Ubon sp-65g: ఈ రోజుల్లో మొబైల్ లేదా ల్యాప్‌టాప్ స్పీకర్ల సౌండ్ సరి పోక చాలా మంది చిన్న పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ల వైపు చూస్తున్నారు. తక్కువ ఖర్చులో కొంచెం ఎక్కువ సౌండ్, క్లియర్‌గా పాటలు వినిపించే.. ఆప్షన్ కోసం వెతికే వాళ్లకి ఈ మోడల్ ఒక ఇంట్రెస్టింగ్ ఆప్షన్‌గా కనిపిస్తోంది. రూ.849 ధరలో 20 వాట్స్ పవర్, 2.0 ఛానల్ సెటప్‌తో.. రావడం ఈ బడ్జెట్‌లో చెప్పుకోదగ్గ విషయం అని చెప్పొచ్చు. ఈ స్పీకర్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ మోడల్ గురించి మాట్లాడుకుంటే.. ముందుగా కనిపించేది దీని గోల్డ్ కలర్ ఫినిషింగ్. కాంపాక్ట్ సైజ్‌లో, టేబుల్ లేదా షెల్ఫ్ మీద పెట్టినప్పుడు కాస్త స్టైలిష్‌గా కనిపించేలా దీనిని డిజైన్ చేశారు.ఈజీగా పట్టుకోవడానికి లేదా ఎక్కడికైనా తీసుకెళ్లడానికి చేయడానికి వీలుగా ఉండే పోర్టబుల్ ఫామ్ ఫ్యాక్టర్ వల్ల ఇంటి లోపలే కాకుండా ట్రిప్స్, చిన్న చిన్న అవుట్ డోర్ సెటప్స్‌కి కూడా తీసుకెళ్లొచ్చు. సింపుల్ బటన్ కంట్రోల్స్.. ఉండటం వల్ల వాల్యూమ్ పెంచడం, ట్రాక్ మార్చడం, మోడ్స్ స్విచ్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది.
20వాట్ల అవుట్ పుట్, 2.0 ఛానల్ కాన్ఫిగరేషన్‌తో.. ఈ స్పీకర్ రూమ్ సైజ్ లేదా చిన్న పాటి గ్యాదరింగ్స్‌కి సరి పడే వాల్యూమ్‌ని ఇస్తుంది. డైలీ మ్యూజిక్, పాడ్‌కాస్ట్‌లు, యూట్యూబ్ వీడియోలు చూసేటప్పుడు వాయిస్ కూడా చాలా అద్భుతంగా వినిపిస్తుంది. అయితే.. ఇది రూ.849 రేంజ్ బడ్జెట్ స్పీకర్ కాబట్టి, పెద్ద హాల్స్ లేదా భారీ పార్టీలకు అంతగా సెట్ కాకపోయినా సౌండ్ మాత్రం అద్భుతంగా వస్తుంది. రెగ్యులర్ క్యాజువల్ లిజనింగ్‌కి మాత్రం ఈ ధరలో.. ఇది డీసెంట్ సౌండ్ పర్ఫార్మెన్స్‌ని అందిస్తుంది.
కనెక్టివిటీ పరంగా చూస్తే.. ఇందులో బ్లూటూత్ సపోర్ట్ ఉండటం వల్ల ఫోన్ లేదా టాబ్ నుంచి వైర్‌లెస్‌గా ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. దీంతో పాటు వైర్డ్ ఆప్షన్స్, మెమరీ కార్డ్ లేదా USB ప్లేబ్యాక్ వంటి మల్టీ-మోడ్ సపోర్ట్ కూడా ఉండటం వల్ల ఇంటర్నెట్ లేదా బ్లూటూత్ లేని టైమ్‌లోనూ పాటలు ప్లే చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. బిల్ట్-ఇన్ బ్యాటరీతో వచ్చే ఈ స్పీకర్‌ని ఛార్జ్ చేసుకుంటూ ..పోర్టబుల్‌గా వాడుకోవచ్చు.
Also Read: గీజర్ Vs వాటర్ హీటర్..ఏది వాడితే కరెంట్ బిల్లు తక్కువ వస్తుంది?
రూ.849 బడ్జెట్‌లో 20వాట్ల బ్లూటూత్ స్పీకర్ దొరకడం బెస్ట్ అనే చెప్పొచ్చు. కానీ ఆర్డర్ చేసే ముందు కొన్ని విషయాలు చెక్ చేయడం మంచిది. మీకు కావాల్సింది కచ్చితంగా.. ఈ గోల్డ్ కలర్ వేరియెంట్ అవునా కాదా, వారంటీ డీటెయిల్స్ ఏంటి, అలాగే ప్యాకేజీలో.. ఛార్జింగ్ కేబుల్ వంటి యాక్సెసరీస్ ఏమేం వస్తున్నాయో స్పష్టంగా చూసుకోవాలి.
ఈ ధరలో వర్త్ ఏనా?
మొత్తంగా చెప్పాలంటే.. రూ. 1,000 లోపు బడ్జెట్‌లో స్టైలిష్ గోల్డ్ లుక్‌తో 20W బ్లూటూత్ స్పీకర్ కావాలనుకునే వాళ్లకి.. ఈ మోడల్ ఒక బడ్జెట్-ఫ్రెండ్లీ ఆప్షన్. రోజూ పాటలు వినడానికి.. రూమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌కి లేదా చిన్న పాటి గెట్-టుగెదర్స్‌కి ఇది సింపుల్‌గా పని కొస్తుంది. మీ సౌండ్ అవసరాలు, బడ్జెట్‌కి తగ్గట్టు ఒకసారి చెక్ చేసుకుని ఈ మోడల్ కి కొనండి.