E-Paper
Advertisement

బిర్యానీ ప్రియులకు షాక్.. మాదాపూర్ బావర్చి, మెహఫిల్ సహా పలు రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ కొరడా!

బిర్యానీ ప్రియులకు షాక్.. మాదాపూర్ బావర్చి, మెహఫిల్ సహా పలు రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ కొరడా!
Advertisement

Food Safety Raids: హైదరాబాద్‌లో బయట ఫుడ్ తినాలంటేనే కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తాజాగా వినియోగదారుల నుంచి వస్తున్న వరుస ఫిర్యాదుల అప్రమత్తమైన టీజీ సేఫ్ అధికారులు రంగంలోకి దిగారు. 8 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నగరంలోని CURE ప్రాంతంలో ఉన్న 9 ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లపై మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో బయటపడ్డ విషయాలు చూస్తే ఎవరికైనా కడుపులో తిప్పడం ఖాయం.

వంటగదిలో అపరిశుభ్రత.. కలుషిత ఆహారం

Advertisement

తనిఖీలు చేసిన చాలా చోట్ల వంటశాలలు ఏమాత్రం శుభ్రంగా లేవని అధికారులు గుర్తించారు. ఎలుకలు, బొద్దింకల సంచారం మధ్యే ఆహారం తయారు చేస్తుండటం గమనార్హం. అంతేకాకుండా, వెజ్, నాన్‌వెజ్ పదార్థాలను విడివిడిగా కాకుండా ఒకే చోట కలిపి నిల్వ చేస్తున్నట్టు గుర్తించారు. అనుమానాస్పదంగా ఉన్న 8 ఆహార నమూనాలను ల్యాబ్ పరీక్షలకు పంపించారు. అంతే కాకుండా, సుమారు 135 కిలోల పాడైపోయిన ఆహార పదార్థాలను అక్కడికక్కడే సీజ్ చేసి ధ్వంసం చేశారు.

సీజ్ అయినవి, లైసెన్సులు రద్దయిన సంస్థలు ఇవే..

Advertisement

నిబంధనలు గాలికొదిలేసిన సంస్థలపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. కనీసం FSSAI లైసెన్స్ కూడా లేకుండా నడుపుతున్న టోలిచౌకిలోని ఆల్ కరీమ్ బేకర్స్, గౌలిదొడ్డిలో శ్రీ లక్ష్మీ లగ్జరీ మెన్స్ హాస్టల్ లను పూర్తిగా మూసివేశారు. అంతే కాకుండా, ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన అయ్యప్ప సొసైటీలోని మాదాపూర్ బావర్చి, కూకట్‌పల్లిలో ది స్పైస్ కిచెన్, టోలిచౌకి లో మతామ్ ఆల్ యమాని, చందానగర్ లో అన్నపూర్ణ క్యాటరర్స్ సంస్థల FSSAI లైసెన్సులను తక్షణమే సస్పెండ్ చేశారు.

స్విగ్గీ, జొమాటోలకు కీలక ఆదేశాలు

లైసెన్సులు సస్పెండ్ చేసిన ఈ నాలుగు సంస్థలను తమ ప్లాట్‌ఫామ్‌ల నుంచి వెంటనే తొలగించాలని స్విగ్గీ, జొమాటో సంస్థలకు అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వీటితో పాటు మరో నాలుగు సంస్థలకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించగా.. ప్రముఖ మెహఫిల్ రెస్టారెంట్‌కు పనితీరు మెరుగుపరుచుకోవాలని ఇంప్రూవ్‌మెంట్ నోటీసు ఇచ్చారు. అంతే కాకుండా ఆరోగ్యం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.  కాబట్టి, ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది!

Also Read: క్లెయిమ్‌ల తిరస్కరణ, అక్రమ కోతలపై .. స్టార్ హెల్త్‌కు రూ. 2 కోట్ల జరిమానా!

Tags

Related News

తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్.. ఇంటింటికీ రూ.300లకే టీ-ఫైబర్ ఇంటర్‌నెట్!

తెలంగాణ పట్టణాలకు మహర్దశ.. రూ.20 వేల కోట్లతో సీఎం రేవంత్ భారీ ప్లాన్!

హైదరాబాద్‌ సిటీలో ఆ ప్రాంతాలకు బిగ్ అలర్ట్.. రాత్రి నుండి 24 గంటలు నీటి సరఫరా బంద్

హెచ్‌సీయూలో ఫుడ్ పాయిజన్.. 30 మందికి పైగా విద్యార్థులకు అస్వస్థత

ప్రగతినగర్ వాసులకు గుడ్ న్యూస్.. అంబీర్ చెరువు పనులు షురూ!

సాగర్‌ వివాదంలో అసలు దోషులెవరు? అధికారులదా.. ప్రభుత్వానిదా?

‘విదేశీ గడ్డపై భారత్ పరువు తీస్తున్నారు’.. రాహుల్‌ గాంధీపై కిషన్ రెడ్డి ధ్వజం!

Big Stories

Advertisement
×