E-Paper
Advertisement

పోయిన ఐఫోన్ దొరికిందని మెసేజ్ వచ్చిందా? ఆ లింక్ క్లిక్ చేస్తే అకౌంట్ ఖాళీ.. కేంద్రం వార్నింగ్!

పోయిన ఐఫోన్ దొరికిందని మెసేజ్ వచ్చిందా? ఆ లింక్ క్లిక్ చేస్తే అకౌంట్ ఖాళీ.. కేంద్రం వార్నింగ్!
Advertisement

iPhone Scam: ఖరీదైన ఐఫోన్ పోగొట్టుకున్న బాధలో ఉన్నవారికి.. ‘మీ ఫోన్ దొరికింది’ అని ఒక మెసేజ్ వస్తే ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. సరిగ్గా ఇదే ఎమోషన్‌ను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. పోయిన ఫోన్ తిరిగి వస్తుందన్న ఆశతో మీరు చేసే ఒక చిన్న పొరపాటు, మీ బ్యాంక్ అకౌంట్‌ను పూర్తిగా ఖాళీ చేసే ప్రమాదం ఉంది. ఈ కొత్త రకం మోసం గురించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) తాజాగా కీలక హెచ్చరికలు జారీ చేశాయి.

నేరగాళ్లకు మన నంబర్ ఎలా దొరుకుతోంది?

ఫోన్ పోగానే చాలామంది కంగారులో సోషల్ మీడియా గ్రూపుల్లో తమ ఆల్టర్నేట్ మొబైల్ నంబర్ ఇచ్చి సాయం కోరుతుంటారు. సైబర్ కేటుగాళ్లు ఇలాంటి పోస్టులపైనే ఒక కన్నేసి ఉంచుతారు. అంతేకాకుండా.. ఐఫోన్‌లోని Find My ఫీచర్‌లో Lost Mode ఆన్ చేసినప్పుడు స్క్రీన్ మీద కనిపించే కాంటాక్ట్ నంబర్‌ను, పాత డేటా లీకుల ద్వారా సేకరించిన మీ ఈ-మెయిల్ ఐడీలను వీరు వాడుకుని వల విసురుతారు.

యాపిల్ సపోర్ట్ పేరుతో మోసం..

Advertisement

ఫోన్ పోయిన కొద్దిసేపటికే బాధితులకు Apple Support పేరుతో ఒక SMS లేదా ఈ-మెయిల్ వస్తుంది. మీ ఫోన్ లొకేషన్ ట్రాక్ అయిందని, భద్రతా కారణాల వల్ల లాక్ చేశామని అందులో ఉంటుంది. లొకేషన్ చూడటానికి కింద ఒక లింక్ ఇస్తారు. అది అచ్చం యాపిల్ వెబ్‌సైట్ లాగే ఉండటంతో బాధితులు నమ్మి, తమ యాపిల్ ఐడీ, పాస్‌వర్డ్, ఓటీపీ వివరాలను ఎంటర్ చేస్తారు.

Also Read: స్మార్ట్‌ఫోన్లకు పోటీగా HMD 2320 Flip 4G ఫ్లిప్ ఫోన్.. వాకీ-టాకీ ఫీచర్, టైప్-సీ ఛార్జింగ్‌తో అదరగొట్టే స్పెసిఫికేషన్లు!

ఆ పని మాత్రం చేయొద్దు..

Advertisement

మీ వివరాలు సేకరించాక, ఆ ఫోన్‌ను మీ యాపిల్ అకౌంట్ నుంచి రిమూవ్ చేయమని ఆ ఫేక్ సైట్‌లో సూచిస్తారు. అలా చేస్తే ఫోన్‌కు ఉన్న యాక్టివేషన్ లాక్ తొలగిపోయి, దొంగలు ఆ ఫోన్‌ను సులభంగా అమ్ముకునే అవకాశం కలుగుతుంది. దాంతో పాటు మీ పర్సనల్ డేటా, బ్యాంకింగ్ యాప్స్ యాక్సెస్ కూడా వారి చేతుల్లోకి వెళ్లిపోతుంది.

మోసపోకుండా ఉండాలంటే?

యాపిల్ సంస్థ ఎప్పుడూ ఫోన్ లొకేషన్ కోసం ఎస్ఎంఎస్ లేదా లింకులను పంపదని గుర్తుంచుకోండి. అలాంటి మెసేజ్‌లు వస్తే అస్సలు క్లిక్ చేయకండి. మీ ఫోన్ స్టేటస్ తెలుసుకోవడానికి కేవలం అధికారిక iCloud వెబ్‌సైట్ లేదా మరో యాపిల్ డివైజ్‌లోని ఫైండ్ మై యాప్ మాత్రమే వాడండి. ఎవరు అడిగినా మీ అకౌంట్ నుంచి ఫోన్‌ను రిమూవ్ చేయకండి, ఓటీపీలను ఎవరితోనూ పంచుకోకండి.

Also Read: క్రియేటర్లు, స్టూడెంట్లకు జియో బంపర్ గిఫ్ట్.. రూ.349 రీఛార్జ్‌తో ఏడాది పాటు ఫ్రీ సబ్‌స్క్రిప్షన్!

Tags

Related News

స్మార్ట్‌ఫోన్లకు పోటీగా HMD 2320 Flip 4G ఫ్లిప్ ఫోన్.. వాకీ-టాకీ ఫీచర్, టైప్-సీ ఛార్జింగ్‌తో అదరగొట్టే స్పెసిఫికేషన్లు!

క్రియేటర్లు, స్టూడెంట్లకు జియో బంపర్ గిఫ్ట్.. రూ.349 రీఛార్జ్‌తో ఏడాది పాటు ఫ్రీ సబ్‌స్క్రిప్షన్!

డిజైన్ చూపించి ఊరించిన హువావే.. కొత్త ఫోల్డబుల్ ఫోన్ ఫీచర్లు లీక్, 16GB ర్యామ్‌తో త్వరలోనే ఎంట్రీ!

Jio రీఛార్జ్ గడువు ముగిస్తే ఇన్‌కమింగ్ కాల్స్ కూడా బంద్? సిమ్ యాక్టివ్‌గా ఉండాలంటే ఇలా చేయండి!

టైటానియం బిల్డ్, ఆఫ్‌లైన్ మ్యాప్స్, 15 రోజుల బ్యాటరీ.. జస్ట్ రూ.5,999 నుంచే బిల్ట్-ఇన్ జీపీఎస్ స్మార్ట్‌వాచ్‌లు!

జాగ్రత్త.. మీకు తెలియకుండానే ఈ యాప్స్ మిమ్మల్ని గమనిస్తున్నాయి, కెమెరా, మైక్ పర్మిషన్లను ఆపేయండిలా!

జియో బంపరాఫర్.. రూ.649 కే అపరిమిత 5G, హాట్‌స్టార్.. గూగుల్ జెమిని, కాన్వా ప్రో సైతం ఫ్రీ!

Big Stories

Advertisement
×