HMD 2320 Flip 4G: ఇప్పుడున్న స్మార్ట్‌ఫోన్ల కాలంలో కూడా సింపుల్‌గా, వాడుకోవడానికి ఈజీగా ఉండే ఫ్లిప్ ఫోన్లకు మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా పెద్దవాళ్ల కోసం, అలాగే ఎప్పుడూ ఫీల్డ్ వర్క్‌లో ఉండే వాళ్ల కోసం కంపెనీలు సరికొత్త ఫీచర్లతో బేసిక్ ఫోన్లను తీసుకొస్తున్నాయి. తాజాగా HMD కంపెనీ ఒక కొత్త 4G ఫ్లిప్ ఫోన్‌ను తీసుకురాబోతున్నట్లు టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ప్రముఖ టిప్‌స్టర్ @smashx_60 ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ పేరు HMD 2320 Flip 4G. సాధారణ ఫ్లిప్ ఫోన్లలో లేని కొన్ని అద్భుతమైన ఫీచర్లు ఇందులో ఉండబోతున్నాయి. ఇది కేవలం కాల్స్ మాట్లాడుకోవడానికి మాత్రమే కాకుండా, సెక్యూరిటీ పరంగా కూడా చాలా బాగా ఉపయోగపడనుంది.
ఈ కొత్త HMD 2320 Flip 4G ఫోన్‌లో రెండు డిస్‌ప్లేలు ఉండబోతున్నాయి. లోపల 2.4 ఇంచుల మెయిన్ LCD స్క్రీన్, బయట నోటిఫికేషన్లు చూసుకోవడానికి 1.77 ఇంచుల చిన్న స్క్రీన్ ఇస్తున్నారు. ఇందులో Unisoc T127 ప్రాసెసర్‌ను వాడారు. అలాగే 64 MB ర్యామ్, 128 MB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. మెమరీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 32 GB వరకు పెంచుకోవచ్చు.
Also Read: క్రియేటర్లు, స్టూడెంట్లకు జియో బంపర్ గిఫ్ట్.. రూ.349 రీఛార్జ్‌తో ఏడాది పాటు ఫ్రీ సబ్‌స్క్రిప్షన్!
ఇందులో అందరినీ ఆకట్టుకునే విషయం దీని సేఫ్టీ ఫీచర్లు. రియల్-టైమ్ GPS ట్రాకింగ్, వాకీ-టాకీ తరహాలో పనిచేసే పుష్-టు-టాక్ (Push-to-Talk) ఫీచర్, అలాగే అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేకంగా SOS బటన్ ఇస్తున్నారు. అంతేకాకుండా.. డాకింగ్ ఛార్జింగ్ సపోర్ట్, వినికిడి లోపం ఉన్నవాళ్ల కోసం హియరింగ్ ఎయిడ్ కంపాటిబిలిటీ (HAC) కూడా ఉంది.
ఈ ఫోన్‌లో 1,450 mAh బ్యాటరీని ఇచ్చారు. దీనికి లేటెస్ట్ USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్ ఉండటం విశేషం. ఫోటోల కోసం వెనుక 0.3 MP కెమెరా, బ్లూటూత్ 5.0, 2.4 GHz వైఫై, FM రేడియో, 3.5 mm హెడ్‌ఫోన్ జాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సింగిల్ నానో సిమ్ ద్వారా ఇది 4G LTE నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది.
గతంలో వచ్చిన HMD 2660 Flip సీనియర్ ఎడిషన్‌తో పోలిస్తే.. ఇందులో చాలా మార్పులు ఉన్నాయి. పాత మోడల్‌లో 2.8 ఇంచుల పెద్ద స్క్రీన్ ఉన్నప్పటికీ, అందులో GPS ట్రాకింగ్, పుష్-టు-టాక్ లాంటి ఫీచర్లు లేవు. అలాగే ఇటీవల వచ్చిన Nokia 2360 Flip కేవలం 2G నెట్‌వర్క్‌కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. కానీ ఈ కొత్త HMD 2320 Flip 4G మాత్రం అటు 4G వేగంతో పాటు, ఇటు సేఫ్టీ ఫీచర్లతో బెస్ట్ ఆప్షన్‌గా నిలవనుంది.
Also Read: డిజైన్ చూపించి ఊరించిన హువావే.. కొత్త ఫోల్డబుల్ ఫోన్ ఫీచర్లు లీక్, 16GB ర్యామ్‌తో త్వరలోనే ఎంట్రీ!