E-Paper
Advertisement

ఏం టాలెంట్ గురూ.. సంయుక్త ఫోటోలు చూసి ఆశ్చర్యపోతున్న అభిమానులు!

ఏం టాలెంట్ గురూ.. సంయుక్త ఫోటోలు చూసి ఆశ్చర్యపోతున్న అభిమానులు!
Advertisement

Samyukta Menon: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న అతి కొద్ది మంది సెలబ్రిటీలలో సంయుక్త మీనన్ (Samyuktha Menon) కూడా ఒకరు. అందం, అభినయంతో, అమాయకత్వంతో, యాక్షన్ పర్ఫామెన్స్ తో ఇలా ఒక్కటేమిటి ఏ పాత్రలోనైనా సరే లీనం అయిపోతూ అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. అలాంటి ఈమెలో ఊహించని టాలెంట్ బయటకు రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా రంగస్థలంపై ఈమె పండించిన నవరసాలు చూసి పులకించిపోతున్నారు.

రంగస్థలంపై నవరసాలు పలికించిన సంయుక్త..

వెండితెరపై అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ.. ప్రేక్షకులను అలరించే ఈమె.. తాజాగా వెండితెర పైనే కాదు రంగస్థలంపై కూడా అద్భుతమైన హావ భావాలను పలికించగలదు అని నిరూపించుకుంది. తాజాగా ఒక నాటకంలో వివిధ రకాల హావ భావాలను అద్భుతంగా వ్యక్తీకరిస్తూ నటించిన దృశ్యాలను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది సంయుక్త మీనన్. భారతీయ నాట్య శాస్త్రం, సాహిత్య ప్రకారం 9 రకాల భావాలను( శృంగారం, హాస్యం, కరుణ, రౌద్రం, వీరం, భయానకం, బీభత్సం, అద్భుతం, శాంతం) నాటక రంగంపై ప్రదర్శించి అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సంయుక్త మీనన్ లో ఇంత టాలెంట్ ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

సక్సెస్ఫుల్ హీరోయిన్ గా గుర్తింపు..

Advertisement

సంయుక్త మీనన్ విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ – రానా కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన భీమ్లా నాయక్ సినిమాలో రానా భార్యగా నటించి తెలుగుతెరకు పరిచయమైంది సంయుక్త. ఆ తర్వాత బింబిసారా సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈమె.. సార్ సినిమాతో ఏకంగా టాలీవుడ్ లో హ్యాట్రిక్ అందుకుంది. విరూపాక్ష సినిమాతో సంచలనం సృష్టించిన సంయుక్త మీనన్.. అఖండ 2: తాండవంలో కూడా నటించి మెప్పించింది. అలాగే నారీ నారీ నడుమ మురారి సినిమాలో కూడా నటించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అలా టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ హీరోయిన్గా దూసుకుపోతున్న సంయుక్త మీనన్ చేతిలో ఇప్పుడు సుమారుగా 6కుపైగా చిత్రాలు ఉండడం గమనార్హం.

ALSO READ: సమంత సీమంతం వేడుక ఏ పద్ధతిలో జరిగిందో తెలుసా?

సంయుక్త సినిమాలు..

Advertisement

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న ‘స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్’ సినిమాలో ఈమె హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ చిత్రం హైందవలో కూడా భాగమైంది. అంతేకాదు నిఖిల్ సిద్దార్థ్ తో కలిసి పీరియడ్ యాక్షన్ డ్రామాగా పొందుతున్న స్వయంభు చిత్రంతో పాటు రామ్ పోతినేని 23వ చిత్రం, అలాగే మహారాగ్ని సినిమాలో కూడా నటిస్తోంది. అలాగ మలయాళ చిత్రం రామ్ తో పాటు రాఘవ లారెన్స్ బెంజ్ , తన స్వీయ నిర్మాణంలో వస్తున్న ది బ్లాక్ గోల్డ్ , అలాగే ప్రైమ్ వీడియో ఒరిజినల్ వెబ్ సిరీస్ గువ్వల చెరువు ఘాట్ వంటి చిత్రాలు, సిరీస్ లతో బిజీగా మారింది సంయుక్త మీనన్.

Related News

సమంత సీమంతం వేడుక ఏ పద్ధతిలో జరిగిందో తెలుసా?

ఈఎన్ఈ రిపీట్ లో ఎంతమంది గెస్ట్ లుగా నటించారో తెలుసా?

‘రామాయణ’ మూవీ క్రేజే వేరయా.. మరో సెన్సేషనల్ మార్క్..!

మహేష్ బాబు నెక్స్ట్ ప్రాజెక్టు కన్ఫామ్.. డైరెక్టర్ ఎవరో తెలుసా..?

వామ్మో.. మాళవిక నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

మృణాల్ ఠాకూర్ స్టైలిష్ లుక్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో అదరగొట్టేస్తోందిగా!

రామకృష్ణకు అప్పటికే పెళ్లైందా? గీతాంజలి కొడుకు షాకింగ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×