E-Paper
Advertisement

మైనర్ బాలికపై దారుణం.. పోలీసులనే ముప్పుతిప్పలు పెట్టే టెక్నాలజీ గ్యాంగ్.. ఈ క్రైమ్ థ్రిల్లర్ మామూలుగా ఉండదు భయ్యా

మైనర్ బాలికపై దారుణం.. పోలీసులనే ముప్పుతిప్పలు పెట్టే టెక్నాలజీ గ్యాంగ్.. ఈ క్రైమ్ థ్రిల్లర్ మామూలుగా ఉండదు భయ్యా
Advertisement

Bengali Crime Thriller on OTT: సస్పెన్స్, ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్స్ తీయడంలో బెంగాలీ చిత్ర పరిశ్రమ శైలి ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. ఎటువంటి కమర్షియల్ హంగులు లేకుండా, కేవలం స్క్రీన్‌ప్లే, రా అండ్ గ్రిట్టీ యాక్షన్ సీక్వెన్సెస్‌తో ప్రేక్షకులను కట్టిపడేయడం బెంగాలీ మేకర్స్‌కు వెన్నతో పెట్టిన విద్య. ఆ కోవలో తాజాగా జీ5 (ZEE5)లో స్ట్రీమింగ్ అవుతూ క్రైమ్ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘మిర్గయ 1.5’ (Mirgaya 1.5). విక్రమ్ ఛటర్జీ ప్రధాన పాత్రలో నటించిన ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కథలో పోలీసులకు ఎదురయ్యే సవాళ్లు ఒక్కోసారి ఊహించని విధంగా ఉంటాయి. ఇందులో నేరస్థులు టెక్నాలజీని అడ్డం పెట్టుకుని పోలీసుల కళ్లుగప్పే ప్రయత్నం చేస్తుంటారు. రిత్విక్ చక్రవర్తి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా, పోలీసుల వేటకు టెక్నాలజీతో నేరాలు చేసే క్రిమినల్స్‌ మధ్య జరిగే పోరాటాన్ని చాలా ఇంటెన్స్ గా చూపిస్తుంది.

కథలోకి వెళ్తే…

కోల్‌కతాలో ఒక మైనర్ బాలికపై జరిగిన దారుణమైన అఘాయిత్యం ఘటన నగరాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేస్తుంది. ఈ కేసు దర్యాప్తు బాధ్యతను ఆఫీసర్ ఇన్‌ఛార్జ్ దేవాంజన్ దత్తా (రిత్విక్ చక్రవర్తి) చేపడతాడు. మొదట ఈ నేరానికి పాల్పడిన వ్యక్తిని పట్టుకోవడమే లక్ష్యంగా దర్యాప్తు ప్రారంభించిన అతనికి, క్రమంగా మరింత ప్రమాదకరమైన నేర ప్రపంచం గురించి తెలుస్తుంది.

Advertisement

ఈ కేసు వెనుక టెక్నాలజీని తెలివిగా ఉపయోగించుకుంటున్న ఒక యువ క్రిమినల్ గ్యాంగ్ ఉన్నట్లు పోలీసులకు అనుమానం వస్తుంది. సాధారణ నేరస్థుల్లా కాకుండా, డిజిటల్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి పోలీసులను తప్పుదోవ పట్టించే ఈ గ్యాంగ్‌ను పట్టుకోవడం దేవాంజన్ బృందానికి పెద్ద సవాలుగా మారుతుంది. ఒకవైపు నిందితుల కోసం వేట కొనసాగిస్తూనే, మరోవైపు పై అధికారుల ఒత్తిడి, మీడియా ప్రశ్నలు, ప్రజల్లో పెరుగుతున్న ఆందోళనను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఈ క్రమంలో దేవాంజన్‌తో పాటు జోయితా సేన్ (కౌశాని ముఖర్జీ), పరితోష్ సాహా (అర్పన్ ఘోషాల్), ఏసీపీ అగ్నిశ్వర్ ఛటర్జీ (మీర్ అఫ్సర్ అలీ) కూడా దర్యాప్తులో కీలకంగా వ్యవహరిస్తారు. నేరస్థులు టెక్నాలజీని ఉపయోగిస్తుంటే, పోలీసులు ఫోరెన్సిక్ ఆధారాలు, సైబర్ ఇన్వెస్టిగేషన్‌తో వారిని ఎలా ఎదుర్కొంటారన్నదే ఈ సినిమా ప్రధాన ఆసక్తి. గతంలో వచ్చిన ‘మృగయ: ది హంట్’ కథా ప్రపంచాన్ని కొనసాగిస్తూ, ఈసారి మరింత విస్తృతమైన పోలీస్ టీమ్‌తో కథను ముందుకు తీసుకెళ్లారు. సీరియస్ క్రైమ్ డ్రామాలు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ సినిమాలను ఇష్టపడేవారికి ఇది మంచి ఛాయిస్.

తెలుగులో ఉందా ?

Advertisement

అభిరూప్ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రిత్విక్ చక్రవర్తి, కౌశాని ముఖర్జీ, అర్పన్ ఘోషాల్, మీర్ అఫ్సర్ అలీ, అనన్య భట్టాచార్య ప్రధాన పాత్రల్లో నటించారు. విక్రమ్ ఛటర్జీ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. 2026 నవంబర్ 13 నుంచి ZEE5లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. 1 గంట 54 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రానికి బెంగాలీ ఒరిజినల్ ఆడియో మాత్రమే అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ లేదు.

Read Also: ఆ వీధి చివరికి వెళ్తే గూస్‌బంప్స్… వణికిస్తున్న ఈ మిస్టరీ థ్రిల్లర్ ను చూశారా?

Tags

Related News

ఓటీటీలోకి తమిళ సునామీ… ఈ కంటెట్ అస్సలు మిస్ అవ్వద్దు

ఓటీటీలోకి 20 చిత్రాలు..ఆ 2 డోంట్ మిస్!

తండ్రి ఇన్సూరెన్స్ డబ్బు కోసం స్కెచ్‌లు వేసే కొడుకులు… ఒకరి ఎత్తుకు మరొకరి పైఎత్తు.. చూస్తే నవ్వులే నవ్వులు

ఓటీటీలో మలయాళ విందు రెడీ… ఈ వీక్ మైండ్ బ్లాక్ చేసే క్రేజీ మూవీస్ ఇవే

ఇదేం తల్లి ప్రేమరా బాబూ… కొడుకు గెలుపు కోసం పాపనే లేపేసే ప్లాన్… ఓటీటీలోకి క్రేజీ స్పోర్ట్స్ థ్రిల్లర్

ప్రేమ జంటకు విలన్‌గా మారిన ఎమ్మెల్యే.. అప్పులు చేసి కొన్న ఇంటి కోసం ప్రాణాలతో చెలగాటం.. ఓటీటీలోకి రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్

బోర్ కొడుతోందా? అయితే ఈ ‘వైబ్’ ట్రై చేయండి… యూత్‌ని కట్టిపడేస్తున్న స్పై కామెడీ థ్రిల్లర్

Big Stories

Advertisement
×