, ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ ఇంకా మరెన్నో బెనిఫిట్స్!

ఎథర్నెట్ పోర్ట్‌కు దీనికి తేడా ఏంటి?

Advertisement

మనం కంప్యూటర్లకు లేదా ఇతర డివైజ్‌లకు వాడే ఎథర్నెట్ కేబుల్ ఆర్‌జే45 పిన్‌తో వెడల్పుగా ఉంటుంది. కానీ డీఎస్‌ఎల్ పోర్ట్ చాలా చిన్నదిగా ఉండి కేవలం టెలిఫోన్ వైర్‌ను మాత్రమే తీసుకుంటుంది. ఎథర్నెట్ పోర్ట్‌లు డేటాను వేగంగా బదిలీ చేయడానికి ఉపయోగపడితే, డీఎస్‌ఎల్ పోర్ట్ టెలిఫోన్ లైన్ నుండి వచ్చే సిగ్నల్స్‌ను ఇంటర్నెట్‌గా మార్చడానికి మోడెమ్ లాగా పనిచేస్తుంది.

ఇప్పటికీ ఇది ఎందుకు ఇస్తున్నారు?

ప్రస్తుతం ఫైబర్ ఇంటర్నెట్ వేగంగా విస్తరిస్తున్నప్పటికీ.. చాలా గ్రామీణ ప్రాంతాల్, కొన్ని పట్టణాల్లో ఇప్పటికీ టెలిఫోన్ లైన్ ద్వారా నడిచే బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లే అందుబాటులో ఉన్నాయి. అలాంటి కనెక్షన్లు వాడే కస్టమర్లకు రూటర్ ఉపయోగపడాలనే ఉద్దేశంతో కంపెనీలు ఇప్పటికీ ఈ పోర్ట్‌ను అందిస్తున్నాయి. దీనివల్ల వేరే మోడెమ్ కొనాల్సిన అవసరం లేకుండా నేరుగా ఇంటర్నెట్ వాడుకోవచ్చు.

Also Read: ఫోల్డబుల్ ఫోన్ కంటే దీనికే క్రేజ్ ఎక్కువ.. 2027లో యాపిల్ వదలబోతున్న బ్రహ్మాస్త్రం ఇదే!

Tags

Related News

బడ్జెట్‌లో బెస్ట్ సౌండ్‌బార్..సినిమాలు,క్రికెట్ మ్యాచ్‌లకి నెక్స్ట్ లెవెల్ సౌండ్!

విడుదలకు ముందే Vivo X500 సిరీస్, Watch GT 2 ధరలు లీక్.. ఈసారి బడ్జెట్ గట్టిగానే పెట్టాలి!

ఫేస్ అన్‌లాక్ వెనుక ఇంత పెద్ద తంతంగం నడుస్తోందా? చీకట్లోనూ పనిచేసే ఆ 5 టెక్నాలజీలు ఇవే!

ప్రీపెయిడ్ ధరకే పోస్ట్‌పెయిడ్ కనెక్షన్.. రూ. 199కే BSNL అదిరిపోయే ప్లాన్.. సామాన్యులకు పండగే!

సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనే ముందు ఈ సీక్రెట్ కోడ్ డయల్ చేయండి.. దాని జాతకమంతా బయటపడుతుంది!

గీజర్ Vs వాటర్ హీటర్..ఏది వాడితే కరెంట్ బిల్లు తక్కువ వస్తుంది?

కస్టమర్లతో కనెక్ట్ అవ్వడం ఇక మరింత ఈజీ.. Vi Business నుంచి ఏఐ ఆధారిత వాట్సప్ సేవలు!

Big Stories

Advertisement
×