E-Paper
Advertisement

వీటితో టైల్స్,కార్పెట్స్.. ఏవైనా తళతళా మెరవాల్సిందే!

వీటితో టైల్స్,కార్పెట్స్.. ఏవైనా తళతళా మెరవాల్సిందే!
Advertisement

Best robot floor cleaners 2026: నేటి బిజీ లైఫ్‌లో రోజూ ఇల్లు ఊడ్చడం, తుడవడం పెద్ద టాస్క్‌లా మారింది. ముఖ్యంగా మన ఇళ్లలో టైల్స్, మార్బుల్‌తో పాటు లివింగ్ రూమ్‌లో రగ్స్ (కార్పెట్లు) ఉండటం వల్ల క్లీనింగ్ మరింత కష్టమవుతుంది. ఈ సమస్యకు లేటెస్ట్ టెక్నాలజీతో వచ్చిన స్మార్ట్ రోబోట్ ఫ్లోర్ క్లీనర్స్ బెస్ట్ సొల్యూషన్‌గా నిలుస్తున్నాయి. అన్ని రకాల ఫ్లోరింగ్‌ను ఇట్టే శుభ్రం చేసే టాప్ 5 రోబోట్ క్లీనర్స్ ఫీచర్లు, వాటి ధరల వివరాలను ఇప్పుడు చూద్దాం.

పూర్తి ఫీచర్లు:

1.ECOVACS N30 Plus Robotic Floor Cleaner:

మిక్స్‌డ్ ఫ్లోరింగ్ ఉన్న పెద్ద ఇళ్లకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. ఇందులో 10,000Pa పవర్‌ఫుల్ సక్షన్ పవర్ ఉండటం వల్ల టైల్స్, మార్బుల్‌పై ఉండే.. దుమ్ముతో పాటు రగ్స్ లోపల దాగి ఉన్న మట్టిని కూడా ఈజీగా లాగేస్తుంది. దీని 5200mAh బ్యాటరీ ఒక్క సారి ఛార్జ్ చేస్తే దాదాపు 6 గంటల వరకు నాన్‌స్టాప్‌గా ప నిచేస్తుంది.

Advertisement

ప్రత్యేకత: ఇందులో OmniCyclone బ్యాగ్‌లెస్ టెక్నాలజీ ఉంది. కాబట్టి తరచూ డస్ట్ బ్యాగ్స్ మార్చాల్సిన అవసరం ఉండదు. ట్రూమ్యాపింగ్ టెక్నాలజీతో.. కేవలం 8 నిమిషాల్లోనే 1,076 చదరపు అడుగుల విస్తీర్ణాన్ని స్మార్ట్‌గా మ్యాప్ చేస్తుంది.

ధర: సుమారు రూ.30,000 (ఆఫర్లను బట్టి మారొచ్చు).

2.ILIFE T20s Ultra Robot Vacuum Cleaner:

Advertisement

మీ ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నా, లేదా మంద పాటి కార్పెట్లు ఉన్నా ఈ రోబోట్ క్లీనర్ అద్భుతంగా పని చేస్తుంది. ఇది ఏకంగా 25,000Pa అల్ట్రా-హై సక్షన్ పవర్‌తో వస్తుంది. రగ్స్‌పైకి వెళ్లగానే.. ఆటోమేటిక్‌గా సక్షన్ పవర్ పెంచుకుని డీప్ క్లీన్ చేస్తుంది. ఇందులో 3.5 లీటర్ల సెల్ఫ్-ఎమ్టీయింగ్ స్టేషన్ ఉంది. కాబట్టి దీని వల్ల దాదాపు 70 రోజుల వరకు మీరు డస్ట్ బిన్ ఖాళీ చేయాల్సిన పనే ఉండదు. అలెక్సా, గూగుల్ హోమ్ సపోర్ట్ కూడా ఇందులో ఉన్నాయి.

ధర: సుమారు రూ.26,915.

3.Motorola GlideBot Plus Robotic Floor Cleaner:

బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లు కోరుకునే.. వారికి మోటరోలా గ్లైడ్‌బాట్ ప్లస్ బెస్ట్ ఆప్షన్. 11,000Pa సక్షన్ పవర్‌తో టైల్స్, మార్బుల్ ఫ్లోర్స్‌ను తళతళా మెరిపిస్తుంది. గదుల మధ్య ఉండే చిన్న పాటి ఎత్తుపల్లాలను, కార్పెట్ అంచులను ఇది ఈజీగా దాటుకుంటూ వెళ్తుంది. దీని ఎడ్జ్-సెన్స్ టెక్నాలజీ గోడల మూలల్లో.. ఉండే దుమ్మును కూడా వదలకుండా క్లీన్ చేస్తుంది. 3 లీటర్ల డస్ట్ స్టేషన్‌తో పాటు 5200mAh బ్యాటరీ 4 గంటల రన్‌టైమ్ ఇస్తుంది.

ధర: సుమారు రూ.17,499 –రూ.18,999.

4.EUREKA FORBESRobotic Floor Cleaner:

ఇండియన్ ఇళ్ల అవసరాలకు తగ్గట్టుగా యురేకా ఫోర్బ్స్ దీనిని రూపొందించింది. 7,000Pa హైపర్ సక్షన్ పవర్, 2-ఇన్-1 వాక్యూమ్ మరియు వెట్ మాపింగ్ ఫీచర్‌తో మార్బుల్ ఫ్లోర్స్‌పై మరకలను ఈజీగా తొలగిస్తుంది. ఇందులో ఉన్న LiDAR 3.0 టెక్నాలజీ ఇల్లంతా వేగంగా మ్యాప్ చేసి, అల్మారాలు, సోఫాల కింద ఇరుక్కోకుండా క్లీన్ చేస్తుంది. 3200mAh బ్యాటరీ 3 గంటల పాటు పని చేస్తుంది.

ధర: సుమారు రూ.14,999 –రూ.18,268.

5.Mi S10 Robotic Floor Cleaner:

తక్కువ బడ్జెట్‌లో నమ్మకమైన స్మార్ట్ ఫ్లోర్ క్లీనర్ కావాలనుకునే.. వారికి షియోమీ Mi S10 బాగా నచ్చుతుంది. 4,000Pa సక్షన్ పవర్‌తో.. దుమ్ము, ధూళిని టైల్స్, వుడెన్ ఫ్లోర్స్ ,తక్కువ మందం ఉన్న రగ్స్ పై నుంచి చక్కగా శుభ్రం చేస్తుంది. దీని LDS లేజర్ నావిగేషన్ కచ్చితమైన రూట్ మ్యాప్‌ను క్రియేట్ చేస్తుంది. షియోమీ హోమ్ యాప్ ద్వారా మీరు ఆఫీసులో ఉన్నా.. సరే ఇంటి క్లీనింగ్‌ను షెడ్యూల్ చేసుకోవచ్చు.

ధర: సుమారు రూ.18,999 –రూ.20,999 (సేల్స్‌లో ఇంకా తక్కువకే లభిస్తుంది).

Also Read: బడ్జెట్‌లో బెస్ట్ పోర్టబుల్ స్పీకర్..వైబ్స్ నెక్స్ట్ లెవెల్‌ అంతే!

ఏది ఎంచుకోవాలి?

మీ ఇల్లు చాలా పెద్దదైతే… అలాగే మందపాటి కార్పెట్స్ ఇంట్లో ఎక్కువగా ఉంటే ECOVACS N30 Plus లేదా ILIFE T20s Ultra బెస్ట్ ఆప్షన్స్. ఒకవేళ మీ బడ్జెట్ రూ.20,000 లోపు ఉండి టైల్స్ , మార్బుల్ క్లీనింగ్ కోసం చూస్తుంటే Motorola GlideBot Plus లేదా Eureka Forbes SmartClean మోడల్స్ మీకు చాలా బాగా ఉపయోగపడతాయి.

Related News

చలికాలం అలర్ట్..బీపీ,షుగర్ ఉన్నవాళ్లు ఈ తప్పులు అస్సలు చేయెద్దు!

బడ్జెట్‌లో బెస్ట్ పోర్టబుల్ స్పీకర్..వైబ్స్ నెక్స్ట్ లెవెల్‌ అంతే!

ఫైబర్ నెట్ ఉన్నా సరే.. వైఫై రూటర్లలో ఇప్పటికీ DSL పోర్ట్ ఎందుకు ఇస్తున్నారో తెలుసా?

బడ్జెట్‌లో బెస్ట్ సౌండ్‌బార్..సినిమాలు,క్రికెట్ మ్యాచ్‌లకి నెక్స్ట్ లెవెల్ సౌండ్!

విడుదలకు ముందే Vivo X500 సిరీస్, Watch GT 2 ధరలు లీక్.. ఈసారి బడ్జెట్ గట్టిగానే పెట్టాలి!

ఫేస్ అన్‌లాక్ వెనుక ఇంత పెద్ద తంతంగం నడుస్తోందా? చీకట్లోనూ పనిచేసే ఆ 5 టెక్నాలజీలు ఇవే!

ప్రీపెయిడ్ ధరకే పోస్ట్‌పెయిడ్ కనెక్షన్.. రూ. 199కే BSNL అదిరిపోయే ప్లాన్.. సామాన్యులకు పండగే!

Big Stories

Advertisement
×