Water Heater Rod Vs Geyser: చలికాలం వచ్చిందంటే చాలు.. ఉదయాన్నే లేచి చల్లటి నీళ్లతో స్నానం చేయడం అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే మనలో చాలా మంది వేడి నీళ్ల కోసం ఏదో ఒక దారి వెతుకుతాం. ఇంట్లో.. గీజర్ వాడితే మంచిదా ఆ లేక సింపుల్‌గా వాటర్ హీటర్ రాడ్ వాడదామా? ఈ రెండింటిలో ఏది బెస్ట్? దేనికి కరెంట్ బిల్లు ఎంత పడుతుంది? ఈ సందేహాలు చాలా మందికి ఉంటాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మార్కెట్లో వాటర్ హీటర్ రాడ్స్ చాలా తక్కువ ధరకే (రూ. 300 నుంచి రూ. 800 లోపు) దొరుకుతాయి. దీన్ని బకెట్‌లో ..పెట్టి ప్లగ్ ఆన్ చేస్తే చాలు, నిమిషాల్లో నీళ్లు మరిగిపోతాయి.
సాధారణంగా ఇమ్మర్షన్ రాడ్స్ 1000 వాట్స్ నుంచి 1500 వాట్స్ పవర్ వాడతాయి. మీరు రోజుకు 15 నుంచి 20 నిమిషాలు దీన్ని వాడితే, సుమారు అర్ధ యూనిట్ (0.5 kWh) కరెంట్ ఖర్చవుతుంది. అంటే నెలకు సుమారు 15 నుంచి 20 యూనిట్లు పడుతుంది. బిల్లు చాలా తక్కువగానే వస్తుంది.
ప్లస్ పాయింట్స్: తక్కువ ఖర్చు, ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు (పోర్టబుల్), తక్కువ సమయంలో నీళ్లు వేడవుతాయి.
మైనస్ పాయింట్స్ & సేఫ్టీ: కరెంట్ షాక్ కొట్టే రిస్క్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. నీళ్లు మరిగాక రాడ్ తీయడం మర్చిపోతే.. ప్లాస్టిక్ బకెట్లు కరిగిపోయే ప్రమాదం ఉంది. పిల్లలు ఉన్న ఇళ్లలో ఇది చాలా డేంజర్.
గీజర్ అనేది బాత్‌రూమ్‌లో పర్మినెంట్‌గా ఫిట్ చేసుకునేది.దీంట్లో వాటర్ స్టోరేజ్ ట్యాంక్ గీజర్లు, ఇన్‌స్టంట్ గీజర్లు అని రెండు రకాలు ఉంటాయి.
కరెంట్ బిల్లు:
స్టోరేజ్ గీజర్లు సాధారణంగా.. 2000 వాట్లు లేదా అంతకంటే ..ఎక్కువ పవర్ తీసుకుంటాయి. నీటిని వేడి చేసి ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి ఇవి ఆటోమేటిక్‌గా ఆన్ అవుతుంటాయి. కాబట్టి.. రోజుకు అరగంట నుంచి గంట గీజర్ రన్ అయితే.. రోజుకు 1 నుంచి 2 యూనిట్లు ఈజీగా ఖర్చవుతాయి.నెలకు ఇది 30 నుంచి 60 యూనిట్ల వరకు కరెంట్ ఖర్చు చేస్తుంది. అందుకే దీని వల్ల కరెంట్ బిల్లు కాస్త ఎక్కువగానే వస్తుంది.
ప్లస్ పాయింట్స్: ఫుల్ సేఫ్టీ! ఆటోమేటిక్ కట్-ఆఫ్ ఉంటుంది కాబట్టి వేడెక్కగానే అదే ఆగిపోతుంది. ఒకే సారి ఎక్కువ మంది గోరువె చ్చని నీళ్లతో స్నానం చేయొచ్చు. పైపుల ద్వారా నేరుగా షవర్‌కు లేదా ట్యాప్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు.
మైనస్ పాయింట్స్: ఇనిషియల్ కాస్ట్ (కొనేటప్పుడు, ఫిట్ చేసేటప్పుడు ఖర్చు) ఎక్కువ. అంతే కాకుండా బాత్‌రూమ్‌లో పర్మినెంట్ స్పేస్ కావాలి.
బ్యాచిలర్స్ / చిన్న రూమ్‌లలో ఉండేవారికి: మీరు అద్దె ఇంట్లో ఉంటున్నా, లేదా బ్యాచిలర్ లైఫ్ గడుపుతున్నా వాటర్ హీటర్ రాడ్ బెస్ట్ ఆప్షన్. తక్కువ ఖర్చుతో పని అయిపోతుంది. కాకపోతే ..వాడేటప్పుడు మాత్రం చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి.
కుటుంబంతో కలిసి ఉండే వారికి: మీ ఇంట్లో.. చిన్నపిల్లలు, వృద్ధులు ఉంటే మాత్రం కచ్చితంగా గీజరే బెస్ట్ ఛాయిస్. ఇది సేఫ్టీ పరంగా చాలా నమ్మకమైనది. కరెంట్ బిల్లు కాస్త ఎక్కువ వచ్చినా, రోజూ హాయిగా, భయం లేకుండా వేడి నీళ్లతో స్నానం చేయవచ్చు.
బిల్లు తగ్గించుకోవడానికి చిన్న చిట్కా:
మీరు గీజర్ వాడుతున్నట్లయితే.. స్నానానికి పది నిమిషాల ముందే ఆన్ చేసుకోండి. నీళ్లు వేడెక్కగానే స్విచ్ ఆఫ్ చేసేయండి. స్టోరేజ్ గీజర్లను గంటల తరబడి ఆన్ చేసి ఉంచితే కరెంట్ బిల్లు చాలా ఎక్కువగా వస్తుంది. అలాగే ఎనర్జీ రేటింగ్ (5-స్టార్) ఉన్న గీజర్లను ఎంచుకోవడం ద్వారా కరెంట్ బిల్లును చాలా వరకు తగ్గించుకోవచ్చు.