Airtel Recharge: తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్ అందించే రీఛార్జ్ ప్లాన్స్ కు ఈ రోజుల్లో డిమాండ్ భారీగా పెరిగింది. దీనిని గుర్తించిన టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్.. తన యూజర్ల కోసం ఒక సాలిడ్ ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చింది. రూ.299 ధరకే దిమ్మతిరిగే బెనిఫిట్స్ ను ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్ ను రీఛార్జ్ చేసుకోవడం ద్వారా యూజర్లకు కలిగే బెనిఫిట్స్ ఏంటో ఈ కథనంలో చూద్దాం.
ఎయిర్ టెల్ ఈ ప్లాన్ ను 28 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. దీనికింద యూజర్లకు ప్రతీ రోజూ 1.5GB డేటా లభించనుంది. ఒకవేళ రోజువారీ లిమిట్ అయిపోతే ఇంటర్నెట్ స్పీడ్ 16 Kbpsకి తగ్గనుంది. మరోవైపు దేశంలో ఏ నెట్ వర్క్ కు అయినా అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు సైతం చేసుకునే వెసులుబాటును ఎయిర్ టెల్ కల్పిస్తోంది.
రూ.299 ప్లాన్ కింద అడోబ్ ఎక్స్ ప్రెస్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ను ఎయిర్ టెల్ ఆఫర్ చేస్తోంది. దీని ప్రకారం 12 నెలల పాటు అడోబ్ సేవలను ఉచితంగా పొందొచ్చు. సోషల్ మీడియా పోస్టులు, ప్రమోషనల్ బ్యానర్లు, పోస్టర్లు, ఇతర గ్రాఫిక్ డిజైన్లను ఈ యాప్ ను ఉపయోగించి తేలిగ్గా క్రియేట్ చేసుకోవచ్చని ఎయిర్ టెల్ వర్గాలు చెబుతున్నాయి. దీని విలువ రూ.4000కు సమానమని స్పష్టం చేస్తున్నాయి.
Also Read: 72 రోజుల వ్యాలిడిటీ.. ఫ్రీగా హాట్ స్టార్, అన్‌లిమిటెడ్ 5G.. ఈ జియో ప్లాన్ భలే ఉందే!
అదనపు బెనిఫిట్స్ కింద మరికొన్ని సేవలను సైతం ఎయిర్ టెల్ ఉచితంగా అందిస్తోంది. ఇందులో భాగంగా ‘ఎయిర్‌టెల్ సేఫ్’ (Airtel Safe) సేవలు యూజర్లు వినియోగించుకోవచ్చు. స్పామ్ కాల్స్‌ను గుర్తించడానికి, ఆన్‌లైన్ మోసాల బారి నుంచి బయటపడటానికి ఇది ఉపయోగపడుతుందని ఎయిర్ టెల్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ప్రతీ నెలా ఉచితంగా హలో ట్యూన్స్ ను సెట్ చేసుకునే వెసులుబాటును సైతం ఈ రూ.299 ప్లాన్ లో ఎిర్ టెల్ కల్పిస్తోంది.
Also Read: రూ.5 లక్షలు ఉంటే చాలు.. ఈ వినూత్న వ్యాపారాలకు మీరే బాస్.. పోటీ తక్కువ, రాబడి ఎక్కువ!