Reliance Jio: ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు తమ కస్టమర్లను ఆకట్టుకోవడానికి రకరకాల ఆఫర్లను తీసుకొస్తూనే ఉంటుంది. అయితే, ఈసారి జియో ప్రీపెయిడ్ యూజర్లకు ఒక చిన్న షాక్ ఇస్తూనే.. మరో కొత్త సర్‌ప్రైజ్ ప్లాన్ చేసింది. ఇప్పటివరకు యూజర్లకు ఉచితంగా అందిస్తున్న ఖరీదైన గూగుల్ ఏఐ ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను జియో తమ ప్రీపెయిడ్ ప్లాన్ల నుంచి తొలగించింది. దానికి బదులుగా డిజైనింగ్ టూల్ కాన్వా (Canva) సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకొచ్చింది.
జియో గతంలో ఎంపిక చేసిన ప్రీపెయిడ్ ప్లాన్లతో గూగుల్ ఏఐ ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను అదనపు ఛార్జీ లేకుండా అందించింది. ఈ ప్రయోజనం విలువ రూ.35,100గా పేర్కొంది. మొత్తం 18 నెలల పాటు దీన్ని వాడుకునే అవకాశం ఇచ్చింది. అయితే ఇప్పుడు కొత్తగా ఆఫర్‌ను పొందే అవకాశం లేదు. ఇప్పటికే క్లెయిమ్ చేసిన కస్టమర్లకు మాత్రం వారి ఆఫర్ గడువు ప్రకారం ప్రయోజనం కొనసాగుతుంది. కాబట్టి.. పాత యూజర్లు ఆందోళన పడాల్సిన అవసరం లేదు.
కొత్తగా వచ్చిన కాన్వా ప్రో సబ్‌స్క్రిప్షన్ రూ.399 ప్రీపెయిడ్ ప్లాన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. దీని విలువ సుమారు రూ.4,000. ఈ ప్లాన్‌లో రోజుకు 2.5జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. వీటితో పాటు జియోగేమ్స్ మొబైల్, జియోహాట్‌స్టార్ మొబైల్ ప్లస్ హాలీవుడ్, జియోటీవీ ద్వారా ఫ్యాన్‌కోడ్ సదుపాయాలు కూడా ఉన్నాయి. జియోఏఐక్లౌడ్‌లో 50జీబీ స్టోరేజ్ కూడా ఇస్తోంది.
Also Read: డిజైన్ చూపించి ఊరించిన హువావే.. కొత్త ఫోల్డబుల్ ఫోన్ ఫీచర్లు లీక్, 16GB ర్యామ్‌తో త్వరలోనే ఎంట్రీ!
కాన్వా ప్రో లైట్ సబ్‌స్క్రిప్షన్ విలువ రూ.1,590గా ఉంది. రూ.349 ప్లాన్‌తో పాటు రోజుకు 2జీబీ లేదా అంతకంటే ఎక్కువ డేటా ఇచ్చే అర్హమైన ప్లాన్లపై రీఛార్జ్ చేసేవారికి 12 నెలల పాటు ఈ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. అంటే రూ.399 ప్లాన్ తీసుకోలేని వారికి కూడా డిజైన్ టూల్స్ ఉపయోగించే అవకాశం ఉంటుంది.
ఈ ప్రయోజనాన్ని పొందాలంటే My Jio యాప్‌లోకి వెళ్లి అందుబాటులో ఉన్న ఆఫర్‌ను క్లెయిమ్ చేయాలి. ఒక్క మొబైల్ నంబర్‌కు ఒక్కసారి మాత్రమే ఈ బెనిఫిట్ లభిస్తుంది. జియో తమ ప్లాన్లలో ఇచ్చే అదనపు ప్రయోజనాలను ఎప్పటికప్పుడు మార్చుతోంది. అందుకే రీఛార్జ్ చేసే ముందు యాప్‌లో తాజా వివరాలు, అర్హత, ఆఫర్ గడువు చూసుకోవడం మంచిది. ముఖ్యంగా కాన్వా అవసరమున్నవారు తమ నంబర్‌కు ఆఫర్ కనిపిస్తుందో లేదో ముందే చెక్ చేసుకోవాలి. పాత గూగుల్ ఏఐ ప్రో ఆఫర్‌ను కొత్త కాన్వా ప్రయోజనాలతో కలిపి ఒకటిగా భావించకూడదు.
Also Read: Jio రీఛార్జ్ గడువు ముగిస్తే ఇన్‌కమింగ్ కాల్స్ కూడా బంద్? సిమ్ యాక్టివ్‌గా ఉండాలంటే ఇలా చేయండి!