E-Paper
Advertisement

సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనే ముందు ఈ సీక్రెట్ కోడ్ డయల్ చేయండి.. దాని జాతకమంతా బయటపడుతుంది!

సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనే ముందు ఈ సీక్రెట్ కోడ్ డయల్ చేయండి.. దాని జాతకమంతా బయటపడుతుంది!
Advertisement

Second Hand Phone: తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్ కావాలంటే చాలామంది ఇప్పుడు సెకండ్ హ్యాండ్ ఫోన్ల వైపు చూస్తున్నారు. కొత్త ఫోన్ల ధరలు ఎక్కువగా ఉండటంతో.. వాడిన ఫోన్లు కొనడం బెస్ట్ ఆప్షన్ అనుకుంటున్నారు. కానీ, బయటకు కొత్తదానిలా మెరిసిపోతున్న ఫోన్ లోపల ఎలా ఉందో ఎవరికి తెలుసు? అమ్మేవాళ్లు చాలావరకు అందులో ఉన్న లోపాలను దాచిపెట్టి అమ్ముతుంటారు. కొన్న రెండు రోజులకే బ్యాటరీ త్వరగా అయిపోవడం, టచ్ సరిగ్గా పనిచేయకపోవడం లాంటి సమస్యలు మొదలవుతాయి. అలాంటి మోసాలకు బలికాకుండా ఉండాలంటే.. కేవలం ఫోన్ డయలర్‌లో కొన్ని సీక్రెట్ కోడ్స్ ఎంటర్ చేస్తే చాలు, ఆ ఫోన్ అసలు రంగు బయటపడుతుంది.

డిస్‌ప్లే, టచ్ టెస్ట్..

పాత ఫోన్లలో ప్రధానంగా డూప్లికేట్ డిస్‌ప్లే వేయడం లేదా టచ్ సరిగ్గా పనిచేయకపోవడం లాంటి సమస్యలు ఉంటాయి. దీనిని తెలుసుకోవడానికి శాంసంగ్ ఫోన్లలో #0# అని, షియోమీ, రెడ్‌మీ, పోకో ఫోన్లలో ##6484## అని డయల్ చేయండి. వెంటనే హార్డ్‌వేర్ టెస్ట్ మెనూ ఓపెన్ అవుతుంది. ఇందులో రెడ్, గ్రీన్, బ్లూ కలర్ ఆప్షన్లపై నొక్కి డిస్‌ప్లేలో ఏవైనా మచ్చలు ఉన్నాయా అని చూడొచ్చు. అలాగే టచ్ గ్రిడ్ టెస్ట్ ద్వారా స్క్రీన్ అంతా వేలితో తిప్పి టచ్ కరెక్ట్‌గా పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోవచ్చు. కెమెరా, స్పీకర్, వైబ్రేషన్ కూడా ఇక్కడే పరీక్షించవచ్చు.

బ్యాటరీ హెల్త్ చెకింగ్..

Advertisement

వాడిన ఫోన్లలో బ్యాటరీ తొందరగా పాడవుతుంది. దీని కండిషన్ తెలుసుకోవడానికి మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ##4636## అని డయల్ చేయండి. ఇందులో Battery Information ఆప్షన్‌లోకి వెళ్తే బ్యాటరీ హెల్త్, వోల్టేజ్, టెంపరేచర్ వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి. అక్కడ Good అని కాకుండా Weak లేదా Overheated అని ఉంటే.. ఆ ఫోన్ కొన్న వెంటనే బ్యాటరీ మార్చాల్సి వస్తుందని అర్థం. అలాగే సిమ్ కార్డ్, 5జీ నెట్‌వర్క్ ఎలా పనిచేస్తున్నాయో కూడా ఇక్కడే తెలిసిపోతుంది.

Also Read: కస్టమర్లతో కనెక్ట్ అవ్వడం ఇక మరింత ఈజీ.. Vi Business నుంచి ఏఐ ఆధారిత వాట్సప్ సేవలు!

దొంగిలించిన ఫోనా కాదా?

Advertisement

అన్నింటికంటే ముఖ్యమైనది మీరు కొంటున్న ఫోన్ దొంగిలించినదా కాదా అని తెలుసుకోవడం. దీనికోసం *#06# అని డయల్ చేస్తే 15 అంకెల ఐఎంఈఐ (IMEI) నంబర్ వస్తుంది. ముందుగా ఈ నంబర్‌ను ఫోన్ బాక్స్, బిల్లు మీద ఉన్న నంబర్‌తో పోల్చి చూడండి. రెండూ వేర్వేరుగా ఉంటే మదర్ బోర్డ్ మార్చారని అర్థం. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ Sanchar Saathi వెబ్‌సైట్ లేదా KYM యాప్‌లో ఈ నంబర్ ఎంటర్ చేసి చూడండి. ఆ ఫోన్ మీద ఏదైనా పోలీస్ కేసు ఉన్నా, బ్లాక్ లిస్ట్‌లో ఉన్నా వెంటనే తెలిసిపోతుంది.

కొనే ముందు జాగ్రత్త..

సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనేటప్పుడు తొందరపడకుండా ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ పాటిస్తే చాలు. ఎలాంటి రిపేర్లు లేని మంచి ఫోన్‌ను మీరు సొంతం చేసుకోవచ్చు. డబ్బులు పెట్టి కొనేటప్పుడు ఈ మాత్రం జాగ్రత్త ఉండటం చాలా అవసరం.

Also Read: మిడ్‌రేంజ్ మార్కెట్లో మోటరోలా సంచలనం.. 53 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో వస్తున్న Edge 70 Neo!

Tags

Related News

ప్రీపెయిడ్ ధరకే పోస్ట్‌పెయిడ్ కనెక్షన్.. రూ. 199కే BSNL అదిరిపోయే ప్లాన్.. సామాన్యులకు పండగే!

గీజర్ Vs వాటర్ హీటర్..ఏది వాడితే కరెంట్ బిల్లు తక్కువ వస్తుంది?

కస్టమర్లతో కనెక్ట్ అవ్వడం ఇక మరింత ఈజీ.. Vi Business నుంచి ఏఐ ఆధారిత వాట్సప్ సేవలు!

కరెంట్ పోతే ఇన్వర్టర్‌పై ఫ్యాన్,టీవీ ఎన్ని గంటలు నడుస్తాయి? పూర్తి వివరాలివిగో!

మిడ్‌రేంజ్ మార్కెట్లో మోటరోలా సంచలనం.. 53 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో వస్తున్న Edge 70 Neo!

ఆఫీస్ ల్యాప్‌టాప్‌లో ఈ పనులు అస్సలు చేయెద్దు! చిన్న పొరపాట్లతో జాబ్ పోతుంది

90s కిడ్స్ ఫేవరెట్.. మార్కెట్లోకి నోకియా 1100 రీ-ఎంట్రీ.. ఇక బ్యాక్ టూ గోల్డెన్ డేస్ మామ!

Big Stories

Advertisement
×